IND vs AUS, WC Final Highlights: పోరాడి ఓడిన భారత్.. 6వ సారి ట్రోఫీ ఆసీస్ సొంతం..

| Edited By: TV9 Telugu

Updated on: Nov 30, 2023 | 10:01 AM

India vs Australia, World Cup Final 2023 Highlights in Telugu: ఈ ఫైనల్‌కు చేరుకోవడానికి ముందు, లీగ్ దశలో భారత్ ఆడిన మొత్తం 9 మ్యాచ్‌లను గెలుచుకుంది. అందులో ఒకటి ఆస్ట్రేలియాపై కూడా ఉంది. ఆ తర్వాత సెమీఫైనల్లో 70 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. కాగా ఆస్ట్రేలియా 2 ఓటముల తర్వాత వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

IND vs AUS, WC Final Highlights: పోరాడి ఓడిన భారత్.. 6వ సారి ట్రోఫీ ఆసీస్ సొంతం..
Bharat Vs Australia Final 2023 Match

India vs Australia, ICC World Cup 2023 Final Match Today Highlights in Telugu: 2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది. ఈ ఓటమి భారత అభిమానులకు 2003 ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేసింది. 20 ఏళ్ల క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో కంగారూలు 125 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించారు.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులకు ఆలౌటైంది. 241 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 43 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి సాధించారు. ట్రావిస్ హెడ్ తన 137 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడగా, మార్నస్ లాబుస్చాగ్నే 58 పరుగులతో చేయూత నిచ్చాడు. అంతకుముందు మిచెల్ స్టార్క్ 3 వికెట్లు తీయగా, కెప్టెన్ పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ చెరో 2 వికెట్లు తీశారు.

2023 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాకు 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ నిర్దేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌటైంది. ఈ ప్రపంచకప్‌లో టీమిండియా తొలిసారి ఆలౌట్ అయింది.

భారత జట్టులో విరాట్ కోహ్లీ 54 పరుగులు, కేఎల్ రాహుల్ 66 పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ 31 బంతుల్లో 47 పరుగులు చేసి భారత్‌కు వేగంగా శుభారంభం అందించగా, మిగతా ఆటగాళ్లు ఈ వేగాన్ని కొనసాగించలేకపోయారు. ఆస్ట్రేలియా జట్టులో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు పడగొట్టాడు. పాట్ కమిన్స్ 2 వికెట్లు తీశాడు.

2023: 2023 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాయి. ODI ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుక ఫైనల్ మ్యాచ్ రోజునే నిర్వహించనున్నారు. ఈ ముగింపు వేడుకల కార్యక్రమాలు నాలుగు దశల్లో జరగనున్నాయి. ప్రీ-మ్యాచ్‌, మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్, ఇన్నింగ్స్ బ్రేక్, రెండవ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ ఇలా నాలుగు దఫాలుగా నిర్వహించనున్నారు.

ఇరు జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 19 Nov 2023 10:25 PM (IST)

    6వ సారి ట్రోఫీ అందుకున్న ఆస్ట్రేలియా..

    ఆస్ట్రేలియా జట్టు 6వ సారి అందుకుంది. దీంతో ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు ఆనందంలో ట్రోఫీని ముద్దాడుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 19 Nov 2023 10:13 PM (IST)

    ప్రపంచ కప్ 2023 గణాంకాలు..

    అత్యధిక పరుగులు: విరాట్ కోహ్లీ (765)

    అత్యధిక వ్యక్తిగత స్కోరు: గ్లెన్ మాక్స్‌వెల్ (201*)

    అత్యధిక సెంచరీలు: క్వింటన్ డి కాక్ (4)

    అత్యధిక సిక్సర్లు: రోహిత్ శర్మ (31)

    అత్యధిక వికెట్లు: మహ్మద్ షమీ (24)

    అత్యుత్తమ గణాంకాలు: మహ్మద్ షమీ (7/57)

    వికెట్ కీపర్లు చేసిన అత్యధిక క్యాచ్‌ ఔట్: క్వింటన్ డి కాక్ (20)

    అత్యధిక అవుట్‌ఫీల్డ్ క్యాచ్‌లు: డారిల్ మిచెల్ (11)

  • 19 Nov 2023 10:12 PM (IST)

    ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా కోహ్లీ..

    ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా విరాట్ కోహ్లీ (765) నిలిచాడు. కోహ్లి 11 ఇన్నింగ్స్‌లలో 96 సగటుతో 3 సెంచరీలు, 6 అర్ధ సెంచరీలతో 765 పరుగులు చేశాడు.

    View this post on Instagram

    A post shared by ICC (@icc)

  • 19 Nov 2023 10:08 PM (IST)

    ఏడ్చిన రోహిత్..

    ఇంత దగ్గరగా వచ్చి టైటిల్‌ను కోల్పోయిన తర్వాత యావత్ భారతదేశం నిరాశ చెందింది.  విచారంలో కూరుకపోయింది.  టైటిల్ గెలవాలన్న కల చెదిరిన తర్వాత కెప్టెన్ రోహిత్ కూడా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుని నేరుగా పెవిలియన్ బాట పట్టాడు. అదే సమయంలో, విరాట్ కోహ్లి కూడా తన నిరాశను దాచుకోలేకపోయాడు. తన టోపీతో తన ముఖాన్ని దాచడం ద్వారా ఈ బాధను తట్టుకోవడం కనిపించింది.

  • 19 Nov 2023 09:23 PM (IST)

    పోరాడి ఓడిన భారత్..

    2023 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి గెలుచుకుంది. ఈ ఓటమి భారత అభిమానులకు 2003 ప్రపంచకప్ ఫైనల్‌ను గుర్తు చేసింది. 20 ఏళ్ల క్రితం జోహన్నెస్‌బర్గ్‌లో కంగారూలు 125 పరుగుల తేడాతో టీమిండియాను ఓడించారు.

  • 19 Nov 2023 09:09 PM (IST)

    లబూషేన్ హాఫ్ సెంచరీ..

    ఆస్ట్రేలియా జట్టు 39 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే ఉన్నారు. ఇద్దరి మధ్య 150+ భాగస్వామ్యం ఉంది. ఈ ప్రపంచకప్‌లో హెడ్‌ రెండో సెంచరీ సాధించాడు. లబూషేన్ 53 పరుగులతో దూసుకెళ్తున్నాడు.

  • 19 Nov 2023 08:46 PM (IST)

    సెంచరీతో సత్తా చాటిన హెడ్.. ఓటమి దిశగా భారత్..

    ఆస్ట్రేలియా జట్టు 35 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. ఈ ప్రపంచకప్‌లో హెడ్‌ రెండో సెంచరీ సాధించాడు.

  • 19 Nov 2023 08:26 PM (IST)

    విజయానికి మరో 74 పరుగులు..

    ఆస్ట్రేలియా జట్టు 30 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్ 86, మార్నస్ లాబుషాగ్నే 37 ఉన్నారు. వీరిద్దరి మధ్య సెంచరీ భాగస్వామ్యం ఉంది. హెడ్ ​​తన వన్డే కెరీర్‌లో 17వ అర్ధశతకం పూర్తి చేసుకుని, సెంచరీ దిశగా సాగుతున్నాడు.

  • 19 Nov 2023 08:07 PM (IST)

    డేంజర్‌గా మారిన హెడ్..

    ఆస్ట్రేలియా జట్టు 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే ఉన్నారు. వీరిద్దరి మధ్య 88 పరుగుల భాగస్వామ్యం నిలిచింది. హెడ్ ​​తన వన్డే కెరీర్‌లో 17వ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.

  • 19 Nov 2023 07:49 PM (IST)

    100కు చేరిన ఆసీస్ స్కోర్..

    ఆస్ట్రేలియా స్కోర్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. హెచ్ 44, లబూషేన్ 17 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 19 Nov 2023 07:29 PM (IST)

    15 ఓవర్లకు ఆసీస్..

    15 ఓవర్లు ముగిసే సరికి ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. హెడ్ 28, లబూషేన్ 8 పరుగులతో క్రీజులో నిలిచాడు.

  • 19 Nov 2023 07:14 PM (IST)

    పవర్ ప్లేలో సత్తా చాటిన భారత బౌలర్లు..

    ఆస్ట్రేలియా జట్టు 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, మార్నస్ లాబుషాగ్నే ఉన్నారు.

    4 పరుగుల వద్ద స్టీవ్ స్మిత్ ఔటయ్యాడు. మిచెల్ మార్ష్ 15 పరుగులతో పెవిలియన్ చేరాడు. అంతకుముందు డేవిడ్ వార్నర్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు.

  • 19 Nov 2023 07:02 PM (IST)

    పెవిలియన్ చేరిన స్మిత్.. మూడో వికెట్ డౌన్..

    ఆస్ట్రేలియా జట్టు 7 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 47 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్ హెడ్, లబూషేన్ ఉన్నారు.

  • 19 Nov 2023 06:50 PM (IST)

    మార్ష్ ఔట్..

    4.4 ఓవర్లో ఆస్ట్రేలియా టీం రెండో వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ 15 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు. దీంతో ఆస్ట్రేలియా 2 వికెట్లు కోల్పోయి 41 పరుగులు చేసింది.

  • 19 Nov 2023 06:34 PM (IST)

    డేవిడ్ వార్నర్ ఔట్..

    తొలి ఓవర్లలో క్యాచ్ మిస్ చేసిన కోహ్లీ.. రెండో ఓవర్లో మాత్రం ఆ తప్పు రిపీట్ చేయలేదు. డేవిడ్ వార్నర్ 7 పరుగులకే పెవిలియన్ పంపడంలో కీలక పాత్ర పోషించాడు. షమీ తొలి వికెట్ అందించాడు.

  • 19 Nov 2023 05:57 PM (IST)

    240కే టీమిండియా ఆలౌట్..

    2023 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా ముందు 241 స్వల్ప లక్ష్యం నిలిచింది.

  • 19 Nov 2023 05:43 PM (IST)

    సూర్య మ్యాజిక్ మిస్..

    టీమిండియా 47.3 ఓవర్లలో 9 వికెట్లకు 226 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ కేవలం 18 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు.

  • 19 Nov 2023 05:23 PM (IST)

    7 వికెట్లు డౌన్..

    టీమిండియా 43.4 ఓవర్లలో 7 వికెట్లకు 211 పరుగులు చేసింది. క్రీజులో సూర్యకుమార్, బుమ్రా ఉన్నారు. కేఎల్ రాహుల్ 66 పరుగుల వద్ద ఔటయ్యాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కీపర్ జోష్ ఇంగ్లిస్ చేతికి చిక్కాడు. అనంతరం షమీ 6 పరుగుల వద్ద భారీ షాట్ ఆడే ప్రయత్నంలో పెవిలియన్ చేరాడు.

  • 19 Nov 2023 05:04 PM (IST)

    మరో 10 ఓవర్లు మాత్రమే..

    టీమిండియా 40 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ క్రీజులో ఉన్నారు.

  • 19 Nov 2023 04:47 PM (IST)

    జడేజా ఔట్..

    తొలుత బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. రాహుల్ యాభై పూర్తి చేసుకున్నాడు. జడేజా 9 పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.

  • 19 Nov 2023 04:39 PM (IST)

    రాహుల్ హాఫ్ సెంచరీ..

    టీమిండియా 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు. రాహుల్ 86 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి, కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

  • 19 Nov 2023 04:10 PM (IST)

    కోహ్లీ ఔట్‌తో షాక్‌లో స్టేడియం..

    టీమిండియా 29 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా ఉన్నారు.

    54 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. అతను పాట్ కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. విరాట్ తన వన్డే కెరీర్‌లో 72వ అర్ధ సెంచరీని నమోదు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో 9వ సారి 50కి పైగా పరుగులు చేశాడు. ప్రపంచకప్‌లో విరాట్‌కి ఇది 12వ అర్ధశతకం.

  • 19 Nov 2023 03:58 PM (IST)

    ప్రపంచ కప్ ఎడిషన్ సెమీస్ & ఫైనల్ రెండింటిలోనూ 50+ స్కోర్లు చేసిన ప్లేయర్లు..

    మైక్ బ్రేర్లీ (1979)

    డేవిడ్ బూన్ (1987)

    జావేద్ మియాందాద్ (1992)

    అరవింద డి సిల్వా (1996)

    గ్రాంట్ ఇలియట్ (2015)

    స్టీవెన్ స్మిత్ (2015)

    విరాట్ కోహ్లీ (2023)

  • 19 Nov 2023 03:57 PM (IST)

    ప్రపంచ కప్‌లలో వరుసగా ఐదు 50+ స్కోర్లు

    5 – 2015లో స్టీవెన్ స్మిత్

    5 – 2019లో విరాట్

    5 – 2023లో విరాట్ కోహ్లీ

  • 19 Nov 2023 03:55 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ..

    టీమిండియా 26 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు. కోహ్లీ 56 బంతుల్లో తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 4 ఫోర్లు ఉన్నాయి.

  • 19 Nov 2023 03:34 PM (IST)

    20 ఓవర్లకు..

    టీమిండియా 20 ఓవర్లలో 3 వికెట్లకు 115 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ 39, కేఎల్ రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు. మ్యాచ్‌లో చివరి 10 ఓవర్లలో బౌండరీలు రాలేదు. 10వ ఓవర్ చివరి బంతికి శ్రేయాస్ అయ్యర్ చివరి ఫోర్ కొట్టాడు.

  • 19 Nov 2023 03:15 PM (IST)

    16 ఓవర్లకు భారత్..

    టీమిండియా 16 ఓవర్లలో 3 వికెట్లకు 101 పరుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఉన్నారు.

  • 19 Nov 2023 02:45 PM (IST)

    రోహిత్ ఔట్..

    టీమిండియా సారథి రోహిత్ శర్మ (47) మరోసారి 50 పరుగులను చేరుకోకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో 76 పరుగుల వద్ద భారత్ 2వికెట్లు కోల్పోయింది.

  • 19 Nov 2023 02:34 PM (IST)

    7 ఓవర్లకు భారత్..

    7 ఓవర్లు ముగిసే సరికి భారత్ 1 వికెట్ కోల్పోయి 54 పరుగులు చేసింది. రోహిత్ 33, కోహ్లీ 16 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 19 Nov 2023 02:23 PM (IST)

    తొలి వికెట్ డౌన్..

    టీమిండియా 4.2 ఓవర్లో గిల్ (4) వికెట్‌ను కోల్పోయింది. దీంతో భారత్ 30 పరుగుల వద్ద తొలి వికెట్‌ను ఆస్ట్రేలియా బౌలర్ స్టార్క్ పడగొట్టాడు.

  • 19 Nov 2023 02:20 PM (IST)

    4 ఓవర్లలో దంచికొట్టిన రోహిత్..

    4 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 30 పరుగులు చేసింది. రోహిత్ 25, గిల్ 4 పరుగులతో క్రీజులో నిలిచారు.

  • 19 Nov 2023 02:10 PM (IST)

    రోహిత్ స్టైల్ దూకుడు..

    కొన్ని బాల్స్ నిశితంగా పరిశీలించిన రోహిత.. ఆ తర్వాత దూకుడు మొదలుపెట్టాడు. 2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 13 పరుగులు చేసింది.

  • 19 Nov 2023 02:03 PM (IST)

    ఓపెనర్లుగా రోహిత్, గిల్..

    టీమిండియా టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ బరిలోకి దిగారు.

  • 19 Nov 2023 01:51 PM (IST)

    ఏది జరిగినా చరిత్రే..

    కాగా, ఈ టోర్నీలో రోహిత్ 6 సార్లు టాస్ గెలిచాడు. మూడుసార్లు బ్యాటింగ్, మూడుసార్లు బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లోనూ భారత్‌ విజయం సాధించాడు.

    2011 నుంచి, ఫైనల్‌లో లక్ష్యాన్ని ఛేదించే జట్టు వరుసగా మూడుసార్లు టైటిల్ మ్యాచ్‌ను గెలుచుకుంది. అయితే మూడు సందర్భాల్లో టాస్ గెలిచిన జట్టు ఓడిపోయింది.

  • 19 Nov 2023 01:50 PM (IST)

    IND vs AUS: ఇద్దరు కెప్టెన్ల కోరిక నెరవేర్చిన టాస్..

    ఫైనల్‌కు ముందు ఈ టోర్నీలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఛేజింగ్ చేసిన జట్లు 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.

    ఒకవేళ టాస్ గెలిచి ఉంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగాలని నిర్ణయించుకున్నట్లు భారత కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. అంటే ఇద్దరు కెప్టెన్ల కోరికలు నెరవేరాయి.

  • 19 Nov 2023 01:38 PM (IST)

    India vs Australia Toss Result: టాస్ గెలిచిన ఆసీస్.. ఇరుజట్ల ప్లేయింగ్ 11 ఇదే..

    ఇరు జట్లు:

    భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

    ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

  • 19 Nov 2023 01:36 PM (IST)

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా..

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రోహిత్ సేన ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

  • 19 Nov 2023 01:29 PM (IST)

    స్టేడియం చేరుకున్న సెలబ్రెటీలు..

    గ్రేట్ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అహ్మదాబాద్ చేరుకున్నాడు. 1983 ప్రపంచకప్‌లో తొలిసారిగా భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్ కపిల్ దేవ్ కూడా ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ఇద్దరు స్టార్లు టీమ్ ఇండియా జెర్సీ ధరించి అహ్మదాబాద్‌కు బయలుదేరారు.

  • 19 Nov 2023 01:25 PM (IST)

    టీమిండియాకు ప్రధాని మోదీ అభినందనలు..

    ఫైనల్‌కు ముందు టీమిండియాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. టీమ్‌కి శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు.

  • 19 Nov 2023 01:23 PM (IST)

    కోహ్లీ, రోహిత్ ఫొటోలకు పాలాభిషేకాలు..

    ప్రపంచకప్ ఫైనల్‌కు ముందు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి పోస్టర్లకు అభిమానులు పాలాభిషేకాలు చేశారు. పుణెలో అభిమానులు భారత జట్టు విజయం కోసం ప్రార్థనలు చేశారు.

    పూణెలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పోస్టర్లకు పాలాభిషేకాలు చేస్తోన్న ఫ్యాన్స్..

  • 19 Nov 2023 12:37 PM (IST)

    IND vs AUS Live: స్టేడియానికి చేరుకున్న ఇరుజట్లు

    కీలక పోరుకు సమయం ఆసన్నమైంది. ఈమేరకు ఇరుజట్లు స్టేడియానికి చేరుకున్నాయి. తమ సన్నాహాలకు తుది మెరుగులు దిద్దుతున్నారు.

  • 19 Nov 2023 12:35 PM (IST)

    ఆస్ట్రేలియాకు అగ్ని పరీక్ష..

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఈ స్టేడియంలో లక్షా 30 వేల మంది కూర్చోనే వీలుంది. వీరిలో ఎక్కువ మంది భారతీయ అభిమానులు ఉంటారు. ఇటువంటి పరిస్థితిలో లక్షలాది మంది భారతీయ అభిమానులను ఎదుర్కోవడం ఆస్ట్రేలియాకు కఠినమైన సవాలు కానుంది. ఈ మైదానంలో పాకిస్థాన్-భారత్ మధ్య మ్యాచ్ జరగడంతో భారత అభిమానుల ముందు పాకిస్థాన్ నిస్సహాయంగా కనిపించింది.

  • 19 Nov 2023 12:22 PM (IST)

    ఐసీసీ ట్రోఫీ కరువు తీరనుందా?

    భారత్ చివరిసారిగా 2011లో ప్రపంచకప్‌ను గెలుచుకోగా, 2013లో ఐసీసీ ట్రోఫీని చాంపియన్స్ ట్రోఫీగా గెలుచుకుంది. 10 ఏళ్లుగా భారత్ ఏ ఐసీసీ ట్రోఫీని గెలవలేదు. ఈసారి భారత్ 10 సంవత్సరాల సుదీర్ఘ ICC ట్రోఫీ కరువుకు తెరపడుతుందని భారత అభిమానులు భావిస్తున్నారు.

  • 19 Nov 2023 11:50 AM (IST)

    ప్రపంచ కప్ 2023 ముగింపు వేడుకలు..

    ప్రపంచ కప్ 2023 ఫైనల్ సందర్భంగా ముగింపు వేడుకలు నాలుగు దఫాలుగా కార్యక్రమాలు జరగాల్సి ఉంది. ఇవి మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.

    1:35 PM: భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ అక్రోబాటిక్ టీమ్ ద్వారా 10 నిమిషాల ఎయిర్ షో ఉంటుంది.

    5:30 PM: 15 నిమిషాల మిడ్-ఇన్నింగ్ ప్రదర్శన. ఈ సందర్భంగా ప్రపంచకప్ గెలిచిన మాజీ కెప్టెన్లను సన్మానించనున్నారు. వీరందరికీ ప్రత్యేక బ్లేజర్లు ఇచ్చి బీసీసీఐ సత్కరించనుంది.

    ఈ సమయంలో, ప్రీతమ్ మ్యూజిక్ షో ఉంటుంది. అతను 500 మందికి పైగా డ్యాన్సర్లతో కలిసి ప్రపంచ కప్ థీమ్ సాంగ్ ‘జష్న్ జష్న్ బోలే’పై ప్రదర్శన ఇవ్వనున్నారు.

    8:30 PM: రెండవ ఇన్నింగ్స్ డ్రింక్స్ విరామం సమయంలో లైట్, లేజర్ షో ఉంటుంది. ఇది 90 నిమిషాల పాటు కొనసాగుతుంది.

    మ్యాచ్ ముగిసిన తర్వాత: ఫైనల్లో గెలిచిన జట్టుకు ప్రపంచకప్ ట్రోఫీని అందజేస్తారు. ఈ సమయంలో, ఓపెన్ నైట్ స్కైలో 1200 డ్రోన్లు విన్యాసాలు చేయడం మొదటిసారిగా కనిపిస్తుంది.

  • 19 Nov 2023 11:30 AM (IST)

    ప్రపంచ కప్ 2023 ఫైనల్‌కు భద్రతా ఏర్పాట్లు ..

    2023 వరల్డ్ కప్ ఫైనల్ కోసం నరేంద్ర మోడీ స్టేడియం భద్రత కోసం 6000 మందికి పైగా సైనికులను మోహరించారు. అందుతున్న సమాచారం ప్రకారం 4 మంది సీనియర్ ఐపీఎస్, ఐజీ, డీఐజీలు అక్కడ ఉన్నారు. 23 మంది డీసీపీలు కూడా ఉన్నారు. ముగ్గురు అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారులు ఉన్నారు. NDRF బృందం ఉంది. 92 మంది పోలీసు ఇన్‌స్పెక్టర్లు ఉన్నారు.

  • 19 Nov 2023 11:24 AM (IST)

    నీలి సముద్రంలా మారిన మోడీ స్టేడియం..

    ఫైనల్ కోసం అంతా సిద్ధమైంది. ఉదయం నుంచే ఫ్యాన్స్ స్టేడియానికి క్యూ కట్టారు. మ్యాచ్‌కు ముందు ముగింపు వేడుకలు ఉన్నాయి. దీంతో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించేందుకు బ్లూ జెర్సీలతో స్టేడియానికి చేరుకుంటున్నారు.

  • 19 Nov 2023 11:20 AM (IST)

    గత 4 ప్రపంచకప్ ఫైనల్స్‌లో టాస్ చరిత్ర..

    అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియాలు ముఖాముఖిగా తలపడుతున్నాయి. మరి, టాస్ గెలిచిన తర్వాత ఏం చేయాలనేది అతిపెద్ద ప్రశ్న? అయితే నరేంద్ర మోదీ స్టేడియంలో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం ఉత్తమం. కానీ, గత 4 ప్రపంచకప్ ఫైనల్‌ల చరిత్ర భిన్నంగా ఉంది. అక్కడ టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకుంది. కాబట్టి భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5వ సారి చరిత్రను పునరావృతం చేస్తాయా లేదా అనేది చూడాలి.

  • 19 Nov 2023 11:04 AM (IST)

    ప్రపంచకప్‌లో భారత్-ఆస్ట్రేలియాల హిస్టరీ..

    ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా అత్యంత బలమైన జట్టు. ఈ జట్టు ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియా తొలిసారిగా 1987లో అలన్ బోర్డర్ కెప్టెన్సీలో ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత, స్టీవ్ వా కెప్టెన్సీలో, ఈ జట్టు మళ్లీ 1999లో ఛాంపియన్‌గా నిలిచింది. ఆపై రికీ పాంటింగ్ కెప్టెన్సీలో 2003, 2007లో విజేతలుగా నిలిచి హ్యాట్రిక్‌ను పూర్తి చేసింది. 2015లో, మైఖేల్ క్లార్క్ కెప్టెన్సీలో ఈ జట్టు ఐదవసారి ఛాంపియన్‌గా నిలిచింది. భారత్ రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. ఈ జట్టు తొలిసారిగా 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో ప్రపంచకప్ గెలిచింది. ఇక 2011లో ఎంఎస్ ధోని కెప్టెన్సీలో మళ్లీ ఛాంపియన్‌గా నిలిచింది.

  • 18 Nov 2023 07:44 PM (IST)

    స్క్వాడ్‌లు:

    భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ , ప్రసిద్ కృష్ణ.

    ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్, సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్, అలెక్స్ కారీ , కామెరాన్ గ్రీన్.

  • 18 Nov 2023 07:00 PM (IST)

    టీమిండియా ప్లేయింగ్ 11లో మార్పలు?

    రవిచంద్రన్ అశ్విన్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతను చెన్నైలో ఆస్ట్రేలియాతోనే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. అయితే, ఫైనల్‌కు ముందు అశ్విన్ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. అందుకే అతను ఫైనల్‌లో ప్లేయింగ్-11లో భాగం అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    IND vs AUS Playing 11: ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం వస్తుందా.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?

  • 18 Nov 2023 05:59 PM (IST)

    ఐసీసీ నాకౌట్‌లో భారత్ ప్రదర్శన..

    ఐసీసీ నాకౌట్‌లో ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం ఏ జట్టుకైనా అంత సులభం కాదు. అయితే, వివిధ ఐసీసీ ఈవెంట్ల నాకౌట్ మ్యాచ్‌ల్లో భారత్ నాలుగుసార్లు కంగారూలను ఓడించడం ఓదార్పునిస్తోంది.

    ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

    IND vs AUS Final: ఐసీసీ నాకౌట్‌లో భారత్ ప్రదర్శన.. ఆసీస్‌పై గణాంకాలు ఎలా ఉన్నాయంటే?

  • 18 Nov 2023 05:33 PM (IST)

    టీమిండియా ప్రాక్టీస్

    చివరి పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఈ క్రమంలో తమ సన్నాహాలకు తుది మెరుగులు దిద్దుకుంది. ప్రాక్టీస్‌లో భాగంగా భారత ఆటగాళ్లు మైదానంలో చెమటలు చిందిచారు.

  • 18 Nov 2023 05:05 PM (IST)

    టాస్‌కు పెద్దగా పట్టింపు ఉండదు- ఆస్ట్రేలియా సారథి..

    ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌కు ముందు, అహ్మదాబాద్ పిచ్ గురించి అడిగిన ప్రశ్నలకు ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పిచ్‌ను లోతుగా అర్థం చేసుకునేంత నిపుణుడిని కాదంటూనే, ఈ వికెట్‌ బాగుందంటూ చెప్పుకొచ్చాడు. ఈ పిచ్‌పై టాస్‌కు పెద్దగా పట్టింపు ఉండదని తేల్చేశాడు.

  • 18 Nov 2023 04:45 PM (IST)

    కెప్టెన్లతో ఫొటో షూట్..

  • 18 Nov 2023 04:28 PM (IST)

    నాలుగు దఫాలుగా ముగింపు వేడుకలు..

    ఈ ముగింపు వేడుకల కార్యక్రమాలు నాలుగు దశల్లో జరగనున్నాయి. ప్రీ-మ్యాచ్‌, మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్, ఇన్నింగ్స్ బ్రేక్, రెండవ ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్ ఇలా నాలుగు దఫాలుగా నిర్వహించనున్నారు.

  • 18 Nov 2023 04:26 PM (IST)

    తుదిపోరుకు రంగం సిద్ధం..

    2023 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు బీసీసీఐ, ఐసీసీ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యాయి.

Published On - Nov 19,2023 7:30 AM

Follow us