Mouth Ulcers: చలి కాలంలో నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో తొందరగా తగ్గుతుంది!

సాధారణంగా నోటి పూత సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చలి కాలంలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చలి కాలంలో నీటిలో, గాలిలో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నోటి పూత వస్తూ ఉంటుంది. ఈ సమస్య పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ వస్తుంది. ఈ నోటి పూత వస్తే బ్రష్ చేసుకోవడానికి, తినడానికి, నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తిడి, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, జీర్ణ సమస్యలు వంటివి ఏమైనా ఉంటే నోటి పూత అనేది వస్తుంది. వీటి పరిష్కారినికి ఇంటి చిట్కాలు బాగా..

Mouth Ulcers: చలి కాలంలో నోటి పూతతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిట్కాలతో తొందరగా తగ్గుతుంది!
Mouth Ulcer
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2023 | 8:30 PM

సాధారణంగా నోటి పూత సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే చలి కాలంలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే చలి కాలంలో నీటిలో, గాలిలో బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా నోటి పూత వస్తూ ఉంటుంది. ఈ సమస్య పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ వస్తుంది. ఈ నోటి పూత వస్తే బ్రష్ చేసుకోవడానికి, తినడానికి, నీళ్లు తాగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఒత్తిడి, హార్మోన్ల ఇన్ బ్యాలెన్స్, జీర్ణ సమస్యలు వంటివి ఏమైనా ఉంటే నోటి పూత అనేది వస్తుంది. వీటి పరిష్కారినికి ఇంటి చిట్కాలు బాగా పని చేస్తాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

నెయ్యి:

నోటి పూత వచ్చినప్పుడు రాత్రి పూట పడుకునే ముందు వాటిపై నెయ్యి రాసుకోవచ్చు. ఉదయం లేవగానే కడిగేసుకోవచ్చు. అలాగే నీటిని, యాపిల్ సైడర్ వెనిగర్ ని కూడా మిక్స్ చేసి రోజుకు రెండు సార్లు నోటిని కడిగితే వీటి సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

లవంగాల నూనె:

లవంగాల నూనెతో కూడా నోటి పూతను తగ్గించు కోవచ్చు. లవంగాల నూనెను నోటి పూతపై రాసి 10 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఉపశమనం ఉంటుంది.

పెరుగు:

నోటి పూతగా ఉన్నప్పుడు పెరుగును తినాలి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి.. నోటి పూతను తగ్గించేందుకు హెల్ప్ చేస్తుంది. అంతే కాకుండా చల్లదనాన్ని, కడుపు వేడిని కూడా తగ్గిస్తుంది. నోటి పూత త్వరగా తగ్గుతుంది.

ట్రీట్రీ ఆయిల్:

ట్రీట్రీ ఆయిల్ తో కూడా మౌత్ అల్సర్ ను తగ్గించు కోవచ్చు. ట్రీట్రీ ఆయిల్ లో కాటన్ బాల్స్ చుట్టి బొబ్బలు ఉన్న చోట పెడితే ఫలితం ఉంటుంది.

తేనె:

తేనె కూడా నోటి పూతను తగ్గించు కోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇందులో కూడా యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇవి పూతపై రాసే మంట తగ్గి చల్లగా కూడా ఉంటుంది. అలాగే ఉప్పు వేసిన గోరు వెచ్చటి నీటిని పుక్కిలించినా కూడా నోటి పూత నుంచి ఉపశమనం లభిస్తుంది.

పసుపు:

పసుపులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ వంటి గుణాలు మెండుగా ఉంటాయి. కాబట్టి నోటి పూతపై పసుపు పెట్టినా లేదా గోరు వెచ్చని నీటిలో పసుపు వేసి పుక్కిలించినా మంచి ఫలితం ుంటుంది.

తులసి ఆకులు:

తులసి ఆకులు కూడా నోటి పూతను తగ్గిస్తాయి. రోజుకు రెండు సార్లు తులసి ఆకులను నమలడం వల్ల నోటి పూతనే కాకుండా.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నోటి దుర్వాసన కూడా రాదు. నోట్లో క్రిములు, బ్యాక్టీరియా వంటివి ఉన్నా నశిస్తాయి.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
బుడమేరు వరదలో కొట్టుకుపోయిన థార్ కార్.. ప్రమాదంలో సాఫ్ట్ వేర్.
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
మగధీర స్టోరీ తో NRI మహిళపై అత్యాచారం.! షాకింగ్ విషయాలు వెలుగులోకి
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
పొంచి ఉన్న మరో ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
66 కిలోల బంగారు గణపతి.. ఏకంగా రూ.400 కోట్ల బీమా.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
మురళి శర్మ కాదు.. ఆయన భార్య వేరే లెవల్‌.. తెలిస్తే సలాం కొడతారు.!
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
డైరెక్టర్‌కు కోపం వస్తే రిజెల్ట్‌ ఇట్లనే ఉంటది.! గోట్‌ టాక్‌..
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
చిరంజీవి ఒక్క మాటతో.. ఫిష్ వెంకట్‌కు బెస్ట్ ట్రీట్మెంట్‌.!
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
బన్నీ రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన సల్మాన్
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
RGV నన్ను ఇంటికి రమ్మన్నాడు.. ఇంటికి వెళ్ళాక అలా జరిగింది.!
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ
సినిమాలో గోండు పిల్లేమో కానీ.. బయట మాత్రం వయ్యారి ముద్దుగుమ్మ