- Telugu News Photo Gallery Cinema photos Kota Bommali PS movie getting craze with political punches, will it be a hit at the box office
Kota Bommali: పొలిటికల్ పంచ్‌లతో క్రేజ్ పెంచుతోన్న కోట బొమ్మాళి.. బాక్సాఫీస్ వద్ద హిట్ కొడుతుందా ??
ఎలక్షన్ టైమ్‌లో ఎలాంటి సినిమా అయితే రావాలో.. సరిగ్గా అలాంటి సబ్జెక్ట్‌తోనే ఓ సినిమా వస్తుంది. పోలింగ్‌కు వారం రోజుల ముందుగానే ఆ సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ చూస్తుంటేనే సినిమాలో విషయం చాలా ఉన్నట్లు అర్థమైపోతుంది. మరి రేపు విడుదలైన తర్వాత కూడా ఇంతే మ్యాటర్ ఉంటుందా..? అంతగా ఆసక్తి పుట్టిస్తున్న ఆ సినిమా ఏంటి..? ఒక్క పాటతో ఈ మధ్య చాలా సినిమాలకు బాగా క్రేజ్ వచ్చింది. అందులో కోట బొమ్మాళి పిఎస్ కూడా ఉంది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 16, 2023 | 1:58 PM

ఎలక్షన్ టైమ్‌లో ఎలాంటి సినిమా అయితే రావాలో.. సరిగ్గా అలాంటి సబ్జెక్ట్‌తోనే ఓ సినిమా వస్తుంది. పోలింగ్‌కు వారం రోజుల ముందుగానే ఆ సినిమా థియేటర్స్‌లోకి వస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ చూస్తుంటేనే సినిమాలో విషయం చాలా ఉన్నట్లు అర్థమైపోతుంది. మరి రేపు విడుదలైన తర్వాత కూడా ఇంతే మ్యాటర్ ఉంటుందా..? అంతగా ఆసక్తి పుట్టిస్తున్న ఆ సినిమా ఏంటి..?

ఒక్క పాటతో ఈ మధ్య చాలా సినిమాలకు బాగా క్రేజ్ వచ్చింది. అందులో కోట బొమ్మాళి పిఎస్ కూడా ఉంది. తేజ మార్ని తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు బన్నీ వాస్ నిర్మాత. శ్రీకాంత్, రాహుల్ విజయ్ హీరోలుగా నటిస్తున్నారు.

నవంబర్ 24న విడుదల కానుంది కోట బొమ్మాళి పిఎస్. మలయాళం బ్లాక్‌బస్టర్ నాయట్టుకు ఇది రీమేక్. లింగి లింగిడి పాటతో ఈ సినిమాకు బాగా ఊపొచ్చింది.

పాట పుణ్యమా అని ముందు క్రేజ్ తెచ్చుకున్నా.. ఇప్పుడు మాత్రం కంటెంట్ మాట్లాడుతుంది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత కోట బొమ్మాళి పిఎస్‌పై అంచనాలు బాగానే పెరిగాయి. ముఖ్యంగా పొలిటికల్ సీజన్ నడుస్తున్న టైమ్‌లో పక్కాగా అలాంటి కథతోనే వస్తుంది ఈ చిత్రం. ముఖ్యంగా ప్రమోషన్స్‌లోనూ ఎక్కువగా పొలిటికల్ పంచులే కనిపిస్తున్నాయి.

మలయాళ రీమేక్ అయినా.. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు చాలా మార్పులు చేసారు మేకర్స్. ముఖ్యంగా ఎన్నికల సీజన్ కాబట్టి కచ్చితంగా ఆ ప్రభావం ఉంటుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. పొలిటికల్ లీడర్స్ చేసే ఒత్తిడికి పోలీసులు ఎలా నలిగిపోతున్నారనేది ఈ చిత్ర నేపథ్యం. మొత్తానికి చూడాలిక.. నవంబర్ 24న కోట బొమ్మళి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందో..?





























