Tiger 3 OTT: ఓటీటీలోకి టైగర్‌ 3.. ఆ పండగకు స్ట్రీమింగ్‌కు రానున్న సల్మాన్‌ ఖాన్‌ సినిమా.. పూర్తి వివరాలివే

దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదలైన ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ఇప్పటివరకు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశమంతా ప్రపంచ కప్‌ ఫీవర్‌ నడుస్తోంది కాబట్టి గత రెండు రోజులుగా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టాయి. ఫైనల్‌ తర్వాత మళ్లీ టైగర్‌ విజృంభించే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టైగర్‌ 3 మూవీ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది

Tiger 3 OTT: ఓటీటీలోకి టైగర్‌ 3.. ఆ పండగకు స్ట్రీమింగ్‌కు రానున్న సల్మాన్‌ ఖాన్‌ సినిమా.. పూర్తి వివరాలివే
Tiger 3 Movie
Follow us

|

Updated on: Nov 18, 2023 | 9:12 PM

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ చాలా రోజుల తర్వాత ఓ మంచి సాలిడ్‌ హిట్‌ను అందుకున్నాడు. ఆయన నటించిన టైగర్‌ 3 సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. దీపావళి కానుకగా నవంబర్‌ 12న విడుదలైన ఈ యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ఇప్పటివరకు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టిందని ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం దేశమంతా ప్రపంచ కప్‌ ఫీవర్‌ నడుస్తోంది కాబట్టి గత రెండు రోజులుగా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టాయి. ఫైనల్‌ తర్వాత మళ్లీ టైగర్‌ విజృంభించే అవకాశాలు లేకపోలేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే టైగర్‌ 3 మూవీ గురించి సోషల్‌ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది. అదే ఈ హై యాక్షన్‌ స్పై థ్రిల్లర్‌ ఓటీటీ రిలీజ్‌. అదేంటి.. మొన్ననే కదా థియేటర్లలో టైగర్‌ 3 విడుదలైంది. అప్పుడే ఓటీటీలోకి ఏంటా? అని ఆలోచిస్తున్నారా? అయితే అసలు విషయంలోకి వెళదాం రండి. టైగర్‌ 3 డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సొంతం చేసుకుంది. సల్మాన్‌ కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని భారీ మొత్తంలో అమెజాన్‌ ప్రైమ్‌ డీల్‌ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే థియేట్రికల్‌ రన్‌ పూర్తిగా ముగిసిన తర్వాతనే అంటే డిసెంబర్‌ మూడో వారంలో సల్మాన్ మూవీని ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నారట. లేకపోతే క్రిస్మస్‌ పండగ కానుకగా టైగర్‌ 3 ను ఓటీటీలోకి అందుబాటులోకి తీసురావొచ్చనే టాక్‌ వినిపిస్తోంది.

మనీష్‌ శర్మ దర్శకత్వం వహించిన టైగర్ 3 సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ కు జోడీగా కత్రినా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. సీరియల్‌ కిస్సింగ్‌ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్‌గా మెప్పించాడు. ఇక బాలీవుడ్ సూపర్‌ స్టార్స్‌ షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అతిథి పాత్రల్లో అలరించారు. . ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా ఈ స్పై థ్రిల్లర్‌ను నిర్మించారు.

ఇవి కూడా చదవండి

సల్మాన్, ఇమ్రాన్ ల బ్రోమాన్స్ మాములుగా లేదుగా..

సల్మాన్, కత్రినాల సూపర్ డ్యాన్స్ చూశారా?

టైగర్ 3 సక్సెస్ సెలబ్రేషన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!