శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే అన్ని వ్యాధులు చుట్టుముడుతాయి. అయితే, కొలెస్ట్రాల్ స్థాయి పెరగడానికి కారణం చెడు జీవనశైలి, ఆహారం అని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్‌లో రెండు రకాలున్నాయి - చెడు కొలెస్ట్రాల్ (LDL), మంచి కొలెస్ట్రాల్ (HDL).. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి. అందువల్ల, మీ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం..