- Telugu News Photo Gallery Cinema photos Venkatesh Selfies With Viv Richards And David Beckham In IND v NZ World Cup Semi Final
Venkatesh: క్రీడా దిగ్గజాలతో వెంకీ మామ.. సెల్ఫీలతో సందడి.. ఫొటోస్ వైరల్
బుధవారం (నవంబర్ 16) ముంబై వేదికగా జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. అందులో ఫుట్ బాల్ దిగ్గజం బెక్‌హమ్, హీరో రణ్‌బీర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ మ్యాచ్‌లో సందడి చేశారు.
Updated on: Nov 16, 2023 | 2:00 PM

బుధవారం (నవంబర్ 16) ముంబై వేదికగా జరిగిన భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. అందులో ఫుట్ బాల్ దిగ్గజం బెక్‌హమ్, హీరో రణ్‌బీర్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, మాధురీ దీక్షిత్ ఉన్నారు. ఇక టాలీవుడ్ కు చెందిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ మ్యాచ్‌లో సందడి చేశారు.

తన సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుతో కలిసి సెమీఫైనల్ మ్యాచ్ చూసేందుకు ముంబై వెళ్లాడు వెంకీమామ. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన క్రీడా దిగ్గజాలతో సరదాగా సెల్ఫీలు దిగాడు.

మొదట విండీస్ క్రికెట్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ తో సెల్ఫీ దిగాడు వెంకీ మామ. దీనిని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. ।ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ ని కలవడం చాలా సంతోషంగా ఉంది' అనే క్యాప్షన్ తో ఈ ఫొటో పోస్ట్ చేశాడు వెంకీ.

ఆ తర్వాత ఇంగ్లండ్ సాకర్ దిగ్గజం బెక్ హమ్‌తో కలిసి మరో సెల్ఫీ దిగాడు విక్టరీ వెంకటేష్. 'గ్రేట్ ఇన్నింగ్స్ చూడటానికి గ్రేట్ కంపెనీ దొరికింది' అంటూ దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్తా వైరల్‌గా మారింది.

వెంకటేష్‌కు క్రికెట్ అంటే చాలా అభిమానం. గతంలోనూ చాలా ఐపీఎల్ మ్యాచుల్లోనూ సందడి చేశాడు. అలాగే టీమిండియాకు మద్దతుగా ఎప్పుడూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు.