AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ODI World Cup 2023: టీం ఇండియా ఓటమి తట్టుకోలేక ఆగిన యువకుడి గుండె.. ఎక్కడంటే?

ఓడీఐ వరల్డ్‌ కప్‌లో టీంఇండియా ఓటమి ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచింది. దీంతో కోట్ల మంది అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలలో వీక్షించారు. వేల మంది స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే భారీ అంచనాలతో బరిలోక దిగిన టీం ఇండియా ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రౌండ్‌లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అభిమానులతోపాటు టీవీలకు అతుక్కుపోయిన వారు కూడా..

ODI World Cup 2023: టీం ఇండియా ఓటమి తట్టుకోలేక ఆగిన యువకుడి గుండె.. ఎక్కడంటే?
Cricket Fan Dies Of Heart Attack
Follow us
Srilakshmi C

|

Updated on: Nov 20, 2023 | 12:00 PM

తిరుపతి, నవంబర్‌ 20: ఓడీఐ వరల్డ్‌ కప్‌లో టీంఇండియా ఓటమి ప్రతి ఒక్కరినీ నిరాశ పరిచింది. దీంతో కోట్ల మంది అభిమానులు ఆశలు అడియాశలయ్యాయి. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌ను కోట్లాది మంది ప్రేక్షకులు టీవీలలో వీక్షించారు. వేల మంది స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అయితే భారీ అంచనాలతో బరిలోక దిగిన టీం ఇండియా ఓటమి పాలవ్వడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. గ్రౌండ్‌లో ప్రత్యక్షంగా వీక్షిస్తున్న అభిమానులతోపాటు టీవీలకు అతుక్కుపోయిన వారు కూడా హతాశులయ్యారు. ఈ క్రమంలో తిరుపతిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీం ఇండియా పరాజయాన్ని తట్టుకోలేక ఓ యువకుడు హాట్‌ ఎటాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. క్రికెట్ చూస్తూనే క్రికెట్‌ అభిమాని ప్రాణం కోల్పోవడం కలచి వేసింది.

తిరుపతి జిల్లా రూరల్ మండలం దుర్గ సముద్రానికి చెందిన జ్యోతి కుమార్ బీటెక్‌ పూర్తి చేశాడు. స్థానికంగా కంప్యూటర్‌ సెంటర్‌ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను అతడు స్నేహితులతో కలిసి వీక్షిస్తున్నాడు. అయితే భారత్ బ్యాటింగ్ సమయంలో తీవ్ర నిరాశ చెందాడు. బౌలర్స్‌ మ్యాచ్ గెలిపిస్తారని ఆశపడ్డాడు. కానీ ఆ తర్వాత మ్యాచ్ చేజారుతుండటంతో జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. సాయంత్రం ఆరు గంటలకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యాక.. త్వరగానే 3 ఆస్ట్రేలియా వికెట్లు పడటంతో.. ఇక మ్యాచ్ మనదే అనుకున్నారంతా.

కానీ ఆ తర్వాత మన బౌలర్లు వరుసగా పరుగులు ఇచ్చేస్తుంటే, జ్యోతి కుమార్ తీవ్ర ఆందోళన చెందాడు. ఆస్ట్రేలియా గెలుపు, ఇండియా ఓటమి తర్వాత ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకోవడాన్ని చూసి అతను తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో జ్యోతి కుమార్‌ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే తోటి స్నేహితులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కుమారుడి హఠాన్మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. త్వరలో వివాహం చేయాలనుకున్నామని, ఇంతలో తమ బిడ్డ చేజారిపోతాడని ఊహించలేకపోయాం అంటూ రోధించారు.

ఇవి కూడా చదవండి

వరల్డ్‌ కప్‌లో టీం ఇండియా మ్యాచ్ ఓటమి అతని ప్రాణాలపైకి తెచ్చింది. ఈ మ్యాచ్ అతను చూడకపోయి ఉంటే, బతికుండే వాడని తల్లిదండ్రులు విలపించారు. అనవసరంగా చూసి, ప్రాణం కోల్పోయినట్లైందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా తొలుత చెలరేగిన టీమ్ ఇండియా ఎన్నో ఆశలు పెట్టుకునే చేసింది. కానీ ఫైనల్‌ మ్యాచ్‌లో గట్టి పోటీ ఇవ్వకుండా బేజారుగా ఆడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.