PM Modi: నేను పాట పాడుతూ కనిపించాను.. డీప్ ఫేక్ వీడియోలతో వ్యవస్థకు పెను ముప్పు.. ప్రధాని మోదీ ఆందోళన..
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలని సినిమా హీరోయిన్ల ఫొటోలతో వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వేరొకరి ముఖాల స్థానంలో హీరోయిన్లు రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఆందోళన కలిగించాయి.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో డీప్ ఫేక్ వీడియోలు కలకలం రేపుతున్నాయి. కొందరు కావాలని సినిమా హీరోయిన్ల ఫొటోలతో వీడియోలను మార్ఫింగ్ చేసి నెట్టింట వైరల్ చేస్తున్నారు. అభ్యంతరకర దృశ్యాలతో ఉన్న ఈ వీడియోలు సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్‌ఫాంలపై దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. వేరొకరి ముఖాల స్థానంలో హీరోయిన్లు రష్మిక మందన్న, కాజోల్, కత్రినా కైఫ్ లాంటి స్టార్ల ముఖాలను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఈ వీడియోలు నిజమైనవే అని భ్రమించేలా ఆందోళన కలిగించాయి. తారలే కాదు.. ప్రధాని లాంటి ప్రజాప్రతినిధులను కూడా డీప్ ఫేక్ తో మార్ఫింగ్ చేసి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. ఈ సమస్య ఎంత పెద్ద విపత్తుగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ పాట పడినట్టు డీప్ ఫేక్ వీడియో సృష్టించడం దేశంలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి వీడియోలపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ డీప్ ఫేక్ వీడియోలపై స్పందించారు. డీప్ ఫేక్ వీడియోలు మన వ్యవస్థకు పెను ముప్పుగా మారుతున్నాయని.. సమాజంలో గందరగోళానికి దారితీస్తున్నాయంటూ ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా డీప్‌ఫేక్ కొత్త సవాలుగా మారిందని.. ఇది మరింత సమస్యాత్మకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో దీపావళి మిలన్ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. చాలా మంది వినియోగదారులు కృత్రిమ మేధస్సు బారిన పడుతుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా తన మొఖంతో మార్ఫింగ్ చేసిన వీడియో గురించి కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.
“ఇటీవల నేను పాడే వీడియో చూశాను. నాకు నచ్చిన వారు ఫార్వార్డ్ చేసారు. అందులో నేను పాట పాడుతున్నట్టుగా చూపించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ డీప్ ఫేక్ వీడియోలు రూపొందిస్తున్నారు. ఇది సమస్యాత్మకమైన అంశం. డీప్ ఫేక్ వీడియోల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ తరహా వీడియోలపై మీడియా, పాత్రికేయులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలి. కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజలను సన్నద్ధం చేయాలి” అంటూ ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతేకాదు, వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియోలను గుర్తించి, వాటిని ఫ్లాగ్ చేసి హెచ్చరికలు జారీ చేయాలని చాట్ జీపీటీ బృందాన్ని కోరినట్టు ప్రధాని మోదీ తెలిపారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముందుగా రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా రేపింది. బ్లాక్ యోగా బాడీసూట్ ధరించిన అమ్మాయి.. ముఖం రష్మికగా మార్ఫింగ్ చేశారు. ఆమె నవ్వుతూ ఎలివేటర్‌లోకి ప్రవేశిస్తున్నట్లు వీడియోలో ఉంది. ఆ తర్వాత కత్రినా కైఫ్ ‘టైగర్ 3’లో టవల్ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన మార్ఫింగ్ ఫొటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కాజోల్‌కి సంబంధించిన డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయింది. నటి బట్టలు మార్చుకుంటున్నట్లు దీనిలో చూపించారు. ఈ క్లిప్‌లో, కాజోల్ ముఖాన్ని ఇంగ్లీష్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ రోసీ బ్రీన్ వీడియోతో మార్ఫింగ్ చేశారు. ఇలా డీప్ ఫేక్ వీడియోలు అంతటా దుమారం రేపుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..