AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahendra Singh Dhoni: క్రికెట్ ప్రపంచానికి దూరంగా ధోని.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో బిజి బిజీగా.. వీడియో

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి తన పుట్టిన రోజు (నవంబర19) గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. అర్ధరాత్రి తన భర్త ధోని, కూతురు జీవాతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. ధోనీ క్యూట్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అర్ధరాత్రి పార్టీ, కేక్‌ కట్‌ చేస్తున్న ఈ దృశ్యాలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి.

Mahendra Singh Dhoni: క్రికెట్ ప్రపంచానికి దూరంగా ధోని.. భార్య పుట్టిన రోజు వేడుకల్లో బిజి బిజీగా.. వీడియో
Mahendra Singh Dhoni
Basha Shek
|

Updated on: Nov 19, 2023 | 7:29 PM

Share

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ భార్య సాక్షి తన పుట్టిన రోజు (నవంబర19) గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. అర్ధరాత్రి తన భర్త ధోని, కూతురు జీవాతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకొంది. ధోనీ క్యూట్ ఫ్యామిలీకి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అర్ధరాత్రి పార్టీ, కేక్‌ కట్‌ చేస్తున్న ఈ దృశ్యాలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. కాగా మాజీ కెప్టెన్ ధోని ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి దూరంగా నైనిటాల్‌లో తన కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. అతని కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నైనిటాల్ నుంచి కెప్టెన్ కూల్ వరల్డ్ కప్ వీక్షిస్తున్న సంగతి తెలిసిందే. ధోనీ 2007 నుండి 2017 వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో, 2008 నుండి 2014 వరకు టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ తరపున ఆడుతున్నాడు. కాగా ధోని సారథ్యంలోనే భారత్ చివరిసారిగా ఐసీసీ ప్రపంచకప్‌ను గెల్చుకున్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతోన్న ఫైనల్‌ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే ధోని సరసన రోహిత్‌ చేరతాడు.

కాగా మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి ధోని సినీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఇటీవల ఎల్‌జిఎం (లెట్స్‌ గెట్‌ మ్యారీడ్‌) అనే తమిళ చిత్రాన్ని నిర్మించారు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేష్ తమిళమణి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నదియా, హరీష్ కళ్యాణ్, ఇవానా, ఆర్జే విజయ్ మరియు యోగి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేకపోయింది. త్వరలోనే ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మరో ప్రాజెక్టు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

సాక్షి పుట్టిన రోజు వేడుకల్లో ధోని..

కాగా ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ కు దిగిన భారత జట్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కే ఎల్‌ రాహుల్‌(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విరాట్‌ కోహ్లీ (54); రోహిత్‌ శర్మ(47) పరుగులతో రాణించారు. గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (9), సూర్య కుమార్‌ యాదవ్ (18), మహ్మద్‌ షమీ (6), జస్‌ ప్రీత్ బుమ్రా (1), కుల్‌ దీప్‌ యాదవ్‌ (10), మహ్మద్ సిరాజ్‌ (9) నిరాశపర్చారు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.