సర్కార్‌ పెన్షన్‌ కోసం వృద్ధురాలి అవస్థలు.. 30 కిలోమీటర్లు మోకాళ్లు, చేతులతో నడుచుకుంటూ.. మరీ ఇంత దారుణమా..?

పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు 30 కిలోమీటర్లు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే, ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఆరా తీస్తే, ఆమె బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు లింక్ అయిందని, ఆమెను జన సేవా కేంద్రం అధికారులు మోసం చేశారని తెలిసింది. ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ, ముఖ్యంగా వృద్ధులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సర్కార్‌ పెన్షన్‌ కోసం వృద్ధురాలి అవస్థలు.. 30 కిలోమీటర్లు మోకాళ్లు, చేతులతో నడుచుకుంటూ.. మరీ ఇంత దారుణమా..?
Woman Crawls For 30km
Follow us
Jyothi Gadda

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 17, 2023 | 3:04 PM

నిజంగా ఇది హృదయ విదారక సంఘటన..దేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది. ఇంటర్‌నెట్‌, ఆన్‌లైన్‌ విధానంతో ప్రజా సేవలు ఎంతో సులువుగా మారిపోయాయి. ఇక బ్యాంకింగ్‌ సేవలు కూడా ప్రజల వాకిట్లోకే వచ్చి చేరుతున్నాయి. డోర్ స్టెప్ బ్యాంకింగ్ విధానం ద్వారా నగదు జమ చేయడం, నగదు ఉపసంహరణ, చెక్కు డిపాజిట్ వంటి సేవలు సైతం ఇంటి వద్దకే వచ్చేశాయి. ఖాతాదారులు ఏజెంట్ల సహాయంతో ఇంటి వద్దే బ్యాంకింగ్ సౌకర్యాలను పొందేలా సరికొత్త కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చింది కేంద్రప్రభుత్వం. డోర్ స్టెప్ బ్యాంకింగ్ పథకం ద్వారా నగదు డిపాజిట్, విత్ డ్రా, ఆర్థికేతర లావాదేవీలతో పాటు ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. అయితే, ఇవన్నీ కేవలం వినటానికి, చర్చించుకోవటానికి మాత్రమే అన్నట్టుగా మారింది కొన్ని చోట్ల పరిస్థితి. ఒడిస్సాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 68 ఏళ్ల దివ్యాంగ మహిళ తన పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు వెళ్లేందుకు పడరాని కష్టాలు పడింది. సుమారు 30 కిలోమీటర్లు ఆమె అరచేతులు, కాళ్లతో నడుచుకుంటూ వెళ్లాల్సి వచ్చింది.

ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో 68 ఏళ్ల దివ్యాంగ మహిళ తన పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు 30 కిలోమీటర్లు మోకాళ్లపై నడుచుకుంటూ వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బాధిత వృద్ధ మహిళ కుష్టు వ్యాధితో బాధపడుతుంది. కాళ్లకు తీవ్రమైన గాయాలతో నడవలేకపోయింది. కానీ, ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ డబ్బులు తీసుకోవాలంటే తప్పక బ్యాంక్‌కు వెళ్లాల్సి రావటంతో.. మట్టి, రాళ్లు తేలిన రోడ్డుపై చేతులు పెట్టుకుని మోకాళ్లపై నడుచుకుంటూ వచ్చింది. ఒడిశాలోని గిరిజనులు అధికంగా ఉండే సుందర్‌గఢ్ జిల్లాలోని కుట్రలో వెలుగు చూసింది ఈ హృదయ విదారక సంఘటన.

సర్కార్‌ పెన్షన్‌ కోసం వృద్ధురాలి అవస్థలు..వీడియో చూడండి

ఇవి కూడా చదవండి

తెలిసిన సమాచారం మేరకు.. మహిళ గ్రామంలోని సాంప్రదాయ వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటుంది. అతనికి చెల్లించడానికి, ఆ మహిళ తన పెన్షన్ డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ‘జన సేవా కేంద్రానికి’ వెళ్లింది. అయితే, ఆమె బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు అనుసంధానం కాలేదని సేవా కేంద్రం అధికారులు ఆమెను వెనక్కి పంపించేశారు. మరో మార్గం లేకపోవడంతో వృద్ధ మహిళ తన ఆధార్ కార్డును తన బ్యాంక్ ఖాతాకు లింక్ చేయడానికి బ్యాంకుకు రావటం కోసం ఇలా అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. బ్యాంకుకు వెళ్లే దారిలో ఒక సామాజిక కార్యకర్త ఆమెను గుర్తించి సహాయం అందించినట్టుగా తెలిసింది.

అయితే, ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. ఆరా తీస్తే, ఆమె బ్యాంకు ఖాతాతో ఆధార్ కార్డు లింక్ అయిందని, ఆమెను జన సేవా కేంద్రం అధికారులు మోసం చేశారని తెలిసింది. సామాజిక కార్యకర్త ఆమెకు తన ఖాతా నుండి రూ. 1000 విత్‌డ్రా చేసి ఇచ్చి, ఆమెను తిరిగి తన గ్రామానికి తీసుకెళ్లేలా చేశాడు. ఇలాంటి సంఘటనలు పదేపదే జరుగుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికీ, ముఖ్యంగా వృద్ధులకు బ్యాంకింగ్ సౌకర్యాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక సోషల్ మీడియాలో వార్త వైరల్ కావటంతో నెటిజన్లు సైతం పెద్ద సంఖ్యలో స్పందించారు. పెన్షన్ పంపిణీ అధికారులు, సిబ్బంది పనితీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..