Kitchen Hacks: గోడలపై ఆయిల్ మరకలు వదలడం లేదా.. అయితే ఇలా చేయండి!
దీపావళి పండుగ, కార్తీక మాసం వచ్చిందంటే ఇంటి ముందు గోడల మీద చాలా మంది దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా పెట్టేటప్పుడు ఒక్కోసారి గోడల మీద నూనె మరకలు పడటం కానీ లేదా ఆయిల్ పడి పోవడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ మొడి మరకలు అంత సులభంగా పోవు. వాటిని పోగొట్టడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీంతో నానా పాట్లు పడుతూంటారు. అయితే ఇకపై అంతగా శ్రమించాల్సిన పని లేదు. ఈ ఈజీ టిప్స్ తో వాటిని..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 19, 2023 | 5:21 PM

దీపావళి పండుగ, కార్తీక మాసం వచ్చిందంటే ఇంటి ముందు గోడల మీద చాలా మంది దీపాలను వెలిగిస్తూ ఉంటారు. ఇలా పెట్టేటప్పుడు ఒక్కోసారి గోడల మీద నూనె మరకలు పడటం కానీ లేదా ఆయిల్ పడి పోవడం సర్వ సాధారణమైన విషయం. అయితే ఈ మొడి మరకలు అంత సులభంగా పోవు. వాటిని పోగొట్టడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. దీంతో నానా పాట్లు పడుతూంటారు. అయితే ఇకపై అంతగా శ్రమించాల్సిన పని లేదు. ఈ ఈజీ టిప్స్ తో వాటిని తొలగించు కోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ముందుగా నూనె పడిన ప్రాంతాన్ని సుబ్బు నీటితో కడగాలి. ఆ తర్వాత ఒక పొడి గుడ్డ మీద కొద్దిగా వంట పాత్రలు క్లీన్ చేసుకునే లిక్విడ్ ని వేయండి. ఆ తర్వాత ఆ మరకలపై రుద్దండి. ఇలా చేయడం వల్ల నూనె మరకలు ఈజీగా పోతాయి.

గోడలపై ఆయిల్ మరకలు వదిలించు కోవడానికి మరో టిప్ ఏంటంటే.. మరకలు ఉన్న చోట బేకింగ్ సోడా వేయండి. దాన్ని అలాగే కాసేపు వదిలేయండి. బేకింగ్ సోడా నూనెను పీల్చుకుంటుంది. దీంతో ఆ మరక పోతుంది.

నిమ్మ రసంలో కూడా మరకలను తొలకించే గుణాలు ఉన్నాయి. నిమ్మ రసంతో నూనె మరకలను కూడా దూరం చేసుకోవచ్చు. ఆయిల్ మరలకు పడిన చోట.. కొద్దిగా నిమ్మ రసాన్ని వేసి కాసేపు అలా వదిలేయండి. ఆ తర్వాత తడి వస్త్రంతో నిమ్మ రసాన్ని తుడిచేయండి.

గోధుమ పిండితో కూడా ఈ మరకలను తొలగించు కోవచ్చు. ఆయిల్ మరకలు పడిన గోడలపై గోధుమ పిండి చల్లండి. ఓ గంట సేపు అలానే వదిలేయండి. గోధుమ పిండి.. ఆయిల్ పీల్చుకుంటుంది. దీంతో ఆ మరక పోతుంది. ఆ తర్వాత పిండి ఎత్తి పారేయండి. ఇలా చేస్తే మరకలు త్వరగా, ఈజీగా క్లీన్ అయిపోతాయి.





























