- Telugu News Photo Gallery What will be the result if a high bp patient drinks tea on empty stomach Telugu News
High Blood Pressure : బీపి ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగితే ఏమవుతుందో తెలుసా..?
హై బీపీ, హృద్రోగ వ్యాధులు మొదలైనవన్నీ మన జీవనశైలికి సంబంధించిన సమస్యలే. మన రోజువారి దినచర్య నుంచి మనం తీసుకునే ఆహారం వరకు అన్నింటిపై శ్రద్ధ పెడితేనే ఈ సమస్యల నుంచి బయటపడగలుగుతాం. అయితే, మనం తీసుకునే ఆహారాలలో టీ కూడా ఒకటి.. భారతీయుల జీవనశైలిలో టీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. టీ తాగకుండా ఎవరూ తమ రోజును ప్రారంభించరు. అయితే అధిక రక్తపోటు ఉన్నవారు ఖాళీ కడుపుతో టీ తాగాలా, వద్దా అన్నది ప్రశ్న.
Updated on: Nov 17, 2023 | 1:45 PM

బీపీ బాధితులు ఎప్పుడూ పాలతో చేసిన టీ తాగడం మంచిది కాదు. మిల్క్ టీ తాగడం వల్ల బీపీ తగ్గడానికి బదులు పెరుగుతుంది. అధిక బీపీ వల్ల గుండెపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది చాలా ప్రమాదకరమైనదిగా కూడా మారుతుంది. ఖాళీ కడుపుతో పాలతో చేసిన టీ తాగడం మానుకోండి. బీపీ ఎక్కువగా ఉన్నవారు ఏ టీ తాగవచ్చో ఇప్పుడు చూద్దాం

శరీరంలో అధిక రక్త పోటును హైపర్ టెన్షన్ లేదంటే హై బ్లడ్ ప్రెషర్(బీపీ) అని అంటారు. హై బీపీ సైడ్ ఎఫెక్ట్స్‌తో గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు మొదలగు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఒకసారి బీపీ ఎటాక్ అయిన వారు తప్పనసరిగా అవసరానికి తగిన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అనవసరంగా లేనిపోని సమస్యల్ని కొని తెచ్చుకున్నట్టే అవుతుంది.

Green Tea-హై బీపీ రోగులకు గ్రీన్ టీ బెస్ట్ టీ. గ్రీన్ టీ ఇరుకైన రక్త నాళాలను తెరవడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కాటెచిన్‌లు రక్త నాళాలు తెరుచుకోవడానికి సహాయం చేస్తాయి. తద్వారా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

అధిక బీపీ ఉన్నవారు బ్లాక్ టీ తాగడం వల్ల రక్తనాళాలకు మేలు జరుగుతుంది. అలాగే, ఇది అనేక గుండె సంబంధిత సమస్యలను నయం చేయడంలో సహాయపడుతుంది. హైబీపీ ఉన్నవారు లెమన్ టీ తాగడం కూడా మంచిది.

కాఫీ, టీలో కెఫిన్ అనే రసాయనం అధిక పరిమాణంలో ఉంటుంది. అయితే టీలను అతిగా తీసుకుంటే శరీరంలో ఈ రసాయానాల ప్రభావంగా తీవ్రంగా పడుతుంది. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతినడం.. వంటి తీవ్ర సమస్యలు అధికంగా వేధించే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఉదయాన్నే ఖాళీ కడుపుతో కాఫీ,టీలు ఎవరూ తాగకపోవటమే మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు.




