- Telugu News Photo Gallery Bad habits for skin which leads to star wrinkles at very young age Telugu New
Skin Care Tips: మీకున్న ఈ అలవాట్లే మీ చర్మానికి శత్రువు.. వాటికి దూరంగా ఉండండి..
వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు పడటం సర్వసాధారణం. కానీ చాలా చిన్న వయసులోనే ముఖంపై ముడతలు పడటం వల్ల వాళ్లు పెద్దవాళ్లల కనిపిస్తారు. దానికి కారణం మీకున్న చెడు అలవాట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీలో ఉండే చెడు అలవాట్లు మీ చర్మానికి చాలా హాని చేస్తాయి. వాటికి దూరంగా ఉండండి..
Updated on: Nov 20, 2023 | 3:48 PM

ఎక్కువ సూర్యరశ్మి వల్ల ముఖంపై ముడతలు వస్తాయి. అందువల్ల, చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. మీరు బయటికి వెళ్ళినప్పుడల్లా సన్‌స్క్రీన్ అప్లై చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే సూర్యరశ్మికి ఎక్కువగా గురికావడం వల్ల చర్మానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది.

మీరు చేసే ధూమపానం, మద్యపానం మీ శరీరం, ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుంది. ఈ అలవాట్లు మీ రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. ఇది చర్మం వృద్ధాప్య ప్రక్రియను మరింత వేగవంతం చేస్తుంది.

కోపం, ఉద్రేకం, అధిక ఒత్తిడి వల్ల కూడా చర్మం దెబ్బతింటుంది. ఇవన్నీ మీ ఆరోగ్యానికి కూడా చాలా ప్రమాదకరం. ఒత్తిడి వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది.

అందం కోసం ఉపయోగించే రసాయన ఆధారిత సౌందర్య సాధనాలు కూడా మీ చర్మానికి హాని కలిగిస్తాయి.. అలాంటప్పుడు కెమికల్ ఆధారిత సౌందర్య సాధనాలు అతిగా వాడితే చర్మం పొడిబారడంతోపాటు డెడ్ గా మారుతుంది.

మీ చర్మం ఎప్పుడు పొడిబారిపోయి ఉన్నట్టయితే, దాని ప్రభావంతో మీ చర్మం త్వరగా ముడతలు పడటం ప్రారంభమవుతుంది. కాబట్టి, మీ చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోండి. దానికోసం మంచి మాయిశ్చరైజర్లను ఉపయోగించటం ఉత్తమం.





























