Avocado Oil for Skin: ఈ నూనెను రాత్రి పడుకునే ముందు ముఖంపై రాస్తే స్కిన్ సమస్యలన్నీ దూరం!
అవకాడో గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దీని గురించి అందరికీ తెలుసు. అవకాడాలో ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, ఇ, కె, మెగ్నీషియం, నియాసిన్, సోడియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ కొవ్వులు వంటివి ఉంటాయి. అవకాడో ఆరోగ్య పరంగానే కాకుండా.. సౌందర్య పరంగా వాడినా కూడా మంచి బెనిఫిట్సే ఉన్నాయి. అవకాడోను సీరమ్ లు, మాస్క్ లు, మాయిశ్చ రైజర్లు..
Chinni Enni | Edited By: Ram Naramaneni
Updated on: Nov 17, 2023 | 9:56 PM

అయితే మార్కెట్లో అవకాడో ధర అధికంగా ఉంటుంది. దీని అధిక ధర కారణంగా చాలా మంది దీనిని తినేందుకు సాహసించరు. మరైతే ఎలా అనుకుంటున్నారా?అందుకు ఓ పరిష్కారం ఉంది. అవకాడో కొని తినలేకపోతే.. దానికి బదులుగా రోజువారీ ఆహారంలో అరటిపండ్లు, బాదం, చియా గింజలు, వేరుశెనగలు తిన్నా సరిపోతుంది.

తేమగా ఉంచుతుంది: అవకాడో ఆయిల్ ని స్కిన్ పై రాసుకోవడం వల్ల తేమగా, సాఫ్ట్ గా తయారవుతుంది. విటమిన్ ఇ, పొటాషియం అనే పోషకాలు చర్మాన్ని సున్నితంగా, తేమగా మార్చడంలో హెల్ప్ చేస్తాయి. సహజంగానే ఈ ఆయిల్ లో మాయిశ్చ రైజింగ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి.

మొటిమలకు చెక్: అవకాడో ఆయిల్ రాసుకోవడం వల్ల తక్కువ సమయంలోనే మొటిమలు అనేది తగ్గి పోతాయి. రాత్రి పూట అవకాడో ఆయిల్ ని రాసుకుని.. సున్నితంగా మసాజ్ చేయండి. ఉదయం నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే మొటిమలు త్వరగా పోతాయి.

దీనితో పాటు ఆహారంలో ఫైబర్, మోనోశాచురేటెడ్ కొవ్వులను కూడా చేర్చుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో అవకాడో పాత్ర కీలకమైనది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరిగితే, దాని వల్ల అనేక సమస్యలు పుట్టుకొస్తాయి.

జుట్టుకు కూడా మంచిది: అవకాడో ఆయిల్ కేవలం స్కిన్ కి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా మంచి పోషణ అందిస్తుంది. ఈ ఆయిల్ లో ఉండే విటమిన్లు బి, ఇలు.. జుట్టుకు సహజంగా మాయిశ్చరైజింగ్ అందిస్తాయి. అంతే కాకుండా కుదుళ్లకు మసాజ్ చేస్తే బలంగా మారతాయి.





























