- Telugu News Photo Gallery Cinema photos Hero Balakrishna New Movie With Heroine Rashmika Mandanna Details here Telugu Actress Photos
Rashmika Mandanna: డోంట్ మిస్.! బాలయ్యకు జోడీగా రష్మిక మందన్న.?
ట్విట్టర్‌లో టాప్ ఒన్‌లో ట్రెండ్ అవుతున్నారు రష్మిక మందన్న. బాలయ్య ఆమెకు ఐ లవ్యూ అని చెప్పడంతో ట్రెండింగ్‌లోకి వచ్చారా? లేకుంటే నేషనల్ క్రష్ ఫోన్ చేయగానే అటెండ్ చేసి, వాట్సాప్ రే అంటూ విజయ్ దేవరకొండ పలకరించడంతో ట్రెండ్ అవుతున్నారా? టాపిక్ ఏదైనా ట్రెండింగ్ మాత్రం అన్‌స్టాపబుల్. త్వరలోనే బాలయ్య, రష్మిక కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందా.? ఆహా అన్‌స్టాపబుల్ షో రోజు రోజుకీ బంపర్ హిట్ అవుతూనే ఉంది.
Updated on: Nov 20, 2023 | 10:24 AM

ట్విట్టర్‌లో టాప్ ఒన్‌లో ట్రెండ్ అవుతున్నారు రష్మిక మందన్న. బాలయ్య ఆమెకు ఐ లవ్యూ అని చెప్పడంతో ట్రెండింగ్‌లోకి వచ్చారా? లేకుంటే నేషనల్ క్రష్ ఫోన్ చేయగానే అటెండ్ చేసి, వాట్సాప్ రే అంటూ విజయ్ దేవరకొండ పలకరించడంతో ట్రెండ్ అవుతున్నారా? టాపిక్ ఏదైనా ట్రెండింగ్ మాత్రం అన్‌స్టాపబుల్.

త్వరలోనే బాలయ్య, రష్మిక కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందా.? ఆహా అన్‌స్టాపబుల్ షో రోజు రోజుకీ బంపర్ హిట్ అవుతూనే ఉంది. కొత్త ప్రోమో వచ్చిన ప్రతిసారీ కొన్ని పాయింట్స్ ఇన్‌స్టంట్‌గా వైరల్ అవుతున్నాయి.

లేటెస్ట్ యానిమల్ టీమ్‌తో బాలయ్య చేసిన హంగామా మామూలుగా లేదు. అందులోనూ రష్మిక గురించి బాలయ్య ఇచ్చిన ఇంట్రడక్షన్ ఇంకో లెవల్లో ఉంది. నా మైండ్ బ్యాలన్స్ లో లేదిక, ఎందుకో ఈ తికమక, వచ్చేయమ్మా రష్మిక అంటూ బాలయ్య ఇన్వైట్ చేసిన తీరు ఫిదా అవుతున్నారు నేషనల్ క్రష్ ఫ్యాన్స్.

నీతో మెలికలు తిరుగుతుంటే, నా గుండె మెలికలు తిరుగుతుందంటూ బాలయ్య ఇచ్చిన కాంప్లిమెంట్‌కి రష్మిక నవ్విన తీరు ఆసమ్ అంటున్నారు జనాలు. అంతే కాదు, బాలయ్య, రష్మిక సిల్వర్ స్క్రీన్ జోడీ అదిరిపోతుందంటూ, త్వరలోనే అది జరగాలంటూ కోరుకుంటున్నారు అభిమానులు.

విజయ్ దేవరకొండ వర్సెస్ రణ్‌బీర్ కపూర్ ఫొటోలు స్క్రీన్ మీద డిస్‌ప్లే అయినప్పుడు, ఇద్దరిలో ఎవరు బెటర్ హీరో అని అడగమని రణ్‌బీర్ అనడం ప్రోమోలో వైరల్ అవుతున్న షాట్.

అంతకు మించి గూస్ బంప్స్ తెప్పించిన మొమెంట్... వాట్సప్ రే అంటూ వినిపించిన విజయ్ దేవరకొండ వాయిస్. ఆ ఫోన్ కాల్‌కి రష్మిక ఎక్స్ ప్రెషన్స్, ఆడియన్స్ చియరప్ చేయడం... హ్యాపీ వైబ్స్ ని పోట్రే చేశాయి.

ఆ వెంటనే మీ హీరోకి చెప్పమ్మా. ఐ లవ్ రష్మికా అంటూ బాలయ్య సరదాగా చెప్పడంతో ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్‌కి చేరుకుంది. ప్రోమోలో రష్మిక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయినప్పటికీ, బాలయ్య డైలాగులను రణ్‌బీర్ కపూర్ తెలుగులో చెప్పిన తీరుకి ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్.




