IND vs AUS: ఫైనల్‌ మ్యాచ్‌లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?

2023 వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (నవంబర్‌ 18 ) జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ మ్యాచ్‌కు ఏదైనా అంతరాయం కలిగినా, లేదా వర్షం పడితే ఫలితం ఎలా ఉంటుంది? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది.

IND vs AUS: ఫైనల్‌ మ్యాచ్‌లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారో తెలుసా? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
India Vs Australia
Follow us
Basha Shek

|

Updated on: Nov 18, 2023 | 6:47 PM

2023 వన్డే ప్రపంచకప్ చివరి దశకు చేరుకుంది. ఆదివారం (నవంబర్‌ 18 ) జరిగే ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్‌ మ్యాచ్‌ జరగనుంది. కాగా ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఒకవేళ మ్యాచ్‌కు ఏదైనా అంతరాయం కలిగినా, లేదా వర్షం పడితే ఫలితం ఎలా ఉంటుంది? అనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. అయితే ముందు జాగ్రత్తగా ఐసీసీ ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డేను కేటాయించింది. మరి ఫైనల్‌ మ్యాచ్‌లో వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారు? ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయో తెలుసుకుందాం రండి.

అదనపు 120 నిమిషాలు:

ఫైనల్ మ్యాచ్ కోసం 2 గంటల అదనపు సమయం కేటాయించారు. అంటే వర్షం లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్‌కు అంతరాయం కలిగితే 120 నిమిషాల పాటు ఓవర్ల కోటాలో కోత ఉండదు. ఉదాహరణకు, మ్యాచ్‌ను 6 గంటలకు నిలిపివేసి, 8 గంటలకు పునఃప్రారంభిస్తే, ఓవర్ల తగ్గింపు ఉండదు. అంటే 120 నిమిషాలు అదనంగా కేటాయిస్తారు.

రిజర్వ్ డే :

ఫైనల్ మ్యాచ్ కోసం రిజర్వ్ డే ప్లే షెడ్యూల్ చేయబడింది. ఆదివారం వర్షం కురిసి మ్యాచ్‌ను పూర్తి చేయలేకపోతే రిజర్వ్ డేలో మ్యాచ్ కొనసాగుతుంది. అంటే ఆదివారం మ్యాచ్ నిర్వహించలేని పక్షంలో సోమవారం మ్యాచ్ నిర్వహిస్తారు.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ కొనసాగింపు:

వర్షం కారణంగా మ్యాచ్ అర్ధ సమయానికి ఆగిపోతే, మరుసటి రోజు మ్యాచ్ కొనసాగుతుంది. ఇక్కడ మ్యాచ్ ఆగిపోయిన పాయింట్ నుండి మ్యాచ్ తిరిగి ప్రారంభమవుతుంది. ఉదాహరణకు- టీమ్ ఇండియా 20 ఓవర్లలో 150 పరుగులు చేసిన సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే, మరుసటి రోజు 21వ ఓవర్ నుంచి టీమ్ ఇండియా ఇన్నింగ్స్ ప్రారంభమవుతుంది.

ఓవర్ల కుదింపు:

ఫైనల్ మ్యాచ్‌కు 2 గంటల అదనపు సమయం కేటాయించారు. ఈ 2 గంటల అదనపు సమయం తర్వాత మాత్రమే ఓవర్లు తగ్గించబడతాయి. అంటే వర్షం కారణంగా మ్యాచ్‌కు అంతరాయం కలిగితే అదనంగా 2 గంటల పాటు ఓవర్‌లను కట్ చేయరు. ఆ తర్వాత ప్రతి 5 నిమిషాలకు ఒక ఓవర్ కట్ అవుతుంది.

20 ఓవర్ల మ్యాచ్:

చివరి మ్యాచ్‌లో ఫలితాన్ని నిర్ణయించడానికి ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాలి. అదేంటంటే.. తొలి ఇన్నింగ్స్ తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ ఆగిపోతే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే జట్టు డక్ వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం ఫలితాన్ని నిర్ణయించాలంటే కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

సంయుక్త విజేతలు:

ఫైనల్‌లో పూర్తిగా వర్షం కురిసి, రిజర్వ్‌డేలో కూడా మ్యాచ్‌ను పూర్తి చేయలేని పక్షంలో మాత్రమే భారత్, ఆస్ట్రేలియా జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..