Sreemukhi: తల్లికి డైమండ్‌ నెక్లెస్‌, తండ్రికి బంగారు చైన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన శ్రీముఖి.. వీడియో చూశారా?

స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. షో ఏదైనా, స్టేజీ ఏదైనా, సందర్భమేదైనా గలగలా మాట్లాడే ఈ బుల్లితెర రాముమల్మకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. నెట్టంట ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు సినిమాల్లోనూ కనిపిస్తోంది శ్రీముఖి. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ మూవీలో ఓ స్పెషల్‌ రోల్‌ చేసింది. కీర్తి సురేష్‌ స్నేహితురాలు మహా పాత్రలో నవ్వులు పూయించింది

Sreemukhi: తల్లికి డైమండ్‌ నెక్లెస్‌, తండ్రికి బంగారు చైన్‌ గిఫ్ట్‌గా ఇచ్చిన శ్రీముఖి.. వీడియో చూశారా?
Sreemukhi
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2023 | 1:33 PM

స్టార్‌ యాంకర్‌ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. షో ఏదైనా, స్టేజీ ఏదైనా, సందర్భమేదైనా గలగలా మాట్లాడే ఈ బుల్లితెర రాముమల్మకు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అభిమానులు ఉన్నారు. నెట్టంట ఫుల్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం టీవీ షోస్‌తో పాటు సినిమాల్లోనూ కనిపిస్తోంది శ్రీముఖి. ఇటీవల మెగాస్టార్‌ చిరంజీవి నటించిన భోళాశంకర్‌ మూవీలో ఓ స్పెషల్‌ రోల్‌ చేసింది. కీర్తి సురేష్‌ స్నేహితురాలు మహా పాత్రలో నవ్వులు పూయించింది. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా వెలుగొందుతోన్న శ్రీముఖి దీపావళి పండగను నిజామాబాద్‌లోని తన కొత్తింట్లో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంది. ఈ వేడుకలో తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కూడా భాగమయ్యారు. ఈ సందర్భంగా తన కొత్తింట్లో దీపావళి పూజకు హాజరైన అతిథులందరికీ స్వీట్లు పంచింది శ్రీముఖి. ఆతర్వాత అమ్మానాన్నాలకు ఖరీదైన బహుమతులు ఇచ్చి ఆశ్చర్యపరిచింది. ముందుగా తండ్రి రామకృష్ణకు బంగారు చైన్‌ను బహుమతిగా ఇచ్చింది. ఆపై తల్లి లతకు వజ్రాల నెక్లెస్‌ను కానుకగా అందించింది. వీటిని చూసి శ్రీముఖి తల్లి ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ‘వజ్రాల నెక్లెస్‌ చాలా బాగుంది’ అని మురిసిపోయిందామె. ఈ సందర్భంగా శ్రీముఖితో పాటు సోదరుడు శుశ్రుత్‌ అమ్మానాన్నల పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు.

ఇలా అమ్మానాన్నలకు ఖరీదైన కానకలిచ్చి దీపావళి సంబరాలను డబుల్‌ చేసింది శ్రీముఖి. దీనికి సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేసుకుంది శ్రీముఖి. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరలైంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు శ్రీముఖి మనసు బంగారం అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘ఒకప్పుడు మాది మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ. అందరూ ఒకే గదిలో ఉండేవాళ్లం. ఆ స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చాం. ఇప్పుడు ఇంత పెద్ద ఇంట్లో దీపావళి పండగను జరుపుకోగలుగుతున్నాం. నేను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు మా పేరెంట్సే కారణం. మాకు ఇంత అందమైన జీవితాన్ని ఇచ్చినందుకు వారికి మా తరఫున ఈ చిన్న కానుక’ అని ఎమోషనలైంది శ్రీముఖి.

ఇవి కూడా చదవండి

దీపావళి సంబరాల్లో శ్రీముఖి కుటుంబ సభ్యులు..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

అమ్మానాన్నలకు ఖరీదైన కానుకలు..

View this post on Instagram

A post shared by Sreemukhi (@sreemukhi)

మా ఉన్నతికి అమ్మానాన్నలే కారణం.. అందుకే ఈ చిన్న బహుమతులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
దటీజ్ ఉమెన్ పవర్.. 211 పరుగుల తేడాతో ఘన విజయం
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
మొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన లేడి గంగూలీ..!
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
ఏపీలో మాత్రమే మిడ్ నైట్ షోలు వేస్తే మరో తలనొప్పి
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం