Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Symptoms: ఈ లక్షణాలు మీలో కూడ కనిపిస్తే ఆలస్యం చేయకండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే!

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం వస్తుంది. నిజానికి మధుమేహం రావడానికి అనేక కారణాలున్నాయి. కానీ మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహార అలవాట్లలో మార్పులు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతాయంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం కూడా దీని వెనుక ప్రధాన కారకాలని అంటున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు మీరు చేయవలసిన..

Diabetes Symptoms: ఈ లక్షణాలు మీలో కూడ కనిపిస్తే ఆలస్యం చేయకండి.. లేదంటే ప్రమాదంలో పడ్డట్లే!
Diabetes Symptoms
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 21, 2023 | 1:59 PM

ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి మధుమేహం వస్తుంది. నిజానికి మధుమేహం రావడానికి అనేక కారణాలున్నాయి. కానీ మధుమేహం వెనుక ప్రధాన కారణం శారీరక శ్రమ లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహార అలవాట్లలో మార్పులు మధుమేహం వచ్చే ప్రమాదాన్ని మరింత పెంచుతాయంటున్నారు. ఆల్కహాల్ తీసుకోవడం, అధికంగా జంక్ ఫుడ్ తినడం కూడా దీని వెనుక ప్రధాన కారకాలని అంటున్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు మీరు చేయవలసిన మొదటి పని జీవనశైలిని మార్చడం. పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు వ్యాయామం, యోగా వంటివి జీవితంలో ముఖ్య భాగంగా చేసుకోవాలి. అయితే మధుమేహాన్ని ఎలా నివారించాలి? దాని ప్రారంభ లక్షణాలు ఏమిటి? అనే విషయం చాలా మందికి తెలియదు. నిపుణుల మాటల్లో మీకోసం..

అధిక బరువు ఉన్నవారు, వంశ పారంపర్యంగా మధుమేహం ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అధిక బరువు, తప్పుడు ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి దారితీస్తాయి. అందుకు తొలుత బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. మంచి ఆహారం తిసుకోవాలి. ఎక్కువ నీళ్లు తాగాలి. ఉదయం-సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రీ-డయాబెటిస్ లక్షణాలు?

చాలా ఆలస్యంగా ఈ వ్యాధి నిర్ధారణ అయ్యేంత వరకూ అప్రమత్తం అవరు. సాధారణంగా ఏ వ్యక్తిలోనైనా డయాబెటిస్‌ వచ్చే ముందు ప్రీ-డయాబెటిస్ లక్షణాలు కనిపిస్తాయి. కానీ అది సమయానికి గుర్తించాలి. ఆలస్యం చేస్తే వారిలో టైప్ 2 డయాబెటిస్‌ను అభివృద్ధి చేందుతుంది. సాధారణ ప్రీ-డయాబెటిస్ లక్షణాల్లో ఒకటి ఆకలి పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది, తీవ్రమైన అలసట, అధిక దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పురుషులు లేదా మహిళల్లో మధుమేహం తలెత్తితే అది వారి హార్మోన్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్‌ వచ్చిన మహిళల్లో హార్మోన్ స్థాయి తగ్గుదల కూడా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..

మధుమేహ వ్యాధిగ్రస్తులు ఫైబర్ ఎక్కువగా ఉండే అన్ని పండ్లను తినవచ్చు.. ముఖ్యంగా నారింజ, కివీ వంటి సీజనల్ పండ్లు మధుమేహ రోగులకు కూడా మేలు చేస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్, వేయించిన ఆహారాలు, బియ్యం, బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం మానుకోవాలి. మామిడి, పైనాపిల్ వంటి తీయ్యగా ఉండే ఆహారాలు కూడా తినకూడదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.