Amla Reduce Thyroid: థైరాయిడ్ కి ఈ నేచురల్ టిప్స్ తో బైబై చెప్పేయండిలా!

ప్రస్తుతం ఇప్పుడు ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య ఉందని చెబుతూనే ఉన్నారు. అంతాలా కాలం మారిపోయింది. ఒక మనిషి ఏదో ఒక రోగం బారిన పడుతూనే ఉంటున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే.. సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అందరూ బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. చాలా చిన్న వయసులోనే చాలా మందికి థైరాయిడ్ అనేది వచ్చేస్తుంది. థైరాయిడ్ అనేది ముఖ్యంగా జీవ క్రియపై ప్రభావాన్ని..

Amla Reduce Thyroid: థైరాయిడ్ కి ఈ నేచురల్ టిప్స్ తో బైబై చెప్పేయండిలా!
Thyroid
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2023 | 8:04 PM

ప్రస్తుతం ఇప్పుడు ఎవరిని కదిపినా ఏదో ఒక సమస్య ఉందని చెబుతూనే ఉన్నారు. అంతాలా కాలం మారిపోయింది. ఒక మనిషి ఏదో ఒక రోగం బారిన పడుతూనే ఉంటున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారమే.. సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి ఆహార విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు అందరూ బాధ పడే సమస్యల్లో థైరాయిడ్ కూడా ఒకటి. చాలా చిన్న వయసులోనే చాలా మందికి థైరాయిడ్ అనేది వచ్చేస్తుంది. థైరాయిడ్ అనేది ముఖ్యంగా జీవ క్రియపై ప్రభావాన్ని చూపిస్తుంది. తద్వారా ఆ తర్వాత సమస్యలు అనేవి మొదలవుతాయి. అయితే తీసుకునే ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. థైరాయిడ్ ను అదుపులోకి తీసుకు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఉసిరి కాయ:

ఉసిరి కాయలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనం తెలుసుకున్నాం. ముఖ్యంగా ఉసిరి కాయలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఉసిరి కాయ రసం తాగినా, ఉసిరిని ఆహారంలో చేర్చుకున్నా చాలా మంచింది. ఇది కేవలం థైరాయిడ్ సమస్యనే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరి చేరకుండా చేస్తుంది. నారింజ కంటే ఉసిరిలో విటమిన్ సి అనేది 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా శరీరాన్ని బలంగా మార్చుతుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి:

కొబ్బరి లేదా కొబ్బరితో తయారు చేసిన ఆహార పదార్థాలు, కొబ్బరి నూనె థైరాయిడ్ తో బాధ పడే వారికి మంచి ఆహారంగా చెప్పు కోవచ్చు. కొబ్బరిని తీసుకోవడం వల్ల థైరాయిడ్ లెవల్స్ అనేవి కంట్రోల్ లో ఉంటాయి. అంతే కాకుండా ఇది జీవ క్రియకు బాగా హెల్ప్ చేస్తుంది. ప్రతి రోజూ ఒక స్పూన్ కొబ్బరి తీసుకుంటే థైరాయిడ్ ను తగ్గించు కోవచ్చు. అంతే కాకుండా చర్మం, శరీరం కూడా హెల్దీగా ఉంటాయి.

గుమ్మడి గింజలు:

గుమ్మడి కాయ గింజలను కూడా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లో ఒక భాగం చేశారు. గుమ్మడి కాయ గింజల్లో శరీరానికి కావాల్సిన పోషకాలు అన్నీ లభ్యమవుతాయి. ఈ గుమ్మడి గింజల్లో జింక్ అనేది మెండుగా ఉంటుంది. విటమిన్ లను, ఖనిజాలను వంటి పోషకాలను గ్రహించడానికి ఈ జింక్ అనేది బాగా సహాయ పడుతుంది. అంతే కాకుండా గుమ్మడి కాయ గింజల్ని ఆహారంలో ఒక భాగం చేసుకోవడం వల్ల థైరాయిడ్ లెవల్స్ అనేది అదుపులో ఉంచేలా చేస్తుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.