Hi Nanna Movie: ‘హాయ్ నాన్న’ మేనిఫెస్టో.. యూత్‏పై నాని వరాల జల్లు.. వరల్డ్‏కప్ ఫైనల్ టికెట్ పై డిస్కౌంట్..

ప్రమోషన్స్ కోసం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగుతుంటే.. పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ, మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిని తన సినిమా ప్రచారానికి వాడేశారు నాని. రాజకీయ నాయకుడిగా మారి హాయ్ నాన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో యూత్ పై వరాలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ హాయ్ నాన్న మేనిఫెస్టోలో నాని ఇచ్చిన పథకాలు..

Hi Nanna Movie: 'హాయ్ నాన్న' మేనిఫెస్టో.. యూత్‏పై నాని వరాల జల్లు.. వరల్డ్‏కప్ ఫైనల్ టికెట్ పై డిస్కౌంట్..
Nani
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 18, 2023 | 9:26 PM

అటు రిలీజ్ డేట్ దగ్గరకొచ్చేసింది.. ఇటు ఎలక్షన్స్ కూడా మధ్యలోనే ఉన్నాయి. రెండింటిని వాడేయడమే అంటున్నారు న్యాచురల్ స్టార్ నాని. మేనిఫెస్టోలు అంటే నోటికొచ్చింది చెప్పేస్తున్నారు అందరూ.. నేనూ ఒక రాయి ఏసా.. మీ ఓటు హాయ్ నాన్నకే అంటూ ఫన్నీ వీడియో షేర్ చేశారు నాని. ప్రమోషన్స్ కోసం సరికొత్తగా ట్రై చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నాని. ప్రస్తుతం తెలంగాణలో ఎలక్షన్స్ జోరు కొనసాగుతుంటే.. పార్టీలు పోటాపోటీగా ప్రచారాలు చేస్తూ, మేనిఫెస్టోలు ప్రకటిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఎలక్షన్స్ హడావిడిని తన సినిమా ప్రచారానికి వాడేశారు నాని. రాజకీయ నాయకుడిగా మారి హాయ్ నాన్న మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఇందులో యూత్ పై వరాలు కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇంతకీ హాయ్ నాన్న మేనిఫెస్టోలో నాని ఇచ్చిన పథకాలు.. ఆఫర్స్ ఏంటో ఒకసారి చూసేద్దామా.

“మన పార్టీ హాయ్ నాన్న.. అధికారంలోకి వస్తే.. యూత్ అందరికీ విచ్చలవిడిగా రీల్స్ చేసుకోవడానికి స్మార్ట్ ఫోన్స్, లైటింగ్ సెటప్ కిట్స్ పంచిపెడతాము. అందరి ఆదాయం పెరిగేలా చూస్తాం. థియేటర్లది.. అలాగే పక్కనే ఉండే కిరాణ కొట్టుల ఆదాయం కూడా. సబ్జెక్ట్, టాపిక్ తెలియకుండా అదే పట్టుకుని వేలాడుతూ ఇష్టమొచ్చినట్లు వాగే వాళ్ల ఆదాయం పెరిగేలా చూస్తాం. నన్ను గనక పదవిలో కూర్చోబెడితే.. ప్రతి జంక్షన్లో నా బొమ్మ ఉండేలా చూస్తా.. అలాగే ప్రతి థియేటర్లో మా హాయ్ నాన్న ఉండేలా చూస్తా. వరల్డ్ కప్ క్రికెట్ టికెట్ పై డిస్కౌంట్ ఇస్తాం” అని అన్నాడు. దీంతో ఓ వ్యక్తి కల్పించుకుని వరల్డ్ కప్ అయిపోయింది సర్ అని చెప్పడంతో వచ్చే వరల్డ్ కప్.. చెప్తాం కానీ ఇవ్వక్కర్లేదు కదా అంటూ సెటైర్ వేశాడు నాని.

అలాగే “మీ ఫేవరెట్ పార్టీ అయినా హాయ్ నాన్నను గెలిపించుకోవడానికి.. హాయ్ నాన్న అంటే తండ్రి, కూతురికి మధ్య అనుబంధం గుర్తొస్తుంది. అందుకే ప్రతి తండ్రికి, కూతురు రెండువైపుల ఉండేలా చూసుకుంటాం. ఒకరికి రెండు ఓట్లు ఉండేలా చూసుకుంటున్నాం వన్ ప్లస్ వన్ ఆఫర్. ఓట్లు అంటే 18 ఏళ్లు దాటిన వారే వేయ్యాలి. కానీ హాయ్ నాన్న చిత్రానికి చిన్న, పెద్ద ఓటు వేయొచ్చు. ముందస్తు ఎన్నికలు తరతరాలుగా వస్తుంది. అందుకే ఒకరోజు ముందుగానే హాయ్ నాన్న వస్తుంది.” అంటూ చెప్పుకొచ్చాడు. నాని షేర్ చేసిన ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు తెగ వైరలవుతుంది.

హాయ్ నాన్న విషయానికి వస్తే.. ఈ చిత్రంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్నారు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్ తో వస్తోన్న ఈ సినిమాకు డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించారు. ఇందులో కియారా ఖన్నా నాని కూతురిగా కనిపించనుంది. ఇప్పటికే అన్ని పనులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 7న తెలుగుతోపాటు హిందీలోనూ రిలీజ్ కాబోతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.