Telangana: చిన్న గాయమే అనుకున్నారంతా.. చివరికి బ్రెయిన్‌ డెడ్‌తో యువకుడు మృతి! అసలేం జరిగిందంటే..

డుకును గొప్ప చదువులు చదివించిన ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు అన్నీ కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కొడుకే సర్వస్వంగా జీవిస్తున్న ఆ దంపతులకు చివరికి కన్నీరే మిగిలింది. ఎప్పుడో తగిలిన చిన్న గాయం చివరకు అతడి ప్రాణాలనే హరించింది. తనకు చిన్న అనారోగ్య సమస్య రావడంతో సివిల్స్‌కు సిద్ధమవుతున్న కొడుకు చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చాడు. అలా వచ్చిన వాడు ఊహించని రీతిలో బ్రెయిన్‌ డెడ్‌తో మృత్యువాత..

Telangana: చిన్న గాయమే అనుకున్నారంతా.. చివరికి బ్రెయిన్‌ డెడ్‌తో యువకుడు మృతి! అసలేం జరిగిందంటే..
Brain Dead In Sattenapally
Follow us

|

Updated on: Nov 19, 2023 | 4:46 PM

సత్తెనపల్లి, నవంబర్ 19: కొడుకును గొప్ప చదువులు చదివించిన ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ ఉపాధ్యాయ దంపతులు కన్న కలలు అన్నీ కల్లలయ్యాయి. ఒక్కగానొక్క కుమారుడిని ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కొడుకే సర్వస్వంగా జీవిస్తున్న ఆ దంపతులకు చివరికి కన్నీరే మిగిలింది. ఎప్పుడో తగిలిన చిన్న గాయం చివరకు అతడి ప్రాణాలనే హరించింది. తనకు చిన్న అనారోగ్య సమస్య రావడంతో సివిల్స్‌కు సిద్ధమవుతున్న కొడుకు చూసేందుకు ఢిల్లీ నుంచి వచ్చాడు. అలా వచ్చిన వాడు ఊహించని రీతిలో బ్రెయిన్‌ డెడ్‌తో మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకెళ్తే..

తెలంగాణలోని సత్తెనపల్లి పట్టణంలోని మూడోవార్డు భీమవరం రోడ్డులో బంకా వాసుబాబు, నాగమణి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు నివాసం ఉంటున్నారు. అచ్చంపేట మండలంలోని వేల్పూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వాసుబాబు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంగా పనిచేస్తున్నాడు. సత్తెనపల్లి మండలంలోని అబ్బూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నాగమణి టీచర్‌గా పని చేస్తోంది. వీరికి ఒక అమ్మాయి, ఒక అబ్బాయి సంతానం. నిఖిల్‌ సోదరి మేరి ఆమెరికాలో పీజీ చదువుతోంది. కుమారుడైన నిఖిల్‌ చక్రవర్తి (28) అలియాస్‌ పండు బీటెక్‌ పూర్తిచేసి సివిల్స్‌పై దృష్టి సారించాడు. ఢిల్లీలో ఉంటూ సివిల్స్‌ శిక్షణ పొందుతున్నాడు. ఈక్రమంలో ఒకసారి ప్రిలిమినరీ పరీక్ష కూడా ఉత్తీర్ణుడయ్యాడు. ఈసారి ఎలాగైనా సివిల్స్‌లో సత్తా చాటుతాననే ధీమా వ్యక్తం చేశాడు. అయితే నెల క్రితం తండ్రికి అనారోగ్య సమస్య తలెత్తడంతో ఇంటికి వచ్చాడు. ఆసుపత్రిలో తండ్రి కోలుకునేలా దగ్గరే ఉండి సపర్యలు కూడా చేశాడు. త్వరలోనే ఢిల్లీ వెళ్లాలని సిద్ధమవుతున్నాడు కూడా. కానీ 20 రోజుల క్రితం రైల్వేస్టేషన్‌ రోడ్డులో ద్విచక్ర వాహనం నడుపుతూ నిఖిల్‌ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయాడు. చేతులకు, కాలికి చిన్ని చిన్న గాయాలయ్యాయి.

స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలకు వెళ్లి చికిత్స చేయించుకుని ఇంటికి వెళ్లాడు. చిన్న గాయమే కదా అని అశ్రద్ధ వహించాడు. కానీ చివరికి అదే అతని ప్రాణాలను హరించింది. అయితే గతకొన్ని రోజులుగా కళ్లు మసకగా కనిపిస్తుండటంతో ఈ నెల 12న సత్తెనపల్లిలోని ధూళిపాళ్ల ఎల్‌వీ ప్రసాద్‌ కంటి ఆసుపత్రికి ఒక్కడే వెళ్లాడు. అక్కడ పరీక్షలు చేయించుకుని బయటకు వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. ఆసుపత్రి సిబ్బంది అతన్ని అంబులెన్సులో సత్తెనపల్లిలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ రెండ్రోజుల వైద్యం తర్వాత నిఖిల్‌ మెదడు తర్వాత పని చేయడం ఆగిపోయింది. కాలికి తగిలిన గాయంతో రక్తం గడ్డకట్టి క్రమంగా శరీరంలోని అవయవాలన్నింటినీ దెబ్బతీస్తూ మెదడు పనితీరును ఆగిపోయేలా చేసిందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో నిఖిల్‌ ఆరోగ్యం మరింత విషమించి శనివారం మృతి చెందాడు. చెందికందివచ్చిన కొడుకు కళ్లముందే ప్రాణాలు వదలడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించిన తీరు చూపరులను కలచివేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.