IND vs AUS: ప్రపంచకప్‌కు సినీ గ్లామర్.. ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేయనున్న టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే..
ప్రస్తుతం మన దేశంలో క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా ప్రపంచ కప్ ఫైనల్ గురించే చర్చ జరుగుతోంది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లడం, అందులోనూ స్వదేశంలో టైటిల్ పోరు జరుగుతుండడంతో అభిమానుల అంచనాలు ఆకాశానంటుతున్నాయి. ఆదివారం (నవంబర్ 19) ఫైనల్ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ..
ప్రస్తుతం మన దేశంలో క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. ఎక్కడ చూసినా, ఎవరిని అడిగినా ప్రపంచ కప్ ఫైనల్ గురించే చర్చ జరుగుతోంది. సుమారు 12 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు భారత్ దూసుకెళ్లడం, అందులోనూ స్వదేశంలో టైటిల్ పోరు జరుగుతుండడంతో అభిమానుల అంచనాలు ఆకాశానంటుతున్నాయి. ఆదివారం (నవంబర్ 19) ఫైనల్ మ్యాచ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా తుది సమరం చూసేందుకు తహతహలాడుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది హీరోలు ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు అహ్మదాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కింగ్ నాగార్జున నరేంద్ర మోడీ స్టేడియంలో హంగామా చేసేందుకు రెడీ అయ్యారట. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి ఈ ముగ్గురి పేర్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి కొందరు హీరోలు సైలెంట్‌గా అహ్మదా బాద్ కు వెళ్లిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక మిగతా సినిమా ఇండస్ట్రీల విషయానికొస్తే.. బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు హాజరుకానున్నారు. షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, రణ్‌బీర్ కపూర్‌తో తదితర స్టార్ సెలబ్రిటలు సందడి చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక కోలీవుడ్ నుంచి రజనీ కాంత్, కమల్ హాసన్, ధనుష్, మలయాళం నుంచి మోహన్ లాల్ తదితర ప్రముఖులు గ్యారెంటీగా నరేంద్ర మోడీ స్టేడియానికి రానున్నారని తెలుస్తోంది. మొత్తానికి ప్రపంచకప్ ఫైనల్‌లో సినీ గ్లామర్ బాగానే ఉండనున్నట్లు తెలుస్తోంది.
కాగా ముంబై వేదికగా జరిగిన ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లో వెంకటేష్, కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, రణ్ బీర్ కపూర్, మాధురీ దీక్షిత్ తదితర సినీ ప్రముఖులు సందడి చేసిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్ బాయ్‌గా మారిపోయాడు. విండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, ఇంగ్లండ్ సాకర్ దిగ్గజం బెక్ హమ్‌లతో సెల్ఫీలు, ఫొటోలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికొస్తే ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దీన్ని చూసేందుకు ఇండియా-ఆస్ట్రేలియా ప్రధాన మంత్రులు హాజరుకానున్నారని తెలుస్తోంది. అలాగే ఇప్పటివరకు వరల్డ్‌కప్ గెలుచుకున్న జట్ల సారథులకు కూడా ఆహ్వానం అందనుంది.
ప్రపంచ కప్ ట్రోఫీతో భారత్ ,ఆసీస్ జట్ల కెప్టెన్లు.. ఫొటో షూట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.