Kitchen Hacks: కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా.. ఎన్ని రోగాలు వస్తాయంటే!

సాధారణంగా ఫ్రిజ్ ని ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు. ఫ్రిజ్ లో కొన్ని రకా ఆహార పదార్థాలను మాత్రమే ఉంచాలి. కానీ ఫ్రిజ్ వచ్చాక రెండు రోజులకు సరిపడగా ఒకేసారి వండుకుని ఫ్రిజ్ లలో స్టోర్ చేసుకుని తింటున్నారు. ఫ్రిజ్ లో మిగిలిన ఆహార పదర్థాల నుంచి.. అప్పుడే తెచ్చిన ఫ్రెష్ కూరగాయాలు ఇలా అన్నీ పెట్టేస్తున్నారు. అయితే ఫ్రిజ్ లో ఫ్రెష్ కూరగాయలతో పాటు కొన్ని రకాల ఆహారాలను పెట్ట కూడదట. ఇలా చేస్తే అవి కాస్తా విషంగా మారతాయని ఆరోగ్య నిపుణులు..

Kitchen Hacks: కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో స్టోర్ చేస్తున్నారా.. ఎన్ని రోగాలు వస్తాయంటే!
Cut Onions
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 20, 2023 | 9:00 PM

సాధారణంగా ఫ్రిజ్ ని ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి ఉపయోగిస్తారు. ఫ్రిజ్ లో కొన్ని రకా ఆహార పదార్థాలను మాత్రమే ఉంచాలి. కానీ ఫ్రిజ్ వచ్చాక రెండు రోజులకు సరిపడగా ఒకేసారి వండుకుని ఫ్రిజ్ లలో స్టోర్ చేసుకుని తింటున్నారు. ఫ్రిజ్ లో మిగిలిన ఆహార పదర్థాల నుంచి.. అప్పుడే తెచ్చిన ఫ్రెష్ కూరగాయాలు ఇలా అన్నీ పెట్టేస్తున్నారు. అయితే ఫ్రిజ్ లో ఫ్రెష్ కూరగాయలతో పాటు కొన్ని రకాల ఆహారాలను పెట్ట కూడదట. ఇలా చేస్తే అవి కాస్తా విషంగా మారతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది పని త్వరగా అయిపోతుందని.. ఉల్లి పాయలను ఎక్కువగా కట్ చేసి ఫ్రిజ్ లో పెడుతూ ఉంటారు.

ఇన్ ఫెక్షన్ వస్తుంది:

ఇలా కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో పెట్టడం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ వస్తుందట. వాటిని తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా కట్ చేసిన ఉల్లి పాయలను ఫ్రిజ్ లో ఉంచడం వల్ల చెడు వాసన వస్తుంది. ఆ స్మెల్ రిఫ్రిజిరేటర్ లో ఉంచిన ఇతర ఆహార పదార్థాలకు కూడా వ్యాపిస్తుంది. దీంతో అవి రుచిని కోల్పోతాయి.

ఇవి కూడా చదవండి

పోషక విలువలు తగ్గి పోతాయి:

తరిగిన ఉల్లి పాయల్లో తేమ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల వాటి ఆనియన్స్ క్రిస్పీ దనం కూడా కోల్పోతాయి. వాటికి అధిక తేమ తగలడం వల్ల అవి వ్యాధికారకాలకు దారి తీస్తాయి. అదే విధంగా ఉల్లి పాయల్లో పోషక స్థాయిలు కూడా తగ్గి పోతాయి. అవికాస్తా బ్యాక్టీరియాలకు పెరుగుదలకు దారి తీస్తాయి. తరిగిన ఉల్లి పాయలు రిఫ్రిజిరేటర్ చల్లని ఉష్ణోగ్రతలతో స్పందించగల ఎంజైమ్ లను కలిగి ఉంటాయి. ఈ ప్రతి చర్య సల్ఫరస్ సమ్మేళనాలు ఏర్పడటానికి దారి తీస్తుంది. ఎందుకంటే ఉల్లి పాయలు సల్ఫర్ ను కలిగి ఉంటాయి. ఆ ఉల్లి పాయలను మీ వంటల్లో అసహ్యకరమైన, చేదు రుచిని కలిగిస్తుంది. ఇవి గది ఉష్ణోగ్రత కంటే ఫ్రిజ్ లో అభివృద్ధి చెందే అవకాశం ఉంది.

ఉల్లి పాయలు తొక్కలు కూడా కట్ చేసి పెట్ట కూడదు:

దానికి తోడు ఆనియన్స్ కట్ చేసి పై తోలు తీసేసి నిల్వ చేయడం వల్ల మరో ప్రమాదం పొంచి ఉంది. ఉల్లి పాయలు కట్ చేస్తే ఉంచితే.. పలు రకాల రసాయనాలు విడుదల అవుతాయి. ఇవి బ్యాక్టీరియాను ఆకర్షించి వాటి పెరుగుదలకు కారణం అయ్యే పోషకాలుగా మారతాయి. ఉల్లి పాయలను 40 డిగ్రీల ఫారెన్హీట్ లేదా ఫ్రిజ్ లోపల 4.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సీలు చేసిన కంటైనర్ లో ఉంచడం ఉత్తమ మార్గం.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్