Bigg Boss 7 Telugu:12 వారం బిగ్ బాస్ హౌజ్‌ కెప్టెన్‌గా ఆ లేడీ కంటెస్టెంట్‌.. దెబ్బకు టాప్‌-5లో ఛాన్స్‌

ప్రస్తుతమున్న ఓటింగ్ సరళి చూస్తుంటే శోభా శెట్టికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. అలాగే గౌతమ్‌ కృష్ణ కూడా ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరే డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్‌ సంగతి పక్కన పెడితే.. 12 వ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ కెప్టెన్సీ కోసం టాస్కులు నిర్వహించారు. కెప్టెన్సీ కంటెండర్స్ గా అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ బరిలో నిలిచారు.

Bigg Boss 7 Telugu:12 వారం బిగ్ బాస్ హౌజ్‌ కెప్టెన్‌గా ఆ లేడీ కంటెస్టెంట్‌.. దెబ్బకు టాప్‌-5లో  ఛాన్స్‌
Bigg Boss 7 Telugu
Follow us
Basha Shek

|

Updated on: Nov 17, 2023 | 1:01 PM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్‌ బాస్‌ రియాల్టి షో పదో వారం పూర్తి చేసుకుంది. 11 వారం కూడా కంప్లీట్‌ కావోస్తోంది. శుక్రవారం (నవంబర్‌17) తో బిగ్‌ బాస్‌ ఓటింగ్‌ ప్రక్రియ ముగియనుంది. దీంతో ఈ వారం ఎలిమినేట్‌ అయ్యే కంటెస్టెంట్‌ ఎవరన్న ప్రశ్న చాలామందిలోనూ తలెత్తుతోంది. ప్రస్తుతమున్న ఓటింగ్ సరళి చూస్తుంటే శోభా శెట్టికి చాలా తక్కువ ఓట్లు పడ్డాయి. అలాగే గౌతమ్‌ కృష్ణ కూడా ఆఖరి నుంచి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం వీరిద్దరే డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేషన్‌ సంగతి పక్కన పెడితే.. 12 వ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ కెప్టెన్సీ కోసం టాస్కులు నిర్వహించారు. కెప్టెన్సీ కంటెండర్స్ గా అమర్ దీప్, అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ బరిలో నిలిచారు. వీరి మధ్య పోటీలు నిర్వహించగా.. చివరకు ప్రియాంకదే పైచేయి అయ్యింది. దీంతో 12వ వారం బిగ్‌ బాస్‌ హౌజ్‌ కెప్టెన్‌గా మరోసారి లేడీ కంటెస్టెంట్‌ ఎంపికైంది. కాగా బిగ్‌ బాస్‌ రియాల్టి షో తుది అంకానికి చేరుకుంది. మరో నాలుగు వారాల్లో ఈ సెలబ్రిటీ గేమ్ షో ముగియనుంది. మరి గ్రాండ్‌ ఫినాలేకి టాప్ 6 కంటెస్టెంట్స్ పోతారని ప్రచారం జరగుతోంది. అలాగే మరో వారం పొడిగించి.. టాప్ 5నే పంపుతారని కూడా రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

ఇక మొత్తానికి టాప్‌- 5లో శివాజీ, అమర్‌ దీప్‌ చౌదరి, పల్లవి ప్రశాంత్‌, ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక జైన్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ప్రియాంక దాదాపు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఓటింగ్‌లో ఆమె ఐదో స్థానంలో కొనసాగుతోంది. నెక్ట్స్‌ వీక్‌ కూడా ఆమె నామినేషన్స్‌లోకి వచ్చే ఛాన్సే లేదు. ఎందుకంటే కెప్టెన్సీలో ఉన్నవారిని నామినేట్‌ చేయడానికి ఆస్కారముండదు. ఆ లెక్కన చూస్కుంటే ఈ వీక్‌ ఎలిమినేషన్స్‌ నుంచి ప్రియాంక తప్పించుకుంటే నెక్ట్స్‌ వీక్‌ నామినేషన్స్‌లోకి కూడా రాదు. అంటే టాప్‌- 5లో చేరిపోయేందుకు ప్రియాంకకు అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం హౌజ్‌లో 10 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, గౌతమ్ కృష్ణ, అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ హౌజ్‌లో కొనసాగుతున్నారు. ఇక ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీలు నిర్వహించగా.. మొదట అర్జున్‌ అంబటి ఈ పాస్‌ను సాధించాడు. అయితే ఆ తర్వాత ఈ పాస్‌ ప్రిన్స్‌ యావర్‌ చేతికి వెళ్లిపోయింది.

ఇవి కూడా చదవండి

టాప్- 5లో ప్రియాంకకు ఛాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లక్ష్యంగా తెంబా మాస్టర్ ప్లాన్..!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
జస్ప్రీత్ బుమ్రా @ 200.. మెల్‌బోర్న్‌లో డబుల్ సెంచరీ
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్ లో గాయపడిన ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
BBLలో సామ్ కాన్స్టాస్ మెరుపులు..IPL 2025లో ఆ జట్టులోకి..?
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
మహా కుంభమేళలో నాల్గవ రాజ స్నానం ఎప్పుడు? శుభ సమయం తెలుసుకోండి
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
ఫీలింగ్స్ సాంగ్ చేయడానికి చాలా భయపడ్డా.. రష్మిక
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
పంట పొలాల్లో కదులుతూ కనిపించిన భారీ ఆకారం.. ఏంటాని చూడగా..!
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం
ఇంగ్లాండ్‌కు షాక్: గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి ఆ స్టార్ దూరం