బల్లులు ఇంట్లోకి రావడానికి అసలు కారణం ఇదేనట.. ఎలా తరిమికొట్టాలంటే?
27 May 2026
Anand T
ఇంట్లో దోమలు, ఈగలు, బొద్దింకలు ఎక్కువగా ఉంటే వాటిని ఆహారంగా తీసుకోవడానికి బల్లులు వస్తాయి.ముఖ్యంగా వంటగది శుభ్రంగా లేకపోతే, కీటకాలు పెరిగి, బల్లులు కూడా పెరుగుతాయి.
ఇంట్లో ఆహారం, పండ్లను సరిగ్గా నిల్వ చేయకపోవడం కూడా బల్లులను ఆకర్షించడానికి ఒక కారణం. కాబట్టి, ఆహారాన్ని ఎల్లప్పుడూ మూసి ఉంచాలి.
తలుపులు, కిటికీలు ఎక్కువసేపు తెరిచి ఉండటం వల్ల, బల్లులు బయటి నుండి ఇంట్లోకి రావచ్చు. కిటికీలకు తెరను అమర్చడం లేదా కర్టెన్స్ వేయడం ద్వారా బల్లుల ఇంట్లోకి రాకుండా అడ్డుకోవచ్చు.
బల్లులు సాధారణంగా గోడలలోని పగుళ్లు, చిన్న రంధ్రాల్లో వాటి నివాసాలను ఏర్పాటు చేసుకుంటాయి. అందువల్ల, మీ ఇంటి గోడలకు ఏవైనా రంద్రాలు ఉంటే వాటని వెంటనే మూసివేయండి.
ఇంట్లో సామాను ఎక్కువగా ఉన్నచోట బల్లులు సులభంగా దాక్కుంటాయి. పాత పెట్టెలు, ఫర్నిచర్, అనవసరమైన వస్తువులను తోలగించడం ద్వారా బల్లుల సమస్య తగ్గుతుంది.
బల్లులు తేమగా, వెచ్చగా ఉండే ప్రదేశాలను ఎక్కువగా ఇష్టపడతాయి. వర్షాకాలంలో, శీతాకాలంలో అవి వెచ్చదనం కోసం ఇంట్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఇంటి చుట్టూ చెత్త, పొదలు ఎక్కువగా ఉంటే, కీటకాల సంఖ్య పెరుగుతుంది. దీని కారణంగా, బల్లులు కూడా ఇంటి వైపు రావడం ప్రారంభిస్తాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బల్లుల సమస్యను తగ్గించడానికి మీరు వెల్లుల్లి, ఉల్లిపాయ, మిరియాల పొడి వంటి సహజ పద్ధతులను కూడా ఉపయోగించవచ్చు. కొందరు గుడ్డు పెంకులు లేదా నాఫ్తలీన్ ఉండలను కూడా ఉపయోగిస్తారు.
ఇంటిని శుభ్రంగా, గాలి, వెలుతురు వచ్చేలా ఉంచడం ద్వారా, కీటకాలు లోపలికి రాకుండా నిరోధించడం ద్వారా, మీరు బల్లుల సమస్యను చాలా వరకు నివారించవచ్చు.