AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kobbari Payasam: కొబ్బరి పాయసం ఇలా చేసుకుంటే.. రుచితో పాటు హెల్త్ కూడా సొంతం!

పచ్చి కొబ్బరితో చేసే కొబ్బరి పాయసం ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా దీన్ని దేవుడికి ప్రసాదం పెట్టడానికి తయారు చేస్తారు. లేదా ఏదైనా స్పెషల్ డేస్ లో చేస్తారు. కొబ్బరి పాయసం తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. ఎప్పుడూ ఒకే రకం పాయసం కాకుండా దీన్ని కూడా అప్పుడప్పుడూ తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా దీన్ని తయారు చేసి అప్పటికప్పుడు పెట్టొచ్చు. ఒక్కసారి కొబ్బరి పాయం తిన్న వాళ్లు మళ్లీ మళ్లీ అదే..

Kobbari Payasam: కొబ్బరి పాయసం ఇలా చేసుకుంటే.. రుచితో పాటు హెల్త్ కూడా సొంతం!
Kobbari Payasam
Chinni Enni
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 20, 2023 | 8:45 PM

Share

పచ్చి కొబ్బరితో చేసే కొబ్బరి పాయసం ఎంతో రుచిగా ఉంటుంది. సాధారణంగా దీన్ని దేవుడికి ప్రసాదం పెట్టడానికి తయారు చేస్తారు. లేదా ఏదైనా స్పెషల్ డేస్ లో చేస్తారు. కొబ్బరి పాయసం తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యంగా కూడా ఉండవచ్చు. ఎప్పుడూ ఒకే రకం పాయసం కాకుండా దీన్ని కూడా అప్పుడప్పుడూ తయారు చేసుకుంటూ ఉండొచ్చు. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా దీన్ని తయారు చేసి అప్పటికప్పుడు పెట్టొచ్చు. ఒక్కసారి కొబ్బరి పాయం తిన్న వాళ్లు మళ్లీ మళ్లీ అదే చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది కొబ్బరి పాయసం. ఇది చేసుకోవడం చాలా సింపుల్. అందులోనూ చలి కాలంలో తినడం వల్ల ఇమ్యునిటీ లెవల్స్ పెరుగుతాయి. మరి ఈ కొబ్బరి పాయసాన్ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు:

అరగంట పాటు నానబెట్టిన బాస్మతీ రైస్ లేదా సోనామసూరీ బియ్యం, పచ్చి కొబ్బరి, చిక్కటి పాలు, పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు, సన్నగా తరిగిన డ్రై ఫ్రైట్స్.

ఇవి కూడా చదవండి

కొబ్బరి పాయసం తయారీ విధానం:

ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక టేబుల్ స్పూన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరి ముక్కలను శుభ్రంగా కడిగేసు కోవాలి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ నెక్ట్స్ వీటిని కూడా మీక్సీ జార్ లో వేసి.. మెత్తగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు లోతైన గిన్నె తీసుకుని.. రెండున్నర కప్పుల పాలు పోసి వేడి చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలను కలుపుతూ ఉండాలి. పాలు చిక్కగా దగ్గర పడుతున్నాయి అనుకున్నాక.. మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. దీనిని దగ్గర పడే వరకూ కలుపుతూ ఉండాలి.

కొబ్బరి పాలల్లో బాగా ఉడికిన తర్వాత పావు కప్పు పంచదార వేసి బాగా కలుపు కోవాలి. పంచదార కరిగిన తర్వాత కుంకుమ పువ్వు, యాలకుల పొడి కొద్ది కొద్దిగా వేసుకుని బాగా కలుపు కోవాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని చల్లుకుని.. సర్వింగ్ బౌల్ లో సర్వ్ చేసు కోవాలి. అంతే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కొబ్బరి పాయం సిద్ధమవుతుంది. ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి రెడీ ట్రై చేయండి.

నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
నారింజ తొక్కల వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..