Kohli Biryani Discount: కోహ్లీ ఎన్ని పరుగులు తీస్తే బిర్యానీపై అంత డిస్కౌంట్‌.. రెస్టారెంట్‌కు ఎగబడ్డ జనం! ఎక్కడంటే..

ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాకు చెందిన ఓ రెస్టారెంట్‌ వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. కోహ్లీ చేసిన పరుగులకు సమానమైన డిస్కౌంట్ ఇస్తున్నట్లు రెస్టారెంట్‌ యాజమన్యం ప్రకటించింది. అసలే అది బిర్యానీ రెస్టారెంట్.. పైగా డిస్కౌంట్ ప్రకటించడంలో జనం ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో సదరు రెస్టారెంట్‌ వద్ద తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. క్రికెటర్ చేసిన పరుగులకు సమానమైన బిర్యానీపై తినుబండారాల యాజమాన్యం డిస్కౌంట్ ప్రకటించింది..

Kohli Biryani Discount: కోహ్లీ ఎన్ని పరుగులు తీస్తే బిర్యానీపై అంత డిస్కౌంట్‌.. రెస్టారెంట్‌కు ఎగబడ్డ జనం! ఎక్కడంటే..
Kohli Biryani Discount
Follow us

| Edited By: TV9 Telugu

Updated on: Nov 18, 2023 | 6:02 PM

ముంబై, నవంబర్‌ 17: ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో విరాట్ కోహ్లి 50వ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాకు చెందిన ఓ రెస్టారెంట్‌ వినూత్న ఆఫర్‌ ప్రకటించింది. కోహ్లీ చేసిన పరుగులకు సమానమైన డిస్కౌంట్ ఇస్తున్నట్లు రెస్టారెంట్‌ యాజమన్యం ప్రకటించింది. అసలే అది బిర్యానీ రెస్టారెంట్.. పైగా డిస్కౌంట్ ప్రకటించడంలో జనం ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో సదరు రెస్టారెంట్‌ వద్ద తొక్కిసలాట వంటి పరిస్థితి ఏర్పడింది. క్రికెటర్ చేసిన పరుగులకు సమానమైన బిర్యానీపై తినుబండారాల యాజమాన్యం డిస్కౌంట్ ప్రకటించింది. కోహ్లి రికార్డు బ్రేక్ చేస్తూ 50వ సెంచరీని సాధించడంతో.. తగ్గింపు 100%కి చేరుకుంది. దీంతో చికెన్, మటన్ బిర్యానీ కస్టమర్లకు ఉచితంగా లభించింది.

ఫ్రీగా భోజన ప్రియులు ఎగబడి మరీ నచ్చిన బిర్యానీని లాగించేశారు. దీంతో ఈ వార్త కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఘటన బుధవారం సాయంత్రం దేహత్ పోలీసు పరిధిలోని టికోని బాగ్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రెస్టారెంట్ ఆఫర్ ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో కస్టమర్లు రెస్టారెంట్‌కు పోటెత్తారు. కస్టమర్లు లైన్‌లో బారులు తీరి నిలబడ్డారు. బిర్యానీ ప్లేట్‌లను పోటీపడీ మరీ లాగించేశారు. దీంతో రెస్టారెంట్ వద్ద స్వల్ప గందరగోళం ఏర్పడింది. ఊహించని డిమాండ్ రావడంతో రెస్టారెంట్‌లో బిర్యానీ కొద్ది నిమిషాల్లోనే ఖాళీ అయ్యింది. బిర్యానీ అయిపోయినట్లు రెస్టారెంట్ యాజమన్యం వెల్లడంచడంతో అప్పటి వరకూ క్యూలలో వేచిఉన్న కస్టమర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసాన్ని నివారించడానికి రెస్టారెంట్‌ యాజమన్యం పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు అక్కడికి చేరుకుని రెస్టారెంట్ వద్ద పెద్ద సంఖ్యలో గుమికూడిన కస్టమర్లను చెదరగొట్టారు. దీంతో అక్కడి పరిస్థితి సర్దుమనిగింది.

ఇవి కూడా చదవండి

కాగా గత బుధవారం విరాట్ కోహ్లీ తన 50వ వన్డే అంతర్జాతీయ సెంచరీని సాధించిన సంగతి తెలిసిందే. దీంతో సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ రికార్డును కోహ్లీ అధిగమించినట్లైంది. 279వ ఇన్నింగ్స్‌లో 50వ సెంటరీ మైలురాయిని ఛేదించాడు. ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో కోహ్లీ నా రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందంటూ సచిన్‌ టెండుల్కర్‌ ఎక్స్‌లో పోస్టు చేశాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
పాపం.! గుండెపోటుతో కుప్పకూలిన యువ నటి లక్ష్మిక.
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
ఎర్రని మందారంలాంటి సోయగం ఈ కుర్రదాని సొంతం.. మృణాళిని రవి ఫొటోస్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
సినిమాలు నిల్లు.. గ్లామర్ షో మాత్రం ఫుల్లు.. రకుల్ అందాలు అదుర్స్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
మాజీ సీఎం కేసీఆర్‌ను పరామర్శించిన తాజా సీఎం రేవంత్
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
చెన్నైకి వాతావరణశాఖ హెచ్చరిక.. మరో 5 రోజులు.!
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
పోలీసులకే సవాల్ విసిరిన దొంగలు.. దిశ ఎస్సై ఇంట్లో దొంగతనం
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
మహిళల్లో ఐరన్ లెవెల్స్ పెంచడానికి తప్పక తినాల్సిన ఆహారాలు ఇవి..
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ఆదిలాబాద్ ను కమ్మేసిన పొగ మంచు.. ఓవైపు పొగమంచు, మరోవైపు చిరుజల్లు
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి
ప్ర‌ధాని మోడీకి చంద్రబాబు లేఖ‌.. తుఫాన్ బాధిత రైతులను ఆదుకోండి
హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై జైషా కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?
హార్దిక్ పాండ్యా రీఎంట్రీపై జైషా కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?