AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చీరకట్టుతోనే చితక్కొడుతున్న హీరోయిన్లు.. ఇండస్ట్రీలో కొత్త మాస్ ట్రెండ్!

చీరకట్టుతోనే చితక్కొడుతున్న హీరోయిన్లు.. ఇండస్ట్రీలో కొత్త మాస్ ట్రెండ్!

Dr. Challa Bhagyalakshmi
| Edited By: |

Updated on: May 27, 2026 | 5:07 PM

Share

చీరకట్టులో యాక్షన్ సీన్స్ చేస్తూ సమంత, నయనతార, రష్మికలాంటి స్టార్ హీరోయిన్లు కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు. ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్‌లో సమంత చేసిన మాస్ ఫైట్స్ ఆకట్టుకోగా, ‘రాక్కాయి’లో నయన్ కూడా ఇదే స్టైల్‌లో కనిపించారు. ఇకపై హీరోయిన్ యాక్షన్ అంటే ప్యాంట్-షర్ట్ కాదు.. చీరకట్టుతోనే చితక్కొట్టే రోజులు వచ్చేశాయంటోంది ఇండస్ట్రీ.

చీరకట్టుకుంటే సంప్రదాయంగానే కనిపించాలా ఏంటి? ఛలో ఇరగదీద్దాం అని యాక్షన్‌లోకి దిగేస్తే మాస్‌గా ఉండదా? రీసెంట్‌ గా మాస్‌ యాక్షన్‌ సినిమాలకోసం రంగంలోకి దిగేటప్పుడు శారీస్‌నే ప్రిఫర్‌ చేస్తున్నారు మన ఇంటి బంగారాలంతా. మా ఇంటి బంగారం ట్రైలర్‌తో ఇంట్రస్ట్ క్రియేట్‌ చేస్తున్నారు సమంత. ఒక్కొక్కరినీ కొడతాను చూడూ అంటూ ట్రైలర్‌లో డైలాగ్‌ ఆకట్టుకుంటోంది. దానికి తోడు చీరకట్టుతో సామ్‌ చేసిన యాక్షన్‌ సీక్వెన్స్ మెప్పిస్తోంది. దీని గురించి మాట్లాడుతూ మాస్‌గా ఉంది కదా అని సామ్‌ అన్న తీరు యమా క్యూట్‌ అంటున్నారు ఫ్యాన్స్. చీరకట్టుకుని యాక్షన్‌ చేయడం నెక్ట్స్ లెవల్‌ అంటూ బ్లాస్ట్ ప్రెస్‌మీట్‌లో అభిరామి కూడా ఓపెన్‌ అయ్యారు. ప్యాంటు షర్టులతో కాదు, చీరకట్టుతో చేసే ఫైట్స్ ఇక ట్రెండ్‌ అవుతాయనే మాట వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఆల్రెడీ ఇదే రూట్లోనే ఉన్నానంటున్నారు నయన్‌ కూడా. ఆమె నటిస్తున్న ఫీమేల్‌ ఓరియంటెడ్‌ సినిమా రాక్కాయి గ్లింప్స్ లో ఫైట్‌ షాట్‌ కూడా చీరకట్టులోనే ఉంది. అటు రష్మిక మైసా ఫైట్స్ కూడా ఈ కోవలోనే ఉండే ఛాన్సెస్‌ పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో, ఇక ఫైట్స్ అంటే అమ్మాయిలు ప్యాంట్‌ షర్టుల జోలికి పోనక్కర్లేదన్నమాట. చీరకట్టుకున్నా చితక్కొట్టడం గ్యారంటీ అంటోంది ఫిల్మ్ ఇండస్ట్రీ.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సోషల్ మీడియా అద్భుతం.. 15 ఏళ్ల తర్వాత కన్నవారి చెంతకు

పెన్షన్ కోసం 90 ఏళ్ల అత్తను వీపుపై 9 కి.మీ. మోసుకెళ్లిన కోడలు

US Visa Rules: ‘అమెరికా ఫస్ట్’ కొత్త వీసా షెడ్యూలింగ్ టూల్‌

పొలం చదును చేస్తుండగా అద్భుతం..అమితానందంలో రైతు!

నీటి కోసం బస్సును ఆపిన కోతి.. మూగజీవాల వీడియో వైరల్

Follow Us