AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వరుణ్ గురించి ఏం చెప్పిందంటే..

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లావణ్య. వీరిద్దరు కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ వీరిద్దరి ప్రేమ విషయం మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. ఈఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం జరగడానకిి కొన్ని రోజుల ముందు వరుణ్, లావణ్య ప్రేమ కహానీ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది నవంబర్ 1న వీరి వివాహం ఘనంగా జరిగింది.

Lavanya Tripathi: పెళ్లి తర్వాత తొలిసారి లావణ్య ఇంట్రెస్టింగ్ పోస్ట్.. వరుణ్ గురించి ఏం చెప్పిందంటే..
Varun Tej, Lavanya Tripathi
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2023 | 8:56 PM

Share

మెగా హీరో వరుణ్ తేజ్.. హీరోయిన్ లావణ్య త్రిపాఠి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల ప్రేమ .. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యింది. నవంబర్ 1న వీరిద్దరి వివాహం ఇరు కుటుంబసభ్యులు, అత్యంత కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ఇటలీలోని టుస్కానీలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ , రామ్ చరణ్, ఉపాసన, నితిన్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వీరి పెళ్లి వేడుకలో సందడి చేశారు. అనంతరం నవంబర్ 5న టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‏లో రిసెప్షన్ నిర్వహించారు. ఇక ఇటీవలే లావణ్య పుట్టినిల్లు డెహ్రాడూన్‏లో వరుణ్, లావణ్య రిసెప్షన్ వేడుకలు జరిగాయి. పెళ్లి వేడుకల అనంతరం.. శనివారం తన ఇన్ స్టా వేదికగా తొలిసారి తన భర్త, వివాహం గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది మెగా కోడలు లావణ్య. అంతేకాకుండా తన పెళ్లి వేడుకలోని కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఇక లావణ్య పోస్టుకు వరుణ్ సైతం రిప్లై ఇచ్చాడు.

” నాకు తెలిసిన అత్యంత అద్భుతమైన, దయగల, కేరింగ్ ఉన్న వ్యక్తి ఇప్పుడు నా భర్త!.. నేను చెప్పడానికి చాలా ఉంది, కానీ వాటన్నింటిని మనసులోనే దాచుకుంటాను. ♥️..మా కుటుంబాలు, ప్రియమైనవారి మధ్య మా మూడు రోజుల పెళ్లి జరిగింది. మా కల నెరవేరింది. ఈ రోజును చాలా ప్రత్యేకంగా చేసిన ప్రతి ఒక్కరికీ, మాకు శుభాకాంక్షలు పంపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.” అంటూ పెళ్లి ఫోటోస్ షేర్ చేసింది. అయితే లావణ్య పోస్ట్‏కు లవ్ ఎమోజీని షేర్ చేశాడు వరుణ్. ప్రస్తుతం లావణ్య పోస్ట్ నెట్టింట వైరలవుతుండగా.. వీరిద్దరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్.

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది లావణ్య. వీరిద్దరు కలిసి మిస్టర్ సినిమాలో నటించారు. ఈ మూవీ చిత్రీకరణ సమయంలో ఏర్పడిన పరిచయమే ఆ తర్వాత ప్రేమగా మారింది. కానీ వీరిద్దరి ప్రేమ విషయం మాత్రం ఎక్కడా బయటకు రాలేదు. ఈఏడాది జూన్ లో వీరి నిశ్చితార్థం జరగడానకిి కొన్ని రోజుల ముందు వరుణ్, లావణ్య ప్రేమ కహానీ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టింది. ఈ ఏడాది నవంబర్ 1న వీరి వివాహం ఘనంగా జరిగింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.