Bigg Boss 7 Telugu: ఆ ఓట్లన్నీ యావర్‌కే.. అందుకే టాప్‌లో.. పాపం.. ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ తప్పదా?

గత వారం ఐదుగురు ఈ జాబితాలో ఉంటే.. ఈ వీక్ మాత్రం ఏకంగా 8 మంది నామినేషన్స్‌ లిస్టులోకి వచ్చారు. శోభావెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్ చౌదరి, రతికా రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, గౌతమ్‌ కృష్ణలు 11 వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. నామినేషన్స్‌ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ వారం ఓటింగ్‌ కూడా భారీగానే జరుగుతోంది. ఇక్కడ ప్రిన్స్‌ యావర్‌ టాప్‌లో కొనసాగుతుండడం గమనార్హం.

Bigg Boss 7 Telugu: ఆ ఓట్లన్నీ యావర్‌కే.. అందుకే టాప్‌లో.. పాపం.. ఆ కంటెస్టెంట్‌ ఎలిమినేషన్‌ తప్పదా?
Bigg Boss 7 Telugu
Follow us

|

Updated on: Nov 16, 2023 | 1:34 PM

బిగ్‌ బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. బుల్లితెర ప్రేక్షకుల ఆదరణతో ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకుందీ సెలబ్రిటీ గేమ్‌ షో. ఇక 11 వారం నామినేషన్స్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్లు నిలిచారు. గత వారం ఐదుగురు ఈ జాబితాలో ఉంటే.. ఈ వీక్ మాత్రం ఏకంగా 8 మంది నామినేషన్స్‌ లిస్టులోకి వచ్చారు. శోభావెట్టి, ప్రియాంక జైన్‌, అమర్‌ దీప్ చౌదరి, రతికా రోజ్‌, ప్రిన్స్‌ యావర్‌, అశ్విని శ్రీ, గౌతమ్‌ కృష్ణలు 11 వారం నామినేషన్స్‌ లిస్టులో ఉన్నారు. నామినేషన్స్‌ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ఈ వారం ఓటింగ్‌ కూడా భారీగానే జరుగుతోంది. ఇక్కడ ప్రిన్స్‌ యావర్‌ టాప్‌లో కొనసాగుతుండడం గమనార్హం. సుమారు 34 శాతం ఓట్లు అతనికే పడ్డాయి. అయితే యావర్‌ అగ్రస్థానంలో ఉండడానికి ఒక ఆశ్చర్యకరమైన కారణం ఉంది. బిగ్‌ బాస్‌ హౌజ్‌లో శివాజీ బ్యాచ్‌లో ఉండే కంటెస్టెంట్స్‌లో ప్రిన్స్‌ కూడా ఒకరు. పైగా పల్లవి ప్రశాంత్‌ కూడా ఈ బ్యాచ్‌లోనే ఉంటాడు. అయితే 11 వారంలో శివాజీ, పల్లవి ప్రశాంత్‌ నామినేషన్స్‌లో లేకపోవడంతో వాళ్ల ఓట్లన్నీప్రిన్స్‌ యావర్‌కే పడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఓటింగ్‌లో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నాడు ప్రిన్స్‌ .

ఇక 11 వారం ఓటింగ్‌లో సీరియల్ బ్యాచ్‌ లీడర్‌ అమర్‌ దీప్‌ చౌదరి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అతనికి 20 శాతం ఓట్లు పోలయ్యాయి. 13 శాతం ఓట్లతో రతికా రోజ్‌ మూడో స్థానంలో ఉండగా, 8 శాతం ఓట్లతో అశ్విని శ్రీ నాలుగో ప్లేస్‌లో కొనసాగుతోంది. నిన్నటి వరకు అట్టడుగున ఉన్న ప్రియాంక జైన్‌ ఇప్పుడు ఐదో ప్లేస్‌కు దూసుకొచ్చింది. ఆమెకు 6.8 శాతం ఓట్లు పడ్డాయి. అలాగే హౌజ్‌లో స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌గా పేరున్న అర్జున్‌ అంబటి 6.1 శాతం ఓట్లతో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే గౌతమ్‌ కృష్ణ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక కేవలం 4 శాతం ఓట్లతో మోనితా శోభాశెట్టి ఆఖరి స్థానంలో ఉంది. అంటే ప్రస్తుతం గౌతమ్‌, శోభా శెట్టి డేంజర్‌ జోన్‌లో ఉన్నారన్నమాట. శుక్రవారం రాత్రి వరకు ఈ ఓటింగ్ జరగనుంది. మరి అప్పటివరకు ఏమైనా మార్పులు జరుగుతాయా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్స్..

హౌజ్ లో ప్రిన్స్ యావర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
మహిళలను భయపెడుతున్న కొలెస్ట్రాల్.. కొత్త లక్షణాలు ఇవే
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
రామసేతు వంతెన కల్పన కాదు.. నిజం..
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
వావి వరుసలు మరిచి దారుణం.. సొంత చెల్లిని కూడా ??
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
మా తెలుగు టీచర్‌కి తెలుగే రాదు.. కలెక్టర్‌కి విద్యార్థుల ఫిర్యాదు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అనంత్‌ అంబానీ వివాహం.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
అక్రమ మద్యం పట్టుకోడానికి వెళ్లిన పోలీసులు. అక్కడ సీన్‌ చూసి షాక్
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
ఉదయాన్నే ఈ జ్యూస్‌ ఒక్క గ్లాస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి !!
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
రాత్రి పడుకునే ముందు గోరు వెచ్చని నీళ్లు తాగితే ఉపయోగాలు తెలుసా ?
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
వర్షంతో నీటమునిగిన రోడ్డు.. కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడో తెలుసా
తెల్లారేసరికి లాడ్జి‌లో మైండ్ బ్లోయింగ్ సీన్.. ఎంక్వయిరీ చేయగా
తెల్లారేసరికి లాడ్జి‌లో మైండ్ బ్లోయింగ్ సీన్.. ఎంక్వయిరీ చేయగా