IND vs AUS, World Cup Final: మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ- మ్యాక్సీల ఫైట్‌.. సీరియస్‌గా కాదండోయ్‌.. వీడియో చూశారా?

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ కు దిగిన భారత జట్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కే ఎల్‌ రాహుల్‌(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విరాట్‌ కోహ్లీ (54); రోహిత్‌ శర్మ(47) పరుగులతో రాణించారు.

IND vs AUS, World Cup Final: మ్యాచ్‌ మధ్యలో కోహ్లీ- మ్యాక్సీల ఫైట్‌.. సీరియస్‌గా కాదండోయ్‌.. వీడియో చూశారా?
India Vs Australia
Follow us
Basha Shek

|

Updated on: Nov 19, 2023 | 6:33 PM

ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో టీమిండియా పూర్తిగా నిరాశపర్చింది. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న హై ఓల్టేజ్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ కు దిగిన భారత జట్లు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఆస్ట్రేలియా బౌలర్ల ధాటికి సరిగ్గా 50 ఓవర్లలో కేవలం 240 పరుగులకే కుప్పకూలింది. కే ఎల్‌ రాహుల్‌(66) టాప్‌ స్కోరర్‌గా నిలవగా, విరాట్‌ కోహ్లీ (54); రోహిత్‌ శర్మ(47) పరుగులతో రాణించారు. గిల్‌ (4), శ్రేయస్‌ అయ్యర్‌ (4), రవీంద్ర జడేజా (9), సూర్య కుమార్‌ యాదవ్ (18), మహ్మద్‌ షమీ (6), జస్‌ ప్రీత్ బుమ్రా (1), కుల్‌ దీప్‌ యాదవ్‌ (10), మహ్మద్ సిరాజ్‌ (9) నిరాశపర్చారు. ఇదిలా ఉంటే మ్యాచ్‌ మధ్యలో టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్‌ మధ్య ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా ఇన్నింగ్స్‌ 20 వ ఓవర్‌ వేసిన మిచెల్‌ మార్ష్‌ బౌలింగ్‌లో కోహ్లీ మిడ్‌ వికెట్‌ మీదుగా షాట్‌ ఆడాడు. అయితే బంతి నేరుగా మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న మ్యాక్స్‌వెల్‌ దగ్గరికి వెళ్లింది. అయితే మాక్సీ వికెట్‌ కీపర్‌ త్రో వేసే క్రమంలో బంతి మిస్‌ అయ్యి విరాట్‌ కోహ్లీ పైకి వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన కోహ్లీ బంతిని చేతితో పట్టుకున్నాడు. మ్యాక్సీ కూడా కోహ్లీ వైపు చూస్తూ క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత విరాట్ మ్యాక్స్‌వెల్‌ దగ్గరకు వెళ్లి సీరియస్‌గా చూస్తూ నవ్వాడు. మ్యాక్సీ కూడా సరదాగా స్మైల్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది.

కాగా విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్‌ మధ్య మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో 54 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఆసీస్‌ కెప్టెన్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఇక మ్యాక్స్‌వెల్‌ 6 ఓవర్లు వేసి కీలకమైన రోహిత్‌ శర్మ వికెట్‌ తీశాడు. ఇక ఫైనల్‌లో భారత్‌ గెలవాలంటే భారమంతా బౌలర్లపైనే ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ మధ్యలో కోహ్లీ, మ్యాక్స్ వెల్ ఇలా..

View this post on Instagram

A post shared by ICC (@icc)

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): ట్రావిస్ హెడ్, డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్(కీపర్), మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్(కెప్టెన్), ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్
ప్లానింగ్‌తో పిచ్చెక్కిస్తున్న డాకూ మహరాజ్