- Telugu News Photo Gallery Business photos These are the list of best sold electric scooters in October 2023, check details
Best Selling E-Scooters: హాట్ కేకుల్లా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్లు.. టాప్ లేపిన కంపెనీలు ఇవే..
మన దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ క్రమక్రమంగా పెరుగుతోంది. అందరూ పర్యావరణ హితమైన ఈ వాహనాలకే మొగ్గుచూపుతున్నారు. వీటిల్లో అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక ఫీచర్లు, చాలా తక్కువ మెయింటెనెన్స్ వంటి అంశాలు వీటి వైపు దృష్టి పెట్టేలా చేస్తున్నాయి. ముఖ్యంగా అర్బన్ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇవి బాగా ఉపయోగపడుతున్నాయి. దీంతో నగర ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పైగా గత రెండు నెలలుగా ఫెస్టివ్ సీజన్ నడుస్తుండటంతో అత్యధిక సేల్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రాబట్టాయి. ముఖ్యంగా అక్టోబర్ మాసంలో మొత్తం 71,604 ఎలక్ట్రిక్ స్కూటర్ల విక్రయాలు దేశ వ్యాప్తంగా జరిగాయి. వాటిల్లో అన్ని టాప్ బ్రాండ్లకు చెందిన స్కూటర్లు ఉన్నాయి. ఓలా, ఏథర్, బజాజ్ వంటి కంపెనీలకు చెందిన స్కూటర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023 అక్టోబర్లో అత్యధిక అమ్ముడైన టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్ల జాబితాను మీకు అందిస్తున్నాం. ఓ సారి చూసేయండి..
Madhu | Edited By: Ram Naramaneni
Updated on: Nov 17, 2023 | 9:57 PM

ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాల్లో ఈ కంపెనీ స్కూటర్లు అగ్రగామిగా నిలిచాయి. 2023 అక్టోబర్ లో ఓలా మొత్తం 22,284 యూనిట్లను విక్రయించింది. అదే అంతకుముందు సెప్టెంబర్ లో 18,691 యూనిట్లను విక్రయించింది. నెలవారీగా చూస్తే 19.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

టీవీఎస్.. ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల్లో టీవీఎస్ ఐ క్యూబ్ రెండో స్థానంలో ఉంది. 2023 సెప్టెంబర్లో 15,584 యూనిట్లు, అక్టోబర్లో 15,603 యూనిట్లన విక్రయించి 0.1శాతం స్వల్ప నెలవారీ వృద్ధిని నమోదు చేసింది.

బజాజ్.. ఈ కంపెనీ స్కూటర్లు విక్రయాల్లో మూడో స్థానంలో నిలిచాయి. ఈ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న ఏకైక ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్ చేతక్. అక్టోబర్లో చేతక్ 8,430 యూనిట్లను విక్రయించింది. కాగా సెప్టెంబర్ లో 7,097 యూనిట్లను విక్రయించగా.. నెలవారీ వృద్ధి రేటు 18.7 శాతం సాధించింది.

ఏథర్.. దేశంలో అత్యంత విజయవంతమైన ఈవీ స్టార్టప్ లలో ఒకటి ఏథర్. ఇది గత నెలలో 8,027 యూనిట్లను విక్రయించి టాప్ 5 బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల జాబితాలో నాల్గో స్థానంలో నిలిచింది. బెంగళూరు ఆధారిత స్టార్టప్ సెప్టెంబర్ లో 7,151 యూనిట్లను విక్రయించగా.. అక్టోబర్ చివరికి 12.2 శాతం వృద్ధిని నమోదు చేసింది.

గ్రీవ్స్.. అక్టోబరులో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ స్కూటర్‌ల టాప్ 5 జాబితా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ తో పూర్తవుతుంది. గత నెలలో ఈ కంపెనీ 4,019 యూనిట్లను విక్రయించింది. అదే సెప్టెంబర్‌లో 3,612 యూనిట్లను విక్రయించగా.. దీంతో 11.2 శాతం వృద్ధి రేటు నమోదైంది.





























