- Telugu News Photo Gallery Low Calorie Diet Side Effects: Follow These Tips And Take These Precautions While On Diet
Low Calorie Diet Side Effects: బరువు తగ్గేందుకు తక్కువ కేలరీలుండే ఆహారం తీసుకుంటున్నారా? జాగ్రత్త..
క్రమం తప్పిన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. బరువు అదుపు చేయడానికి చాలా మంది జిమ్‌లలో చేరి కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితాలను పొందలేక నిరుత్సాహ పడుతుంటారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా డైటింగ్ ట్రెండ్స్‌ని అనుసరిస్తున్నారు. బరువు తగ్గడానికి ప్రజలు తక్కువ కేలరీల ఆహారాలను సైతం అనుసరిస్తున్నారు. మీరు తక్కువ కేలరీల ఆహారం తీసుకునేటప్పుడు హైడ్రేటెడ్‌గా..
Updated on: Nov 20, 2023 | 12:27 PM

క్రమం తప్పిన ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా చాలా మంది అధికంగా బరువు పెరుగుతున్నారు. బరువు అదుపు చేయడానికి చాలా మంది జిమ్‌లలో చేరి కఠోర వ్యాయామాలు చేస్తుంటారు. కానీ ఆశించిన ఫలితాలను పొందలేక నిరుత్సాహ పడుతుంటారు. ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా డైటింగ్ ట్రెండ్స్‌ని అనుసరిస్తున్నారు. బరువు తగ్గడానికి ప్రజలు తక్కువ కేలరీల ఆహారాలను సైతం అనుసరిస్తున్నారు.

మీరు తక్కువ కేలరీల ఆహారం తీసుకునేటప్పుడు హైడ్రేటెడ్‌గా ఉండాలి. కాబట్టి తగినంత నీరు త్రాగడం ముఖ్యం. కాబట్టి వీలైనంత వరకు హైడ్రేటెడ్‌గా ఉండటం అలవాటు చేసుకోవాలి. శరీరంలో డీహైడ్రేషన్ తలెత్తితే కళ్లు తిరగడంతోపాటు అనేక సమస్యలు తలెత్తుతాయి.


తక్కువ కేలరీలున్న ఆహారం అందరికీ సరిపోదు. తక్కువ కేలరీల ఆహారం తినడం ప్రారంభించే ముందు నిపుణులను సంప్రదించాలి. కేలరీల సంఖ్య తక్కువగా ఉంటే, అది శరీరంపై ప్రభావం చూపుతుంది.

బరువు తగ్గడానికి తీసుకునే ఆహారంలో క్యాలరీలు ఎక్కువగా ఉండాలి లేకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కేలరీలు తగ్గితే శరీరానికి తగినంత శక్తి రాదు. మీరు బరువు పెరిగినా లేదా తగ్గినా, శరీరానికి కేలరీలు మంచి సరఫరా కావాలి. కేలరీలు కోల్పోవడం వల్ల కళ్లు తిరుగుతాయి.




