Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో శోభాయమానంగా పుష్పయాగం.. స్వామి వారికి 8 టన్నుల పువ్వులతో..
పవిత్ర కార్తికమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వైభవంగా పుష్పార్చన చేశారు. తమిళనాడు నుంచి 4 టన్నులు, కర్నాటక నుంచి 2 టన్నులు,

తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అంతకు ముందు ఉభయ దేవేరులతో పాటు స్వామి వారికి స్వపన తిరుమంజనం నిర్వహించారు. తిరుమలలో శ్రీవారి పుష్పయాగం వైభవంగా జరిగింది. 17 రకాల పుష్పాలు, పత్రాలతో పుష్పయాగం కన్నుల పండగగా నిర్వహించారు. పవిత్ర కార్తికమాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో పుష్పయాగాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సువాసనలు వెదజల్లే 11 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారికి వైభవంగా పుష్పార్చన చేశారు. తమిళనాడు నుంచి 4 టన్నులు, కర్నాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ నుంచి 2 టన్నుల పుష్పాలు తీసుకొచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి పుష్ప పత్రాలను తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చారు. అంతకు ముందు ఉభయ దేవేరులతో పాటు స్వామి వారికి స్వపన తిరుమంజనం నిర్వహిచారు. సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పయాగ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మలయప్పస్వామి, అమ్మవార్ల ఉత్సవర్లను పట్టు వస్త్రాభరణాలతో అలంకరించి వేదమంత్రాల నడుమ పుష్పకైంకర్యాన్ని చేశారు అర్చకులు. చామంతి, సంపంగి, నూరు వరహాల పుష్పాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. వేదపండితులు రుగ్వేదం, శుక్లయజుర్వేదం, కృష్ణయజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పఠించారు. కార్యక్రమంలో తితిదే ఈవో ధర్మారెడ్డి పాల్గొన్నారు. దాతల సహాయంతో పుష్పయాగం జరుగుతుందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
శ్రీవారికి పుష్పయాగం.. వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




