వరుసగా సినిమాలు చేస్తున్నా, స్టార్ లీగ్‌లో ముందున్నా ఏమాత్రం సక్సెస్‌ని నెత్తికెక్కించుకోలేదు శ్రీలీల. స్టార్లతో జోడీ కడుతున్నా, ఇంకా న్యూ కమర్‌లాగా, అప్‌కమింగ్ హీరోయిన్‌లాగానే ప్రవర్తిస్తున్నారు. గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ఈ ఏడాది ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ రిలీజులకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల ఫలితం ఎలా ఉన్నా శ్రీలీల కెరీర్ మాత్రం బేఫికర్. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో ఫస్ట్ పేరు ఈమెదే కాబట్టి.