- Telugu News Photo Gallery Best health benefits of eating green chilies in Winter season, check here is details
Green Chilies Benefits: చలి కాలంలో పచ్చి మిరపకాయలను ఎక్కువగా తింటే జరిగేది ఇదే!
వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వంటల్లో పచ్చి మిరప కాయలు కూడా ఒకటి. పచ్చి మిర్చి లేనిదే ఏ వంట కూడా పూర్తి కాదు. ఉల్లి పాయలు లేకుండా అయినా కూరలు చేయవచ్చు కానీ.. పచ్చి మిర్చి లేకుండా వంట చేయాలంటే కష్టమే. అంతే కాదు వేపుళ్లు వంటి వాటికి టేస్ట్ ని తీసుకొచ్చేది కూడా పచ్చి మిర్చే. క్రమం తప్పకుండా పచ్చి మిర్చి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవును మీకు తెలుసా.. పచ్చి మిర్చిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు వీటని ఉపయోగిస్తూఉంటారు. ముఖ్యంగా రక్త పోటును, చక్కెర..
Chinni Enni | Edited By: Ravi Kiran
Updated on: Nov 18, 2023 | 12:10 PM

వంటల్లో ఎక్కువగా ఉపయోగించే వంటల్లో పచ్చి మిరప కాయలు కూడా ఒకటి. పచ్చి మిర్చి లేనిదే ఏ వంట కూడా పూర్తి కాదు. ఉల్లి పాయలు లేకుండా అయినా కూరలు చేయవచ్చు కానీ.. పచ్చి మిర్చి లేకుండా వంట చేయాలంటే కష్టమే. అంతే కాదు వేపుళ్లు వంటి వాటికి టేస్ట్ ని తీసుకొచ్చేది కూడా పచ్చి మిర్చే. క్రమం తప్పకుండా పచ్చి మిర్చి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. అవును మీకు తెలుసా.. పచ్చి మిర్చిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి.

ఆయుర్వేదంలో కూడా కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు వీటని ఉపయోగిస్తూఉంటారు. ముఖ్యంగా రక్త పోటును, చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకోవచ్చు. అయితే చలి కాలంలో పచ్చి మిర్చి తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి మిర్చిని రెగ్యులర్ గా తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా రక్త పోటును అదుపులో ఉంచుతుంది. పచ్చి మిర్చిలో ఉండే యాంటీ హైపర్టెన్సివ్ లక్షణాలు అధిక రక్త పోటును కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి.

కళ్ల ఆరోగ్యం పెంచడంలో కూడా పచ్చి మిర్చి ఉపయోగ పడతాయి. పచ్చి మిర్చిలో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ లు అనేవి మెండుగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి.

అంతే కాకుండా పచ్చి మిర్చిలో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు.. రక్తంలో షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తాయి. అలాగే పచ్చి మిరప కాయల్లో కెలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడంలో కూడా సహాయ పడుతుంది. అదే విధంగా పచ్చి మిర్చిలో విటమిన్లు సి, ఇలు ఉంటాయి. ఇవి చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో హెల్ప్ అవుతాయి.





























