AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cannes Film Festival 2026: కేన్స్‌లో సినిమాలకంటే గ్లామర్‌కే హైప్?.. రెడ్ కార్పెట్ చుట్టూనే రచ్చ!

Cannes Film Festival 2026: కేన్స్‌లో సినిమాలకంటే గ్లామర్‌కే హైప్?.. రెడ్ కార్పెట్ చుట్టూనే రచ్చ!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 27, 2026 | 5:10 PM

Share

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాల కంటే సెలబ్రిటీల రెడ్ కార్పెట్ లుక్స్‌కే ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోందన్న చర్చ జోరందుకుంది. ఆలియా భట్, తారా సుతారియా, ఐశ్వర్యరాయ్ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫ్యాషన్, బాడీ షేమింగ్ చర్చలు హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో కేన్స్ అంటే సినిమా వేడుకా? లేక గ్లామర్ షోనా? అంటూ ఇండియన్ సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.

కేన్స్ చిత్రోత్సవాలకు డే బై డే అర్థం మారిపోతోందా? యూత్‌ నయా అర్థాలు వెతుక్కుంటోందా? గ్లోబల్‌రేంజ్‌ క్రేజ్‌ ఉన్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కి వచ్చిన సినిమాల కన్నా, సెలబ్రిటీల రెడ్‌ కార్పెట్‌ లుక్కులకు అట్రాక్షన్‌ పెరుగుతోందా? వార్తలన్నీ రెడ్‌ కార్పెట్‌ కేంద్రంగానే సాగుతున్నాయా? చూసేద్దాం వచ్చేయండి. ఆలియాని కేన్స్ లో పట్టించుకోలేదా? పాపరాజీలు ఆలియాను గుర్తుపట్టలేదా? వాంటెడ్‌గానే పక్కనపెట్టేశారా? నిన్న మొన్నటివరకు ఇదో డిస్కషన్‌. అసలు ఆలియాను తారా సుతారియా ఓవర్‌ టేక్‌ చేసేశారన్న వార్తలు కూడా జోరుగానే వైరల్‌ అయ్యాయి. కేన్స్ అంటే జస్ట్ చలనచిత్రోత్సవమే కాదు, ఎన్నో బ్రాండ్‌లు అక్కడ తమని తాము ఆవిష్కరించుకోవాలని పోటీపడుతుంటాయి. ఏ స్టార్‌ ఏ ప్రాడెక్ట్ ని ఎలా ప్రెజెంట్‌ చేశారన్నది కూడా డిస్కషన్‌ పాయింటే. కేన్స్ రెడ్‌ కార్పెట్‌ క్లిప్స్ ఇలా సోషల్‌ మీడియాలో పడతాయో లేదో, అలా వైరల్‌ అవుతాయి. కేన్స్ రెడ్‌ కార్పెట్‌ని దాదాపు పాతికేళ్లుగా రూల్‌ చేస్తున్న క్వీన్‌ ఐశ్వర్య ఈ సారి అటెండ్‌ అవుతారా? లేదా? అన్న చర్చ ఆ మధ్య ఇంట్రస్టింగ్‌గా సాగింది. తీరా ఐశ్వర్య కేన్స్ లో అడుగుపెట్టనే పెట్టేశారు. ఆమె లుక్‌ వైరల్‌ అయింది. బాడీ షేమింగ్‌ స్టార్ట్ అయింది. తమని తాము ఎలా ప్రెజెంట్‌ చేసుకోవాలో అమ్మాయిలకు బాగా తెలుసు. ఈ విషయం గురించి ఎవరూ ఎవరికీ సంజాయిషీలు చెప్పుకోనక్కర్లేదని కంగనా లాంటి వాళ్లు ఐశ్వర్యకు సపోర్ట్ చేశారు. నిజానికి కేన్స్ కి సంబంధించి ఈ విషయాలు వైరల్‌ అయినంతగా ఇన్‌సైడ్‌ హాల్‌ ఏంజరిగిందనే వివరాలు కాలేదు. అందుకే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అంటే సినిమాలు కాదా… రెడ్‌ కార్పెట్‌ చుట్టూ తిరిగే వ్యవహారమేనా? అని మాట్లాడుకుంటున్నారు ఇండియన్‌ క్రిటిక్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

Follow Us