walking with barefoot: చెప్పులు లేకుండా నడిస్తే ఇన్ని లాభాలా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు..
పాదాలకు గాయం కాకుండా ఉండటానికి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టండి. ఎందుకంటే పాదాలు మృదువుగా ఉంటాయి. రోజుకు 10 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్కువ సేపు చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాలు కందిపోయి గాయాలు అయ్యే అవకాశం ఉంది. శుభ్రమైన ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవండి. చెత్తా చెదారంతో ఉన్న ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యదాయకం కాదు. ఇక మీ కాళ్ళను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది మీ కాలు కండరాలను బలపరుస్తుంది.
ప్రస్తుతం చాలా మంది తమ రోజువారి వ్యాయామంలో వాకింగ్ తప్పనిసరిగా ఎంచుకుంటున్నారు. అయితే, ఇలా నడిచేటప్పుడు చెప్పులు, బూట్లు ధరిస్తారు. కానీ, ఈ రెండింటికి బదులు చెప్పులు లేకుండా నడవడం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. నేలపై చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇలా చెప్పులు లేకుండా నడవడం వల్ల భూమి శక్తితో అనుసంధానం అవుతుంది. శరీరం విద్యుత్ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మన కండరాలకు మేలు చేస్తుంది. చెప్పులు లేకుండా నడవడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కాళ్లను బలపరుస్తుంది: చెప్పులు లేకుండా నడవడం వల్ల మన కాళ్ల కండరాలు, స్నాయువులు బలపడతాయి. ఇది దిగువ వీపుకు కూడా మద్దతు ఇస్తుంది. మనం చెప్పులు లేకుండా నడిస్తే మన పాదాల పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇది చీలమండపై ఒత్తిడిని తగ్గిస్తుంది. తుంటి, మోకాళ్లు, వీపులో నొప్పి ఉండదు.
ఒత్తిడిని తగ్గిస్తుంది: గ్రౌండింగ్ చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. చెప్పులు లేకుండా నడవడం మన మెదడును ఉత్తేజపరుస్తుంది. ఇది ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. పాదాల కింద ప్రకృతి అనుభూతి మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇంద్రియ నాడులు చురుగ్గా ఉంటాయి: మనం బూట్లు లేదా చెప్పులతో నడిచినప్పుడు, మన పాదాలలోని ఇంద్రియ నాడులు తక్కువ చురుకుగా పనిచేస్తాయి. కానీ చెప్పులు లేకుండా నడవడం వల్ల మన పాదాల్లోని ఇంద్రియ నాడులు ఉత్తేజితమవుతాయి. మన శరీరం కూడా చాలా అప్రమత్తంగా ఉంటుంది.
మెరుగైన మంచి నిద్ర: చెప్పులు లేకుండా నడవడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది మన శరీరానికి మరింత విశ్రాంతినిస్తుంది. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేస్తుంది. కాబట్టి మంచి నిద్ర కోసం గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయండి.
చెప్పులు లేకుండా నడుస్తున్నప్పుడు ఇలా చేయండి: పాదాలకు గాయం కాకుండా ఉండటానికి నెమ్మదిగా నడవడం మొదలుపెట్టండి. ఎందుకంటే పాదాలు మృదువుగా ఉంటాయి. రోజుకు 10 నిమిషాల పాటు చెప్పులు లేకుండా నడవడం ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎక్కువ సేపు చెప్పులు లేకుండా నడవకూడదు. పాదాలు కందిపోయి గాయాలు అయ్యే అవకాశం ఉంది. శుభ్రమైన ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవండి. చెత్తా చెదారంతో ఉన్న ప్రదేశంలో చెప్పులు లేకుండా నడవడం ఆరోగ్యదాయకం కాదు. ఇక మీ కాళ్ళను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ఇది మీ కాలు కండరాలను బలపరుస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..