AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మే 28 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..కొత్త ఉద్యోగ ఆఫర్లు..!

Horoscope Today: మే 28 గురువారం మేష రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు అందే అవకాశముండగా, వృత్తి, వ్యాపారాల్లో నష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వృషభ రాశి వారు బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి అనుకున్న పనులు సకాలంలో పూర్తవడంతో పాటు ఉద్యోగ జీవితం సంతృప్తికరంగా సాగుతుంది. ఇలా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి ఈ రోజు గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపనున్నాయో తెలుసుకుందాం.

మే 28 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు..కొత్త ఉద్యోగ ఆఫర్లు..!
Rashifal In Telugu 28 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 28, 2026 | 5:41 AM

Share

దిన ఫలాలు (మే 28, 2026): మేష రాశికి చెందిన ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నష్టాల నుంచి బయటపడతాయి. వృషభ రాశి వారు ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. మిథున రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతా‍యి. ఉద్యోగ జీవితం బాగా సంతృప్తికరంగా సాగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు కొద్దిగా నష్టాల నుంచి బయటపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కొందరు మిత్రులతో హ్యాపీగా కాలక్షేపం చేస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపు చర్యలు చేపట్టడం చాలా అవసరం. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ బాధ్యతలను సంతృప్తికరంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల పరిస్థితులుంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ, తిప్పట తప్పక పోవచ్చు. అదనపు ఆదాయ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. నిరుద్యోగులకు శుభ వార్త అందే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా బాగా సాయం చేయడం జరుగుతుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతా‍యి. ఉద్యోగ జీవితం బాగా సంతృప్తికరంగా సాగుతుంది. అయితే, ఉద్యోగులు అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. పిల్లల విద్య, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. కుటుంబంలో ఒకటి రెండు చిన్న చిన్న సమస్యలు తలెత్తే సూచనలున్నాయి. ఎవరితోనైనా ఆచితూచి వ్యవహరించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆర్థిక విషయాలకు గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగి పోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు, అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామ్య వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొద్దిపాటి ధనయోగానికి అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు చేతికి అందుతుంది. కొన్ని ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు బాగా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహ, వాహనాల కొనుగోలు మీద దృష్టి పెడతారు. ఆరోగ్యంలో కొద్దిగా మెరుగుదల కనిపిస్తుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ శని కారణంగా వృత్తి, ఉద్యోగాలవారికి పని ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంటుంది. విశ్రాంతి కరువవుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సానుకూలంగా పూర్తవుతాయి. వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశకావేషాలకు ఇది సమయం కాదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో కొద్దిగా ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది. అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బాధ్యతలు, లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ వృద్ధి చెందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. మిత్రుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

గ్రహ సంచారం కొద్దిగా అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో అనుకున్న పనుల్ని అనుకున్నట్టు పూర్తి చేస్తారు. రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థక పరిస్థితి గతం కంటే గణనీయంగా మెరుగుపడుతుంది. వసూలు కాని బాకీలు ఇప్పుడు వసూలవుతాయి. సమాజ సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. ఇంటా బయటా మాటకు, చేతకు బాగా విలువ పెరుగుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతల్ని పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. లాభదాయక వ్యవహారాలు ఎక్కువగా చేపడతారు. ఆర్థికంగా చాలావరకు అను కూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. మధ్యవర్తుల జోక్యంతో స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మిత్రులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో మీ సలహాలకు, సూచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బాధ్యతల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థికంగా సానుకూలంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలమవుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగుల ప్రతిభకు, శ్రమకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాల్ని పొందుతారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాలకు సంబంధించిన ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. ముఖ్యమైన వ్యవహారాలను వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి చేస్తారు. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు చాలావరకు చక్కబడతాయి. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు ఫలిస్తాయి.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఈ రాశివారికి ప్రస్తుతం గురు బలం బాగా అనుకూలంగా ఉంది. రోజంతా సాఫీగా, హ్యాపీగా గడిచి పోతుంది. అనుకున్న పనులు, వ్యవహారాలు సకాలంలో సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదా యం బాగా పెరగడం, ఖర్చులు తగ్గడం జరుగుతుంది. వ్యాపారులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఊహించని ప్రతిఫలం లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు సరైన పరిష్కారం లభిస్తుంది.

Follow Us