- Telugu News Photo Gallery Pregnant women consume more amniotic fluid when they eat such foods, check here is details
Pregnancy Care: గర్భిణిలకు ఉమ్మనీరు బాగా పడాలంటే ఈ ఆహారాలు తినండి!
ఆహారం తీసుకునే విషయంలో గర్బిణిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిడ్డ ఎదుగుదలకు అవసరం అయ్యే ఆహారాలు తీసుకోవాలి. అదే విధంగా ఉమ్మనీరు తగినంత ఉండేలా చూసుకోవాలి. ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటేనే.. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి పడకుండా, దెబ్బలు తగిలినా ఏం జరగకుండా కాపాడుతుంది. ఈ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నా.. తగినంత లేకపోయినా కూడా ప్రమాదమే. చాలా మంది గర్భిణిలకు డాక్టర్లు చెప్పడం కూడా చూశాం. అయితే కొంత మంది గర్భిణిలకు మాత్రం ఉమ్మ నీరు అనేది..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 19, 2023 | 5:20 PM

ఆహారం తీసుకునే విషయంలో గర్బిణిలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ముఖ్యంగా బిడ్డ ఎదుగుదలకు అవసరం అయ్యే ఆహారాలు తీసుకోవాలి. అదే విధంగా ఉమ్మనీరు తగినంత ఉండేలా చూసుకోవాలి. ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటేనే.. బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఒత్తిడి పడకుండా, దెబ్బలు తగిలినా ఏం జరగకుండా కాపాడుతుంది. ఈ ఉమ్మ నీరు ఎక్కువగా ఉన్నా.. తగినంత లేకపోయినా కూడా ప్రమాదమే. చాలా మంది గర్భిణిలకు డాక్టర్లు చెప్పడం కూడా చూశాం.

అయితే కొంత మంది గర్భిణిలకు మాత్రం ఉమ్మ నీరు అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఉమ్మ నీరు పెరగడానికి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఉంటారు. అలాంటి వారికి ఈ టిప్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఎలాంటి ఆహారాలు తింటే ఉమ్మ నీరు పెరుగుతుందో.. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఉమ్మనీరు పెరగాలంటే ముందు నీరు ఎక్కువగా తాగాలి. అదే విధంగా కొబ్బరి నీళ్లు కూడా ఎక్కువగా తీసుకుంటే మంచిది. కోకోనట్ వాటర్ లో పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి నీరసం రాకుండా ఉంటుంది. అంతే కాకుండా కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల ఉమ్మ నీరు కూడా పెరుగుతాయి.

ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తాగాలి. యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, ఆరెంజ్ ఇలాంటి పళ్ల రసాలు తాగితే.. వేగంగా ఉమ్మ నీరు అనేది వృద్ధి చెందుతుంది. అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కూడా తినొచ్చు.

ఇవే కాకుండా వాటర్ శాతం ఎక్కువగా ఉండే కీరా, టమాటా, క్యారెట్, బీట్ రూట్, క్యాలీ ఫ్లవర్, బ్రకొలీ, ఆకు కూరలు వంటివి తింటే పోషకాలు కూడా అందుతాయి. ఉమ్మ నీరు కూడా పడుతుంది. అలాగే సమ్మర్ సీజన్ లో లభించే మామిడి పండ్లు, పుచ్చ కాయ కూడా తింటే బిడ్డకు మరిన్ని పోషకాలు అదుతాయి.





























