మాస్ నుంచి ఎమోషన్స్ వైపు హీరోల మలుపు.. ఇప్పుడు కన్నీళ్లు గ్యారెంటీ
టాలీవుడ్‌లో ఇప్పుడు ఎమోషనల్ కథల ట్రెండ్ నడుస్తోంది. రామ్ చరణ్ ‘పెద్ది’తో మరోసారి భావోద్వేగ డ్రామాకు సిద్ధమవుతుండగా, ప్రభాస్ ‘ఫౌజీ’, విజయ్ దేవరకొండ కొత్త ప్రాజెక్టులు కూడా మనసును కదిలించే కథలుగానే తెరకెక్కుతున్నాయి. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు బలమైన ఎమోషన్స్ జోడిస్తూ హీరోలు ప్రేక్షకులను కన్నీరు పెట్టించే ప్రయత్నంలో ఉన్నారు.
సీనియర్లు మాత్రమే కాదు.. ఈ జనరేషన్ హీరోల అడుగులు సైతం ఎమోషనల్ కథల వైపే వెళ్తున్నాయి. ఒక్కసారైనా కంటతడి పెట్టించే కథ చేయకపోతే ఎలా అన్నట్లు.. అంతా మూకుమ్మడిగా అలాంటి మనసును కదిలించే కథలనే ఎంచుకుంటున్నారు. రామ్ చరణ్ అయితే ఈ రేసులో అందరికంటే ముందున్నారు. మరి ఆయనతో పోటీ పడుతున్న హీరోలెవరో చూద్దాం.. రంగస్థలంకు ముందు రామ్ చరణ్‌తో మాస్ సినిమాలే వర్కవుట్ అవుతాయనుకున్నారంతా. కానీ సిట్టిబాబు వచ్చాక సీన్ అంతా మారిపోయింది. ఆఫ్టర్ రంగస్థలం చరణ్ నటనలో మెచ్యూరిటీ పెరిగింది. RRRలో ఎమోషనల్ సీన్స్‌తో ఏడిపించారు. గేమ్ ఛేంజర్‌లో అప్పన్నగా అలరించారు. ఇప్పుడు పెద్దిలో మరోసారి ఎమోషనల్ డ్రామా పండిస్తున్నారు మెగా వారసుడు. పెద్ది కమర్షియల్ సినిమాలాగే కనిపిస్తున్నా.. హై రేంజ్ ఎమోషనల్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు. ముఖ్యంగా ఢిల్లీ ఎపిసోడ్ కన్నీరు పెట్టిస్తుందంటున్నారు. ప్రభాస్ సైతం హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఫౌజీలో ఎమోషన్స్‌తో మ్యాజిక్ చేయబోతున్నారు. సీతా రామం తర్వాత మనసును కదిలించే మరో కథతో రాబోతున్నారు హను. దానికి ప్రభాస్ స్టార్ పవర్ హెల్ప్ కానుంది. విజయ్ దేవరకొండ సైతం మనసు మార్చుకుని.. ఎమోషన్స్ వైపు పరుగులు పెడుతున్నారు. రణబాలి, రౌడీ జనార్ధన విభిన్నమైన జోనర్స్‌లో వస్తున్నాయి. ఆ తర్వాత హాయ్ నాన్న ఫేమ్ శౌర్యుతో హైలీ ఎమోషనల్ కథకు ఓకే చెప్పారు రౌడీ బాయ్. కిరణ్ అబ్బవరం సైతం చెన్నై లవ్ స్టోరీతో మనసు బరువెక్కిస్తానంటున్నారు. మొత్తానికి ఎమోషనల్ సినిమాల ట్రెండ్ మొదలైందిప్పుడు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్
సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు
పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు
పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!
నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్
60 లీటర్ల తల్లిపాలు దానం చేసిన జ్వాల!
ఫోర్జరీ పత్రాలతో జైలు నుంచి దర్జాగా రిలీజైన జీవిత ఖైదీ..
గుడిలోకి వెళ్లి భక్తితో దణ్ణం పెట్టాడు.. ఆ తర్వాత..!

