AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara Birthday: ‘నా జీవితానికి అర్థం నువ్వే’.. నయనతారకు విఘ్నేష్‌ స్వీట్‌ బర్త్‌ డే విషెస్‌.. ఫొటో వైరల్‌

తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన తార. ఓ వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లోనూ నటిస్తోందీ అమ్మడు. ఇటీవలే షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ బోణి కొట్టింది. ఇదిలా ఉంటే శనివారం (నవంబర్‌ 18నయన తార పుట్టిన రోజు ). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

Nayanthara Birthday: 'నా జీవితానికి అర్థం నువ్వే'.. నయనతారకు విఘ్నేష్‌ స్వీట్‌ బర్త్‌ డే విషెస్‌.. ఫొటో వైరల్‌
Nayanthara Family
Basha Shek
|

Updated on: Nov 18, 2023 | 7:51 PM

Share

తన అందం, అభినయంతో సినిమా ఇండస్ట్రీలో లేడీ సూపర్‌ స్టార్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది నయన తార. ఓ వైపు స్టార్‌ హీరోల సినిమాల్లో గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే, మరోవైపు లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌లోనూ నటిస్తోందీ అమ్మడు. ఇటీవలే షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌లోనూ బోణి కొట్టింది. ఇదిలా ఉంటే శనివారం (నవంబర్‌ 18నయన తార పుట్టిన రోజు ). దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ అందాల తారకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు. దీంతో నెట్టింట నయన పేరు మార్మోగిపోతోంది. ఇక విఘ్నేష్‌ శివన్‌ సోషల్‌ మీడియా వేదికగా ఎంతో కవితాత్మకంగా తన భార్యకు పుట్టిన‌రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. నయన తార, తన ఇద్దరు పిల్లలు కలిసున్న ఫొటోను ఇన్‌ స్టా గ్రామ్‌లో షేర్‌ చేసిన విఘ్నేష్‌ ‘నా జీవితానికి అర్థం నువ్వే..నువ్వు, నీ ఆనంద‌మే నా జీవితాన్ని మరింత అందంగా మార్చేశాయి. ల‌వ్ యూ మై ఉయిర్‌, ఉల‌గ‌మ్ న‌య‌న‌తార’ అంటూ తన సతీమణిపై ప్రేమను కురిపించాడు. త‌మిళంలో ఉయిర్ అంటే జీవితం, ఉల‌గ‌మ్ అంటే ప్రపంచం అని అర్థం. అంటే త‌న జీవితం, లోకం మొత్తం న‌య‌న‌తారే అన్నట్లుగా విఘ్నేష్‌ శివన్‌ పోస్ట్‌ షేర్‌ చేశాడు. ఈ ఫొటోలో డెనిమ్ జీన్స్‌లో న‌య‌న‌తార ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తోంది. అలాగే ఇద్దరు పిల్లలు ఎంతో క్యూట్‌గా ఉన్నారు. ప్రస్తుతం విఘ్నేష్‌ శివన్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు నయనతార కు పుట్టిన రోజు విషెస్‌ చెబుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. ఈ ఏడాది షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చింది నయన తార. మొదటి సినిమాతోనే బ్లాక్‌ బస్టర్‌ను ఖాతాలో వేసుకుంది. అట్లీ తెరకెక్కించిన ఈ కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా రూ.1150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక జయం రవి సరసన నటించిన ఇరైవన్‌ (తెలుగులో గాడ్‌) సినిమా కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం అన్ని పూర్ణి అనే సినిమాలో నటిస్తోందీ లేడీ సూపర్‌ స్టార్‌. అలాగే టెస్ట్‌, మన్నగట్టి సిన్స్‌ 1960 అనే క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

విఘ్నేష్ శివన్ పోస్ట్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
రూ.80 వేల బైక్.. రూ.10.30 లక్షల జరిమానా!
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
దువ్వెనను ఎన్ని రోజులకు ఒకసారి క్లీన్ చేయాలి? జుట్టు ఆరోగ్యం కోసం
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
ఇల్లు కట్టేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు.. నిపుణులు చెప్పిన సూచనలు!
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
వైద్యరంగంలో గ్లోబల్ భాగస్వామ్యమే కీలకం: నాసిర్ అలీ ఖాన్
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
ఘనంగా గాంధీ, శాస్త్రి జయంతి.. ప్రధాని మోదీ నివాళులు
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కలలో మెట్లు ఎక్కుతున్నారా? దిగుతున్నారా? స్వప్న శాస్త్రం చెప్పే..
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
కీళ్ళ నొప్పులు ఎంతకీ తగ్గడం లేదా? ఇవి తింటే పూర్తిగా మాయం
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
శంషాబాద్ నుంచి కడప వెళ్తున్న విమానంలో కలకలం..!
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు.. వెదర్ రిపోర్ట్
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!
ఉడకబెట్టిన గుడ్లు ఎంతసేపు బయట ఉంచవచ్చు? నిపుణుల సూచనలు!