IND vs AUS Playing 11: ఫైనల్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి అవకాశం వస్తుందా.. రోహిత్ శర్మ ఏమన్నాడంటే?
India vs Australia CWC 2023 Final Playing 11: రవిచంద్రన్ అశ్విన్ ఈ ప్రపంచకప్‌లో భారత్ తరపున ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు. అతను చెన్నైలో ఆస్ట్రేలియాతోనే మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. అయితే, ఫైనల్‌కు ముందు అశ్విన్ చాలా సేపు ప్రాక్టీస్ చేశాడు. అందుకే అతను ఫైనల్‌లో ప్లేయింగ్-11లో భాగం అవుతాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
World Cup 2023 Semifinal: వన్డే ప్రపంచకప్-2023లో ఆదివారం జరిగే ఫైనల్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ టైటిల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విశ్వవిజేతగా నిలపబోయే 11 మంది ఆటగాళ్లపై దృష్టి పెట్టాడు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ ప్లేయింగ్-11కి సంబంధించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. జట్టు వ్యూహం ఏమిటో చెప్పుకొచ్చాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు అవకాశం ఇవ్వాలనే ప్రశ్నపై జట్టు మేనేజ్‌మెంట్ ఆలోచనను వ్యక్తం చేశాడు.
ఫైనల్ మ్యాచ్‌లో అశ్విన్‌కు అవకాశం దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అశ్విన్ తొలి మ్యాచ్ ఆడినా, ఆ తర్వాత మళ్లీ ప్లేయింగ్-11లో కనిపించలేదు. అశ్విన్ నిన్న తీవ్రంగా ప్రాక్టీస్ చేశాడు. మహ్మద్ సిరాజ్ స్థానంలో అతనికి అవకాశం లభిస్తుందని భావిస్తున్నారు.
రోహిత్ ఏం చెప్పాడంటే..
ప్లేయింగ్-11లో అశ్విన్‌ను చేర్చడంపై రోహిత్ మాట్లాడుతూ, ప్లేయింగ్ 11లో ఎవరనేది జట్టు ఇంకా నిర్ణయించుకోలేదు. రేపు పిచ్ చూసి ప్లేయింగ్-11లో ఎవరు ఉండాలో నిర్ణయిస్తామని రోహిత్ చెప్పుకొచ్చాడు. జట్టులోని 12-13 మంది ఆటగాళ్లను నిర్ణయిస్తామని, అయితే రేపు జట్టు బలాన్ని బట్టి పిచ్‌పై నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. జట్టు ఆటగాళ్లకు సంబంధించి.. ఆటగాళ్లందరికీ వారి బాధ్యతల గురించి చెప్పామని రోహిత్ తెలిపాడు. క్లియర్ మైండ్‌సెట్‌తో ఆడుతామని టీమిండియా కెప్టెన్ ప్రకటించాడు.
బయటి వాతావరణంతో సంబంధం లేదు..
🎙️ #TeamIndia Captain Rohit Sharma addressing the pre-match press conference ahead of the #CWC23 Final 🏟️#MenInBlue | #INDvAUS pic.twitter.com/7SgUX0ws9q
— BCCI (@BCCI) November 18, 2023
ఫైనల్‌కు సంబంధించి యావత్ క్రికెట్‌లో వాతావరణం హీటెక్కింది. అయితే, బయట వాతావరణం ఎలా ఉంటుందో తనకు తెలుసని రోహిత్ అన్నాడు. తన గ్రూప్, టీమ్ బలంతోనే బరిలోకి దిగుతామని తెలిపాడు. జట్టులో ఎలాంటి ఒత్తిడి లేదని, ఈ ప్రశాంత వాతావరణాన్ని జట్టులో కొనసాగించాలని కెప్టెన్ చెప్పుకొచ్చాడు. ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తామని తేల్చి చెప్పాడు.
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..