Heart Care Tips: ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి.. గుండెను కాపాడుకోండి!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒత్తిడికి గురి కావడానికి ఒక్క కారణం అంటూ ఏదీ లేదు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, పిల్లలు, బంధువులు, అనారోగ్య సమస్యలు ఇలా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. మరి కొంత మంది గుండె జబ్బులు, స్ట్రోక్ కి గురవవ్వడం, డయాబెటీస్, రక్త పోటు వంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. దానికి తోడు తీసుకునే ఆహారంలో..

Heart Care Tips: ఒత్తిడిని ఇలా తగ్గించుకోండి.. గుండెను కాపాడుకోండి!
Heart Attack
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2023 | 11:45 AM

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి అనేది సర్వ సాధారణం అయిపోయింది. ఒత్తిడికి గురి కావడానికి ఒక్క కారణం అంటూ ఏదీ లేదు. వ్యక్తిగత సమస్యలు, ఆర్థిక సమస్యలు, పని ఒత్తిడి, పిల్లలు, బంధువులు, అనారోగ్య సమస్యలు ఇలా అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. ఈ ఒత్తిడిని తట్టుకోలేక చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్లి పోతున్నారు. మరి కొంత మంది గుండె జబ్బులు, స్ట్రోక్ కి గురవవ్వడం, డయాబెటీస్, రక్త పోటు వంటి సమస్యల్ని కొని తెచ్చుకుంటున్నారు. దానికి తోడు తీసుకునే ఆహారంలో కూడా నాణ్యత ఉండటం లేదు. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా గుండె జబ్బులు అనేవి వెంటాడుతున్నాయి. ఇలా ఒత్తిడిని తగ్గించుకుని.. గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో తీసుకోవాల్సిన చర్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెల్ఫ్ కేర్:

మానసికంగా, శారీ రకంగా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం మొదట చూసుకోవాలి. యోగా, ధ్యానం లేదా వాకింగ్, జాగింగ్, ఎక్సర్ సైజులు, తీసుకునే ఆహారం.. ఇలా మిమ్మల్ని మీరు రక్షించుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది

ఇవి కూడా చదవండి

ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండాలి:

వీలైనంత వరకూ ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండేలా చూసుకోండి. చురుకుగా అన్ని పనుల్లో పాల్గొనేలా మీ మైండ్ ని రీఫ్రెష్ చేస్తూ ఉండండి. దీని వల్ల ఒత్తిడి అనేది కాస్త తగ్గుతుంది. అలాగే మీకు నచ్చిన ఆటలు ఆడటం వల్ల కూడా ఒత్తిడిని అనేది తగ్గించు కోవచ్చు. శారీరక శ్రమ ఉంటేనే ఉండె అన్నది ఆరోగ్యంగా ఉంటుంది. ఏరోబిక్, సైక్లింగ్, గేమ్స్, ఎక్సర్ సైజులు, ఇంటి పని ఇలా మొదలైన వాటిల్లో చురుకుగా ఉండేలా చూసుకోండి.

సమతుల్య ఆహారం:

మనం ఏం తింటున్నామో.. అదే మన బాడీ చూపిస్తుంది. కాబట్టి ఎప్పుడూ నాలుక కోసమే కాకుండా.. శరీరం కోసమ తినండి. అలాగే గుండె ఆరోగ్యకరమైన ఆహారాలను కూడా తీసుకుంటూ ఉండాలి. ఫ్రెష్ పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించండి.

మీకు ఇష్టమైన వారితో మాట్లాడండి:

మీ ఒత్తిడిని జయించాలంటే.. ముందు మీరు ఇతరుల వల్ల ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ గురించి వారితో మాట్లాడండి. దీని వల్ల మీకు సగం ఒత్తిడి తగ్గుతుంది. అలాగే మీకు ఇష్టమైన స్నేహితులు, బంధువులతో కనెక్ట్ అవ్వడం వల్ల కూడా ఒత్తిడిని తగ్గించు కోవచ్చు.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
పెంట్‌ హౌస్‌ ధర రూ 1,133 కోట్లు! ఎక్కువ ధర పలికిన పెంట్‌ హౌస్‌.
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
ఆకాశంలో దెయ్యం.! ఓ భారీ గెలాక్సీకి దెయ్యం ముఖం వంటి ఆకృతి..
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
రేవంత్ అన్నా అంటూ కష్టం చెప్పుకున్న మహిళ.. సీఎం ఏం చేశారంటే
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
సినీ ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి.. మంత్రి కోమటిరెడ్డి
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు.! తీర్పు చదువుతున్న ధర్మాసనం.
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
ఘరానా మోసం..నకిలీ టోల్‌ప్లాజాతో కోట్లు కొట్టేశారు.! వీడియో..
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వరద నీటిలో రజనీకాంత్‌ ఇల్లు.! ఇంటిచుట్టూ నిలిచిపోయిన వరదనీరు.
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
వర్షం ప‌డ‌ని వింత గ్రామం.. ఈ ఊర్లో మేఘాలను చేత్తో తాకవచ్చు.!
-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.!
-50 డిగ్రీల ఉష్ణోగ్రతలో చలి ఎలా ఉంటుందో తెలుసా.!
ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.! వైరల్‌ అవుతున్న ఏనుగు వీడియో.
ఏనుగుతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది.! వైరల్‌ అవుతున్న ఏనుగు వీడియో.