- Telugu News Photo Gallery Weight Loss To Metabolism Boost, Surprising Benefits Of Coriander Seeds Telugu News
Coriander Water benefits: ప్రతిరోజు కొత్తిమీర నీటిని తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు…ముఖ్యంగా ఆ సమస్యలకు..
కొత్తిమీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర, కొత్తిమీర గింజలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే పరగడుపున తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొత్తిమీరలో విటమిన్-ఎ, విటమిన్-కె, విటమిన్-సి, విటమిన్-ఇ పుష్కలంగా ఉన్నాయి. కొత్తిమీరలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే, కొత్తిమీర నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.
Updated on: Nov 20, 2023 | 4:18 PM

చర్మ సమస్యలు: కొత్తిమీర నీరు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి కొత్తిమీర నీటిని తాగడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. అలాగే చర్మాన్ని ఆరోగ్యంగా, కాంతివంతంగా మార్చుతుంది.

థైరాయిడ్ ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చు. థైరాయిడ్ ఉన్నవారు ధనియాలను ఎక్కువగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. ఇందులో ఉండే విటమిన్లు థైరాయిడ్ పనితీరును పెంచడానికి, వాపును తగ్గించడానికి , T4ని T3గా మార్చే కాలేయ సామర్థ్యాన్ని పెంచడానికి బాగా పని చేస్తుంది. ధనియా నీళ్లు తాగడం బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

బరువు తగ్గడం: బరువు తగ్గడానికి కొత్తిమీర నీరు చాలా ఉపయోగపడుతుంది. ఈ నీటిలో జీవక్రియను వేగవంతం చేసే అనేక అంశాలు ఉన్నాయి. ఫలితంగా, ఇది శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

పొట్ట ఆరోగ్యం: కొత్తిమీర నీరు పొట్టకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే కొత్తిమీరలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది. ఇది మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది.

ఇతర ఆరోగ్య ప్రయోజనాలు: ఉదయాన్నే పరగడుపున కొత్తిమీర నీరు తాగడం వల్ల కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ప్రయత్నించే వారికి, ఋతు తిమ్మిరితో బాధపడేవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే, కొత్తిమీర నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది.





























