AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మగ మహారాజులకు అలర్ట్.. 21 రోజులు ఎర్ర అరటిపండు తిన్నారంటే ఇకపై ఆ సమస్యే ఉండదు గురూ..!

Health Benefits of Red Banana: అరటిపండ్లలో అనేక పోషకాలు దాగున్నాయి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటిపండులో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కావున ఈరోజు మనం రెడ్ అరటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ఎరుపు రంగు అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

మగ మహారాజులకు అలర్ట్.. 21 రోజులు ఎర్ర అరటిపండు తిన్నారంటే ఇకపై ఆ సమస్యే ఉండదు గురూ..!
Red Banana
Shaik Madar Saheb
|

Updated on: Nov 17, 2023 | 4:41 PM

Share

Health Benefits of Red Banana: అరటిపండ్లలో అనేక పోషకాలు దాగున్నాయి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అరటిపండులో అనేక రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. కావున ఈరోజు మనం రెడ్ అరటిపండు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ ఎరుపు రంగు అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎక్కడైనా సులభంగా అందుబాటులో ఉంటుంది. ధర కూడా తక్కువే.. ఎర్రటి అరటిపండును నిరంతరం 21 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కావున ఎర్రటి అరటిపండు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. చర్మ సమస్యలను నయం చేయవచ్చు: ఈ రెడ్ కలర్ అరటిపండ్లు తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు. కాబట్టి మీరు ఏదైనా చర్మ సమస్యతో బాధపడుతుంటే ఎర్రటి అరటిపండు తినండి.
  2. కంటి చూపును మెరుగుపరుస్తుంది: ఈ రోజుల్లో పెద్దవారి కంటే యువతే ఎక్కువగా కంటి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి కంటి ఆరోగ్యం దృష్ట్యా ఎర్ర అరటిపండు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతే కాకుండా అరటిపండ్లు తినడం వల్ల శుక్లాల సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.
  3. సంతానోత్పత్తి సమస్యకు చికిత్స: చాలా మంది సంతానోత్పత్తి (పిల్లలు లేకపోవడం) సమస్యతో బాధపడుతున్నారు. అలాంటివారు ఈ అరటిపండును నిత్యం తింటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి సంతానోత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా, అంగస్తంభన సమస్య కూడా దూరమై.. లైంగిక శక్తి పెరుగుతుంది.
  4. నరాల రుగ్మతలు తగ్గుతాయి: ఎర్రటి అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధితో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి.
  5. కిడ్నీ స్టోన్ సమస్యకు చికిత్స: ఎర్ర అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..