ఈ పూలతో ఇంట్లోనే నేచురల్ పెర్ఫ్యూమ్ తయారు చేసేయండి 

Prasanna Yadla

  27  May 2026

Pic credit - Pinterest

కొందరికి కొన్ని పెర్ఫ్యూమ్ వాసనలు పడవు దీని వలన ఎంతో ఇబ్బంది పడుతుంటారు 

పెర్ఫ్యూమ్

అలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా ఎలాంటి  రసాయనాలు లేకుండా ఇంట్లోనే పెర్ఫ్యూమ్స్‌ తయారు చేసుకోవచ్చు

ఇంట్లోనే పెర్ఫ్యూమ్స్‌

అయితే, తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ పెర్ఫ్యూమ్ ను ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి .

తక్కువ ఖర్చుతో..

రెండు కప్పుల  గులాబీ రేకులు, రెండు  గ్లాసులు నీరు, ఒక చిన్న గాజు సీసా,  రోజ్ వాటర్, కొకొబ్బరి నూనె లేదా బాదం నూనెను తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

ముందుగా గులాబీ రేకులను తీసుకుని వాటిని శుభ్రంగా  కడిగి పెట్టుకోవాలి 

స్టెప్ -1 

ఆ తరవాత ఒక గిన్నెలో నీళ్లు పోసి దానిలో పువ్వుల రేకులు వేయాలి.

స్టెప్ -2

సన్నని మంటపై 30 నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీరు గులాబీ రంగులోకి మారాక  స్టవ్ ఆఫ్ చేయాలి.

స్టెప్ -3

ఇప్పుడు ఆ నీటిని వడకట్టి బాగా చల్లారనివ్వాలి. దానిలో  రోజ్ వాటర్, బాదం నూనె వేసి గాజు సీసాలో నిల్వ చేస్తే పెర్ఫ్యూమ్ రెడీ

స్టెప్ -4