Dondakaya Karam: దొండకాయ కారం ఇలా చేయండి.. ఇష్టం లేని వాళ్లు కూడా తినేస్తారు!

వంటల్లో ఉపయోగించే కాయగూరల్లో దొండ కాయలు కూడా ఒకటి. చాలా మందికి దొండ కాయలు అంటే ఇష్టం ఉండదు. దీంతో వాటిని తినడమే మానేస్తారు. కానీ దొండ కాయలతో ఫ్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ కాయలతో ఫ్రై ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. అయితే దొండకాయతో చేసే దొండకాయ కారం కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఫంక్షన్ లలో కూడా ఈ దొండ కాయ కారాన్ని చేస్తూ ఉంటారు. దొండ కాయ కారాన్ని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ దొండ కాయ కారాన్ని..

Dondakaya Karam: దొండకాయ కారం ఇలా చేయండి.. ఇష్టం లేని వాళ్లు కూడా తినేస్తారు!
Dondakaya Karam
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Nov 18, 2023 | 12:05 PM

వంటల్లో ఉపయోగించే కాయగూరల్లో దొండ కాయలు కూడా ఒకటి. చాలా మందికి దొండ కాయలు అంటే ఇష్టం ఉండదు. దీంతో వాటిని తినడమే మానేస్తారు. కానీ దొండ కాయలతో ఫ్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. దొండ కాయలతో ఫ్రై ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. అయితే దొండకాయతో చేసే దొండకాయ కారం కూడా ఒకటి. ఇది చాలా రుచిగా ఉంటుంది. ఫంక్షన్ లలో కూడా ఈ దొండ కాయ కారాన్ని చేస్తూ ఉంటారు. దొండ కాయ కారాన్ని సైడ్ డిష్ గా తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది చేయడం కూడా చాలా సింపుల్. మరి ఈ దొండ కాయ కారాన్ని ఎలా తయారు చేస్తారు? కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దొండ కాయ కారానికి కావాల్సిన పదార్థాలు:

దొండ కాయలు, కారం, పచ్చి మిర్చి, ఉల్లి పాయలు, నూనె, పసుపు, ఉప్పు, కరివే పాకు, కొత్తి మీర, శనగ పప్పు, మినపప్పుచ ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పల్లీలు, తాళింపు దినుసులు.

ఇవి కూడా చదవండి

దొండ కాయ కారం తయారీ విధానం:

ముందుగా ఒక చిన్న కడాయి తీసుకోవాలి. కడాయి బాగా వేడెక్కాక శనగ పప్పు, మినపప్పు, ధనియాలు, జీల కర్ర, నువ్వులు, ఎండు కొబ్బరి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగిస్తూ ఉండాలి. తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బులు కూడా వేసి బరకగా మిక్సీ పట్టు కోవాలి. తర్వాత ఇప్పుడు మరో కడాయి తీసుకోవాలి. ఇప్పుడు నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక.. పల్లీలు మిక్సీ పట్టుకోవాలి. వేరు శనగ గుళ్లు ఎర్రగా వేగాక.. తాళింపులు వేసి వేయించు కోవాలి.

ఆ నెక్ట్స్ పచ్చి మిర్చి, ఉల్లి పాయలు కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకూ ఫ్రై చేసు కోవాలి. ఆ తర్వాత కొద్ది పసుపు, ఉప్పు, సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న దొండ కాయ ముక్కలు వేసి వేయించు కోవాలి. వీటిపై మూత పెట్టి మధ్యలో కలుపుగా మీడియం మంట పెట్టాలి. ఇలా ఓ 10, 15 నిమిషాలు ముక్కలు వేయించు కోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పొడి వేసి బాగా కలుపు కోవాలి. అంతే ఎంతో టేస్టీ దొండ కాయ కారం రెడీ. దీన్ని నేరుగా అన్నంలో కూడా కలుపుకుని తినొచ్చు. లేదా సైడ్ డిష్ గా కూడా తినవచ్చు.