Cleaning Tips: కిచెన్, ఇంట్లోని వస్తువుల్ని ఇలా క్లీన్ చేస్తే.. అద్దాల్లా మెరిసిపోతాయి అంతే!

కొంత మంది ఇంటిని తరచూ క్లీన్ చేస్తూ ఉంటారు. మరికొందరు అప్పుడప్పుడూ శుభ్ర పరుస్తారు. ఇంటిని క్లీన్ చేయడంలో కూడా ఒక కళ ఉంటుంది. ఏదో చేశాము అంటే చేశాము అనే దాని కంటే.. ఈ సారి ఇలా చేయండి. మీ ఇల్లు మొత్తం మెరిసి పోతూ ఉంటుంది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. ఆ ఇల్లు ఎప్పుడూ గందర గోళంగానే ఉంటుంది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అలాంటి వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగ పడతాయి. ఇందుకోసం బయట నుంచి ఏమీ కొనాల్సిన పని లేదు. ఇంట్లోని వస్తువులు..

Cleaning Tips: కిచెన్, ఇంట్లోని వస్తువుల్ని ఇలా క్లీన్ చేస్తే.. అద్దాల్లా మెరిసిపోతాయి అంతే!
Cleaning Tips
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2023 | 8:15 PM

కొంత మంది ఇంటిని తరచూ క్లీన్ చేస్తూ ఉంటారు. మరికొందరు అప్పుడప్పుడూ శుభ్ర పరుస్తారు. ఇంటిని క్లీన్ చేయడంలో కూడా ఒక కళ ఉంటుంది. ఏదో చేశాము అంటే చేశాము అనే దాని కంటే.. ఈ సారి ఇలా చేయండి. మీ ఇల్లు మొత్తం మెరిసి పోతూ ఉంటుంది. అందులోనూ ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారంటే.. ఆ ఇల్లు ఎప్పుడూ గందర గోళంగానే ఉంటుంది. పెట్టిన వస్తువు పెట్టిన చోట ఉండదు. అలాంటి వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగ పడతాయి. ఇందుకోసం బయట నుంచి ఏమీ కొనాల్సిన పని లేదు. ఇంట్లోని వస్తువులు చాలు. మరి అవేంటో తెలుసుకుందాం.

సింక్ క్లీనింగ్:

ప్రతి ఇంట్లో కిచెన్ చాలా ముఖ్యం. అందులో మనం రోజూ వాడే సింక్ కూడా ఒకటి. ఈ సింక్ బాగా మెరిసి, దానిలో ఉండే బ్యాక్టీరియా పోవాలంటే.. అందులో కొద్దిగా బేకింగ్ సోడా వేసి ఓ పది నిమిషాల తర్వాత క్లీన్ చేయండి. అంతే వాసన రాకుండా కొత్తదానిలా మెరిసి పోతుంది సింక్.

ఇవి కూడా చదవండి

అద్దాలు క్లీనింగ్:

ఇంట్లో అద్దాలు బాగా మసక బారి పోయినట్లు ఉంటే.. ఈసారి అద్దాలను టీ డికాషన్ చల్లి.. ఓ వన్ మినిట్ ఉంచి క్లీన్ చేయండి. అద్దాలు చక్కగా మెరుస్తాయి. అలాగే గ్రీజు మరకలు పోవాలంటే.. బేకింగ్ సోడా, మినరల్ ఆయిల్ ని కలిపి మరకలపై చల్లండి. ఆ తర్వాత క్లాత్ పెట్టి తుడిచేస్తే మరకలు పోతాయి.

ఓవెన్ క్లీనింగ్:

నిమ్మ కాయతో మైక్రోవేవ్ ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఓ చిన్న గిన్నెలో నిమ్మ కాయ రసం పిండి.. దీన్ని ఓ ఐదు నిమిషాలు మైక్రో వేవ్ లో అలానే ఉంచేయండి. దీంతో ఓవెన్ మొత్తం శుభ్ర పడుతుంది. బ్యాక్టీరియా ఏమైనా ఉన్నా పోతుంది.

ఇంటి ఫ్లోర్ క్లీనింగ్:

చిన్న పిల్లలు ఉన్న ఇల్లు ఫ్లోర్ ఎప్పుడూ క్లీనింగ్ గా ఉండదు. కింద పడిన వస్తువులు కూడా వాళ్లు తెలియకుండా నోట్లో పెట్టుకుంటారు. బ్యాక్టీరియా, క్రిములు చేరకుండా ఫ్లోర్ శుభ్రంగా ఉండాలంటే.. గోరు వెచ్చటి నీళ్లు తీసుకోవాలి. ఇందులో వైట్ వెనిగర్ కలపాలి. ఈ నీటితో ఫ్లోర్ మొత్తం క్లీన్ చేస్తే.. బ్యాక్టీరియా, మరకలు మాయం అవుతాయి. వెనిగర్ స్మెల్ నచ్చని వాళ్లు నిమ్మ కాయ రసాన్ని పిండండి. ఇలా అయితే మంచి సువాసన కూడా వస్తుంది.

మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
మీరూ చలికాలంలో చన్నీళ్లతో స్నానం చేస్తున్నారా? బీ కేర్ ఫుల్..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
కలలో పూర్వీకులు కనిపిస్తే శుభమా? అశుభమా..
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇటిఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం లాభదాయకమా?
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
ఎప్పుడూ ఒకేలానా.. కాస్త కొత్తగా ట్రై చేద్దామంటున్న స్టార్ హీరోస్!
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
మేకప్‌ లుక్‌ సహజంగా.. పర్ఫెక్ట్‌గా రావాలంటే టిప్స్‌ ఇవిగో..
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..
జామ చిగురు తింటే ఎలాంటి వ్యాధులు రానే రావు..