- Telugu News Photo Gallery Cricket photos Tollywood To Bollywood Celebrities At ICC world cup 2023 Final, See photos
IND vs AUS, World Cup Final: బాలీవుడ్ టు టాలీవుడ్.. ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేసిన సినీ తారలు.. ఫొటోస్
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మందికి అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు మోడీ స్టేడియానికి వచ్చేశారు. ముఖ్యంగా పలువురు బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
Updated on: Nov 19, 2023 | 8:34 PM

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ జట్లు తలపడుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మందికి అభిమానులు ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు మోడీ స్టేడియానికి వచ్చేశారు. ముఖ్యంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు మ్యాచ్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ వైట్ మ్యాక్సీ గౌనులో కనిపించింది. అలాగే కేఎల్ రాహుల్ భార్య అతియా శెట్టి గ్యాలరీలో సందడి చేసింది. వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్, షారుఖ్ ఖాన్, ఆయన కుమార్తె సుహానా ఖాన్, ఆశా భోంస్లే, ఆయుష్మాన్ ఖురానా కూడా ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

అలియా భట్, అజయ్ దేవగన్ వంటి బాలీవుడ్ తారలు ఇంటి నుంచి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

ఇక టాలీవుడ్ విషయానికొస్తే.. విక్టరీ వెంకటేష్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించాడు. అలాగే నాని సల్మాన్ ఖాన్‌తో కలిసి ఫొటోలు దిగాడు. ఇక వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని టీమిండియా జెర్సీలు ధరించి మద్దతు తెలిపారు.




